సెన్సెక్స్ 600 పాయింట్లు జంప్..
By Sakshi

ఇండియన్ స్టాక్ మార్కెట్ శుక్రవారం జోరుమీదుంది. గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన ఇండెక్స్‌లు అదే ఊపును కొనసాగిస్తున్నాయి. ఉదయం 10:53 సమయంలో సెన్సెక్స్ 651 పాయింట్ల లాభంతో 34,652 వద్ద, నిఫ్టీ 198 పాయింట్ల లాభంతో 10,432 వద్ద ట్రేడవుతున్నాయి. క్రూడ్ ధరలు తగ్గడం, రూపాయి బలోపేతమవ్వడం వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 34,702 పాయింట్ల గరిష్ట స్థాయిని, 34,279 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 10,449 పాయింట్ల గరిష్ట స్థాయిని, 10,322 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. నిఫ్టీ-50లో బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ, యస్ బ్యాంక్, ఐటీసీ, ఎంఅండ్ఎం షేర్లు 4 శాతానికిపైగా ఎగశాయి. హిందుస్తాన్ పెట్రోలియం, యూపీఎల్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, హిందాల్కో, అదానీ పోర్ట్స్ స్టాక్స్ 3 శాతానికి పైగా పెరిగాయి. ఇదేసమయంలో టీసీఎస్ 3 శాతానికిపైగా పతనమైంది. హెచ్‌సీఎల్ టెక్ 2 శాతానికిపైగా పడిపోయింది. సెక్టోరల్ ఇండెక్స్‌లలో నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫార్మా మినహా మిగతావన్నీ లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ గరిష్టంగా 3 శాతానికిపైగా పెరిగింది. కాగా గురువారం కుదేలైన ఇండియన్ స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ తన మునపటి ముగింపు 34,001 పాయింట్లతో పోలిస్తే 290 పాయింట్ల లాభంతో 34,291 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,234 పాయింట్లతో పోలిస్తే 97 పాయింట్ల లాభంతో 10,331 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.
You may be interested
యస్ బ్యాంక్ చీఫ్ అప్డేట్.. షేరు 4%అప్
Friday 12th October 2018ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ చీఫ్ వెతుకులాటలో ఒక అప్డేట్ వెలువడింది. బ్యాంక్ కొత్త ఎండీ, సీఈవో ఎంపికలో సెర్చ్ అండ్ సెలెక్షన్ కమిటీకి సాయమందించేందుకు యస్ బ్యాంక్ తాజాగా అమెరికాకు చెందిన అడ్వైజరీ సంస్థ ‘కార్న్ ఫెర్రీ’ను నియమించుకుంది. యస్ బ్యాంక్‌కు నాలుగు గ్లోబల్ లీడర్షిప్ అడ్వైజరీ సంస్థల నుంచి ప్రతిపాదనలు అందాయి. గురువారం జరిగిన సమావేశంలో బ్యాంక్ వీటిల్లోంచి కార్న్ ఫెర్రీని ఎంపిక చేసుకుంది. కాగా ఆర్బీఐ..
2 నెలల గరిష్టానికి పసిడి
Friday 12th October 2018అమెరికా మార్కెట్లో బాండ్ ఈల్డ్ పెరగడంతో పాటు, డాలర్ ఇండెక్స్ దిగిరావడం ప్రపంచమార్కెట్లో పసిడి ధర 2నెలల గరిష్టానికి చేరుకుంది. ప్రపంచ మార్కెట్లతో పాటు నెలకొన్న అమెరికా మార్కెట్లో నెలకొన్న అమ్మకాల భయాల నేపథ్యంలో డాలర్ ఇండెక్స్ పతనం కారణంగా ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా పసిడి పెట్టుబడులకు మొగ్గుచూపారు. ఫలితంగా ఔన్స్ ధర పసిడి ధర గురువారం రాత్రి అమెరికా మార్కెట్లో 34.20డాలర్ల వరకు పెరిగి 1,227.60 డాలర్ల వద్ద ముగిసింది.