STOCKS

News


ప్రతికూలంగా ఉన్నా.. ఈ స్టాకులు రాణిస్తాయి

Saturday 13th July 2019
Markets_main1563002203.png-27042

బడ్జెట్‌లో పబ్లిక్‌ హోల్డింగ్‌, సర్‌చార్జీలను పెంచడంతో బెంచ్‌మార్క్‌ నిఫ్టీ గత వారం నుంచి నష్టాల్లో ముగుస్తోంది. జులై 9 న 11,461  కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఇప్పటికి కూడా ఆ స్థాయి దగ్గర్లోనే ట్రేడవుతోంది. 11,600  స్థాయిని పొందేందుకు బలహీనమైన ప్రయత్నాలను చేస్తుంది. బడ్జెట్‌ ఆందోళనల నేపథ్యంలో  వచ్చే వారం కూడా మార్కెట్లు నెగిటివ్‌గానే ట్రేడయ్యే అవకాశం ఉంది. 
    సాంకేతికంగా చెప్పాలంటే నిఫ్టీ 50  ఇండెక్స్‌ రోజువారి చార్ట్‌లలో బేరిష్‌గా ఉంది. అంతేకాకుండా రోజువారి చార్టులలో 20, 50 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ కన్నా తక్కువగా నమోదవుతోంది. డైలి చార్టులో ఆర్‌ఎస్‌ఐ(రిలేటివ్‌ స్ట్రంథ్‌ ఇండెక్స్‌) దిగువకు పడిపోతుంది. ఇది ప్రస్తుతం 41.07 స్థాయి వద్ద  బలహీనంగా ఉంది. ఈ స్థాయిని దాటిపోతే ఈ సూచీ మరింత కిందికి వెళ్లే అవకాశం ఉంది. 
    ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎల్‌ఐసీ, హౌసింగ్‌ ఫైనాన్స్‌, కోటక్‌ మహింద్రా బ్యాంక్‌ వంటి  ఫైనాన్సియల్‌, బ్యాంకింగ్‌ రంగ కంపెనీల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో రానున్న త్రైమాసికంలోని అవకాశాలపై కొంత స్పష్టత రావచ్చు.  
బాండ్‌ ఈల్డ్‌లు తగ్గడంతో బ్యాంక్‌ ట్రెజరీలు లాభపడవచ్చు. అంతేకాకుండా ఆస్తీ నాణ్యత మెరుగుపడుతుండడం వంటివి వచ్చే త్రైమాసిక ప్రాథమిక అంశాలకు సహాయపడుతుంది. మద్యస్థ కాలానికి గాను ఎస్‌బీఐ, పీఎన్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ, యస్‌ బ్యాంక్‌ షేర్లు సానుకూలంగా ఉన్నాయి. స్టీల్‌, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లలలో బేరిష్‌ మూవ్‌మెంట్‌ నడుస్తోంది. పార్మా, సిమెంట్‌ సెక్టార్‌ షేర్లలలో అప్‌ట్రెండ్‌ ఉండవచ్చు. 
    డబ్యూపీఐ ద్రవ్యోల్బణ డేటా జులై 15 న రానుండగా, అంతర్జాతీయంగా కొర్‌ రిటైల్‌ అమ్మకాలు, రిటైల్‌ అమ్మకాల డేటా, ఫెడ్‌ చైర్మన్‌ పోవెల్‌ స్పీచ్‌ జులై 16 వెలువడనున్నాయి. ఎఫ్‌ఓఎంసీ మెంబర్‌ ఈవన్స్‌ జులై 17న మాట్లాడనున్నారు. జులై 18న పిల్లై ఫెడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఇండెక్స్‌, నిరుద్యోగ క్లైమ్స్‌ రానున్నాయి.  ఈ అంశాలన్ని వచ్చే వారం మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి.
 
