STOCKS

News


ఎయిరిండియా ముంబై భవంతిపై ఎల్‌ఐసీ ఆసక్తి

Saturday 8th December 2018
news_main1544240677.png-22750

ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎయిరిండియాకు దక్షిణ ముంబైలో ఉన్న 23 అంతస్తుల భవంతిపై పలు ప్రభుత్వ రంగ సంస్థలు కన్నేశాయి. ఈ ప్రాపర్టీని విక్రయించాలా వద్దా అనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ అంతకన్నా ముందే ఎల్‌ఐసీ, జీఐసీ వంటి ప్రభుత్వ రంగ బీమా దిగ్గజాలు దీనిపై ఆసక్తి వ్యక్తం చేసినట్లు ఎయిర్‌లైన్‌ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దక్షిణ ముంబైలోని కీలక వ్యాపార కేంద్రం నారిమన్ పాయింట్‌లో ఈ భవంతి ఉంది. ఇది తమ తమ ప్రధాన కార్యాలయాలకు దగ్గర్లో ఉండటంతో ఎల్‌ఐసీ, జీఐసీ వంటి సంస్థలు దీనిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 2013- 2018 ఆర్థిక సంవత్సరాల మధ్య ఈ ప్రాపర్టీపై లీజు రెంటల్స్ రూపంలో ఎయిరిండియాకు రూ.291 కోట్ల ఆదాయం వచ్చింది. అటు జవహర్‌లాల్ నెహ్రు పోర్ట్ ట్రస్టు (జేఎన్‌పీటీ) కూడా దీనిపై ఆసక్తిగా ఉంది. దాదాపు రూ.55,000 కోట్ల మేర రుణ భారం పేరుకుపోయిన నేపథ్యంలో.. ప్రధాన వ్యాపారేతర ఆస్తులను విక్రయించడం ద్వారా భారాన్ని తగ్గించుకునేందుకు ఎయిరిండియా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. 



You may be interested

971 కోట్లు సమీకరించిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా

Saturday 8th December 2018

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బాసిల్‌-3 బాండ్ల జారీ ద్వారా రూ.971 కోట్లు సమీకరించింది. ఒక్కోటి రూ.10 లక్షల ముఖ విలువ గల బాసెల్‌-3  టైర్‌ టూ బాండ్ల జారీ ద్వారా ఈ నిధులు సమీకరించామని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపింది. ఈ అన్‌సెక్యూర్డ్‌, రిడీమబుల్‌ బాండ్ల కూపన్‌ రేటు 8.42 శాతం. ఈ బాండ్ల జారీ గురువారమే ఆరంభమై, అదే రోజు ముగిసిందని, 17 సంస్థలకు ఈ బాండ్లు

హెచ్‌సీఎల్‌ చేతికి ఐబీఎం ఉత్పత్తులు!

Saturday 8th December 2018

న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్... తాజాగా ఐటీ ఉత్పత్తుల దిగ్గజం ఐబీఎంకి చెందిన ఏడు సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం సుమారు 1.8 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.12,700 కోట్లు) వెచ్చించనుంది. పూర్తిగా నగదు రూపంలో ఉండే ఈ డీల్‌... నియంత్రణ సంస్థల అనుమతులన్నీ లభించాక...  2019 మధ్య నాటికి పూర్తి కాగలదని భావిస్తున్నట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒప్పందం ప్రకారం

Most from this category