STOCKS

News


ఎల్‌ఐసీ ఓపెన్‌ ఆఫర్‌ డిసెంబర్‌ 3 నుంచి

Friday 12th October 2018
news_main1539318624.png-21073

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌ షేర్ల కోసం ఎల్‌ఐసీ ఓపెన్‌ ఆఫర్‌ డిసెంబర్‌ 3 నుంచి ప్రారంభం కానున్నది. ఓపెన్‌ ఆఫర్‌లో భాగంగా ఒక్కొక్క ఐడీబీఐ బ్యాంక్‌ షేర్‌ను రూ.61.73 ధరకు ఎల్‌ఐసీ కొనుగోలు చేయనున్నదని ఐడీబీఐ బ్యాంక్‌ తెలిపింది. ఈ  ఓపెన్‌ ఆఫర్‌ డిసెంబర్‌​14న ముగుస్తుంది. ఓపెన్‌ ఆఫర్‌లో భాగంగా 26 శాతం వాటాకు సమానమైన 204, 15, 12, 929 షేర్లను ఎల్‌ఐసీ కొనుగోలు చేస్తుంది. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటా కొనుగోలు ప్రక్రియలో భాగంగా ఎల్‌ఐసీ ఈ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటిస్తోంది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీకి 14.90 శాతం వాటా ఉంది. 



You may be interested

భారత్‌లో నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రం

Friday 12th October 2018

న్యూఢిల్లీ: భారత్‌ను నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రానికి వేదికగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) ఎంచుకుంది. ఈ కేంద్రాన్ని ప్రధాని మోదీ గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ప్రభుత్వం, వ్యాపార సంస్థలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి నూతన టెక్నాలజీ విధానాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేయనుంది. ఈ కేంద్రం మహారాష్ట్రలో ఏర్పాటు కానుంది. డ్రోన్లు, కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌), బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీలను తొలి మూడు

బీఓబీ సీఈఓ పదవీకాలం పొడిగింపు

Friday 12th October 2018

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) ఎండీ, సీఈఓ పి.ఎస్‌.జయకుమార్‌ పదవీకాలం మరో ఏడాది వరకు పొడిగించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2015లో పదవీ బాధ్యతలు చేపట్టిన ఈయన పదవీకాలం ఈ ఏడాది అక్టోబరు 12న (శుక్రవారం) పూర్తికానుండగా.. వచ్చే ఏడాది అక్టోబరు 12 వరకు పొడగిస్తున్నట్లు క్యాబినెట్‌ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. బీఓబీలో పదవీ బాధ్యతలు చేపట్టకముందు.. వాల్యూ బడ్జెట్‌ హౌసింగ్‌ (వీబీహెచ్‌సీ) కో-ఫౌండర్‌, సీఈఓగా కొనసాగారు.

Most from this category