STOCKS

News


ఆరంభ లాభాలు ఆవిరి!

Wednesday 13th February 2019
Markets_main1550053448.png-24180

10800 పాయింట్ల దిగువకు నిఫ్టీ
బుధవారం లాభాలతో ఆరంభించిన సూచీలు చివర వరకు జోరు కొనసాగించలేకపోయాయి. మధ్యాహ్నం వరకు ఎంతో కొంత లాభాల్లో ట్రేడయిన సూచీలు చివరకు మ్రాతం నష్టాల్లోనే ముగిసాయి. బుధవారం సెన్సెక్స్‌ 120 పాయింట్ల నష్టంతో 36034 పాయింట్ల వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో 10794 పాయింట్ల దిగువన క్లోజయ్యాయి. దాదాపు రెండువారాల తర్వాత నిఫ్టీ మరలా 10800 పాయింట్ల దిగువన క్లోజయి బేరిష్‌నెస్‌ చూపింది. ఇంట్రాడేలో నిఫ్టీ 10890 పాయింట్ల వరకు పైకి ఎగిసింది. ఐటీ, రియల్టీ మినహా దాదాపు అన్ని రంగాల సూచీలు నెగిటివ్‌గానే ముగిశాయి. మిడ్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు సైతం దాదాపు అరశాతానికి మించి నష్టపోయాయి. అశోక్‌లేలాండ్‌, ఎంఅండ్‌ఎం సహా చాలా స్టాకులు బుధవారం ఏడాది కనిష్ఠాలను తాకాయి.

ఈ రోజు ట్రేడింగ్‌లో అదానీ పోర్ట్స్‌, ఐబీహౌసింగ్‌, యూపీఎల్‌, టాటా మోటర్స్‌, హెచ్‌సీఎల్‌టెక్‌ షేర్లు దాదాపు 1-5 శాతం వరకు లాభపడ్డాయి. ఐషర్‌మోటర్స్‌, ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఎస్‌బీఐ తదితర షేర్లు సుమారు 1-5 శాతం నష్టపోయాయి. ప్రపంచ మార్కెట్లు గత కొన్ని సెషన్లుగా పాజిటివ్‌గా స్పందిస్తున్నా, దేశీయ మార్కెట్లు మాత్రం విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ వారం ఎన్‌ఎస్‌ఈ ప్రవేశపెట్టిన వారాంతపు నిఫ్టీ ఆప్షన్స్‌ సైతం సూచీల కదలికలను పరిమితం చేస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. గురువారం ట్రేడింగ్‌ ముగిసేవరకు సూచీల తదుపరి కదలికలపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. 



You may be interested

ప్రమోటర్ల వాటాల తాకట్టుతో చిక్కులే!

Thursday 14th February 2019

ప్రమోటర్లు కంపెనీల్లో తమకున్న వాటాలను తాకట్టు పెట్టే ధోరణి మన మార్కెట్లో క్రమంగా విస్తరిస్తోంది. ప్రమోటర్లు వ్యాపార అవసరాల కోసం తీసుకునే రుణాలకు తమ షేర్లను తనఖాగా ఉంచడం ఒక కోణం అయితే... తమ వ్యక్తిగత వ్యాపారాల కోసం ఒక కంపెనీలో వాటాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం మరో కోణం. అయితే, ఇక్కడ ప్రమోటర్ల సామర్థ్యం, మార్కెట్‌ పరిస్థితులు, భవిష్యత్తులో వారి వ్యాపారాలు ఎదుర్కొనే సమస్యలు ఇవన్నీ కూడా

ఎంపిక చేసిన మిడ్‌క్యాప్స్‌ను కొనొచ్చు!

Wednesday 13th February 2019

యస్‌ సెక్యూరిటీస్‌ సూచన కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చిందనే విషయంతో సంబంధం లేకుండా మార్కెట్‌ల పనితీరును అర్ధం చేసుకోవాలని యస్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి ప్రశాంత్‌ ప్రభాకరన్‌ సూచించారు. ప్రభుత్వాల ఏర్పాటు మార్కెట్‌పై చూపే ప్రభావం స్వల్పకాలికమన్నారు. స్టాక్‌ ఫండమెంటల్సే మార్కెట్‌ను ముందుకు నడుపుతాయన్నారు. ప్రస్తుత వాల్యూషన్లను పరిగణనలోకి  తీసుకుంటే లార్జ్‌క్యాప్స్‌ కన్నా మిడ్‌క్యాప్స్‌ను ఎంచుకోవడం ఉత్తమమని సలహా ఇచ్చారు. వాల్యూషన్ల పరంగా పెద్ద స్టాకుల కన్నా చిన్నస్టాకులు చౌకగా ఉన్నాయని చెప్పారు.

Most from this category