మంచి లాభాలను ఇచ్చే టాప్‌ స్టాకులు:
అల్ట్రాటెక్‌ సిమెంట్‌: రూ.4,620 పైన కొనవచ్చు; టార్గెట్‌ : రూ. 4,795; స్టాప్‌ లాస్‌: రూ.4,445
అల్ట్రాటెక్‌ సిమెంట్‌ రూ.4,400 దిగువన ట్రేడవ్వలేదు. ఇది ఆ స్థాయి నుంచి పైకి వెళ్లింది. ప్రస్తుతం రోజువారి చార్టులలో 20, 50 రోజుల మూవింగ్‌ యావరేజికి పైన ఉంది. రోజువారి చార్టులలో ఎంఏసీడీ అప్‌వార్డ్‌గా ఉండగా ఆర్‌ఎస్‌ఐ కూడా కనిష్ఠ స్థాయి నుంచి కోలుకొని ప్రస్తుతం 51.87 వద్ద ఉంది. 
అపోలో హాస్పిటల్స్‌: రూ. 1,370 పైన కొనవచ్చు; టార్గెట్‌: రూ. 1,425; స్టాప్‌ లాస్‌: రూ. 1,315
50 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ మద్ధతుతో రూ.1,290 స్థాయి నుంచి పెరిగి రోజువారి చార్టులలో 20 రోజుల మూవింగ్‌ యావరేజి కన్నా పైన ముగిసింది.  డైలి చార్టులో ఎంఏసీడీ  అప్‌వార్డ్‌గా ఉండగా, ఆర్‌ఎస్‌ఐ కొనుగోలును సూచీస్తోంది. ఇది ప్రస్తుతం డైలి చార్టులో 58.76 స్థాయిలో ఉంది. 
ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌(ప్యూచర్‌): రూ.532 కు దిగువన అమ్మవచ్చు; టార్గెట్‌ : రూ.510; స్టాప్‌ లాస్‌: రూ.554
ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌(ప్యూచర్‌) త్రీ డార్క్‌ క్రోవ్స్‌ నమూనాను పోలిన నమూనాను ఇప్పటికి ఏర్పటుచేసింది. డైలి చార్టులో 20,50 రోజుల మూవింగ్‌ యావరేజి కన్నా దిగువన ముగిసింది. ఎంఏసీడీ దిగువవైపు ట్రెండ్‌ను సూచీస్తుండగా, ఆర్‌ఎస్‌ఐ ఇండెక్స్‌ ‘అమ్మకం’ సిగ్నల్‌ను సూచీస్తోంది. ప్రస్తుతం డైలి చార్టులో ఆర్‌ఎస్‌ఐ 44.07 స్థాయిలో ఉంది.

 



You may be interested

పసిడికి వడ్డీరేట్ల కోత అంచనాల జోష్‌..!

Saturday 13th July 2019

పసిడి ధర రాత్రి అమెరికా మార్కెట్లో 11డాలర్లు లాభపడి 1,412.20 డాలర్ల వద్ద స్థిరపడింది. ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు మరింత బలపడటం ఇందుకు కారణమైంది. వడ్డీరేట్లపై ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ మెతక ధోరణి వాఖ్యలు పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మద్దతినిస్తున్నాయి. ప్రొడ్యూసర్ ప్రైజెస్‌ గణాంకాలు అంచనాలకు మించి నమోదుకావడంతో పాటు, అమెరికా సూచీలు గరిష్టస్థాయిని అందుకున్న నేపథ్యంలో ఉదయం అక్కడి మార్కెట్లో కొంత అ‍మ్మకాల ఒత్తిడిని

రెండోరోజూ రికార్డు ముగింపే..

Saturday 13th July 2019

ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు మరింత బలపడటంతో అమెరికా మార్కెట్లు శుక్రవారం వరుసగా రెండోరోజూ రికార్డు గరిష్ట స్థాయిలోనే ముగిశాయి. రెండురోజుల కిత్రం అమెరికా కాంగ్రెస్‌ ఎదుట ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ ప్రసంగిస్తూ ‘‘తయారీ రంగ మందగమనం, ద్రవ్యోల్బణం, వాణిజ్య యుద్ధాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇంకా ముప్పు పొంచి ఉం‍ది. సెంట్రల్ బ్యాంక్ పరిస్థితులకు అనుగుణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది’’ అన్నారు. రానున్న రోజుల్లో ఫెడ్‌రిజర్వ్‌

Most from this category