STOCKS

News


ఎయిర్‌టెల్ పేమెంట్స్‌ బ్యాంకుకు ఊరట

Thursday 12th July 2018
news_main1531404256.png-18252

న్యూఢిల్లీ: కొత్తగా మళ్లీ ఖాతాదారులను చేర్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్‌ నుంచి అనుమతులు లభించినట్లు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తెలియజేసింది. అలాగే ఖాతాదారుల వివరాల ధృవీకరణ కోసం ఆధార్‌ ఈ-కేవైసీని ఉపయోగించుకునేందుకు విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికార సంస్థ యూఐడీఏఐ నుంచి కూడా అనుమతి లభించినట్లు తెలియజేసింది. ఎయిర్‌టెల్ మొబైల్‌ సబ్‌స్క్రయిబర్ల అనుమతి లేకుండానే వారి పేరున ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాలు తెరవడం, కోట్ల కొద్దీ రూపాయల వంటగ్యాస్ సబ్సిడీ మొత్తాలు వీటిల్లోకి మళ్లడం.. కొన్నాళ్ల కిందట వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీంతో కొత్త కస్టమర్లను చేర్చుకోరాదంటూ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ను ఆర్‌బీఐ ఆదేశించింది. అలాగే ఆధార్ డేటా బేస్‌ను ఉపయోగించుకోకుండా టెలికం సంస్థ ఎయిర్‌టెల్‌, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కి ఇచ్చిన ఈ-కేవైసీ లైసెన్సులను యూఐడీఏఐ సస్పెండ్ చేసింది కూడా. ఈ ఏడాది మార్చిలో ఎయిర్‌టెల్‌ లైసెన్సును పునరుద్ధరించినప్పటికీ, పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సుపై సస్పెన్షన్ కొనసాగింది. తాజాగా ఏడు నెలల తర్వాత మళ్లీ ఆధార్ ఈ-కేవైసీని ఉపయోగించుకునేందుకు పేమెంట్స్‌ బ్యాం‍క్‌కు యూఐడీఏఐ అనుమతులిచ్చింది. 



You may be interested

కర్ణాటక బ్యాంక్‌ లాభం రూ.163 కోట్లు

Thursday 12th July 2018

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ కర్ణాటక బ్యాంక్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 22 శాతం వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.134 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.163 కోట్లకు చేరుకున్నట్లు కర్ణాటక బ్యాంక్‌ తెలిపింది. బ్యాంక్‌ చరిత్రలో ఇదే అత్యధిక త్రైమాసిక లాభమని బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ ఎమ్‌.ఎస్‌.మహాబలేశ్వర చెప్పారు. రుణ నాణ్యత మెరుగుపడటం, నికర వడ్డీ

మరో 20 నగరాలకు ట్రూజెట్‌ సేవలు!

Thursday 12th July 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: టర్బో మేఘ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానయాన సంస్థ ‘ట్రూజెట్‌’... వచ్చే మార్చి నాటికి మరో 20 నగరాల్లోకి అడుగుపెట్టనుంది. తక్కువ ధరలో సామాన్యులకూ విమాన సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉడాన్‌ పథకంలో భాగంగా అహ్మదాబాద్‌ నుంచి కాండ్లా, పోర్‌బందర్‌, కేశోడ్‌, జైసల్మేర్‌, జల్గావ్‌, నాసిక్‌ నగరాలకు ట్రూజెట్‌ సర్వీసులు నడపనుంది. అలాగే అస్సాం రాజధాని గువహటి నుంచి బర్న్‌పూర్‌, కూచ్‌

Most from this category