STOCKS

News


యూటీఐ ఏఎంసీకి లియోపూరి షాక్‌

Sunday 12th August 2018
personal-finance_main1534097594.png-19190

యూటీఐ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ లియోపూరి తన పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. సోమవారం రాజీనామా చేయనున్నట్టు ఆయన తెలిపారు. కొత్త ఎండీ నియామకంపై కోర్టు కేసు నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు వాటాదారులకు పూరి తన నిర్ణయాన్ని లేఖ రూపంలో తెలియజేశారు. ‘‘నా పదవీకాలం పొడిగింపును కోరుకోవడం లేదని స్పష్టం చేస్తున్నాను. దీంతో ప్రణాళిక మేరకు కార్యాలయాన్ని వీడుతున్నాను’’ అని లియోపూరి తెలిపారు. దీనిపై ఓ వార్తా సంస్థ పూరిని సంప్రదించగా, తన పదవీకాలం ముగిసిన వెంటనే వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. యూటీఐ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లతో సోమవారం పూరి భేటీ కానున్నారు.

 

యాజమాన్య విభేదాలే కారణమా?
యూటీఐ ఏఎంసీ బోర్డు రెండుగా విడిపోయిన పరిస్థితుల్లో పూరి లాంటి నిపుణులు పనిచేయడం కష్టమని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. టిరోవ్‌ ప్రైస్‌కు కంపెనీలో 26 శాతం వాటా ఉంది. ఎల్‌ఐసీ, పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తదితర కంపెనీలు కూడా యూటీఐ ఏఎంసీలో ప్రధాన వాటాదారులే. యూటీఐ ఏఎంసీపై నియంత్రణ కోసం విదేశీ ఇన్వెస్టర్లు, ప్రభుత్వరంగ కంపెనీల మధ్య పోరాటం నడుస్తోంది. ప్రస్తుతం ఈ అంశం కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లింది. ఈ వివాదాన్ని ఏదో విధంగా పరిష్కరించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఎల్‌ఐసీ తన రిటైర్డ్‌ ఉద్యోగులను యూటీఐ ఏఎంసీ బోర్డులోకి నామినేట్‌ చేసేందుకు ప్రయత్నిస్తుండడం పట్ల ప్రభుత్వం కూడా సంతృప్తిగా లేదని అధికార వర్గాల సమాచారం. ఇక కంపెనీలో వాటా కలిగిన ప్రభుత్వరంగ బ్యాంకులు సైతం యాజమాన్యం విషయంలో టీరోవ్‌ ప్రైస్‌ పిటిషన్‌కు స్పందించాలని భావిస్తున్నాయి.You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 68 పాయింట్లు డౌన్‌..

Monday 13th August 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం క్షీణించింది. ఉదయం 8:43 సమయంలో 68 పాయింట్ల తగ్గుదలతో 11,364 పాయింట్లకి పడిపోయింది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు కారణం. అలాగే ఆసియా ప్రధాన సూచీలన్నీ కూడా నష్టాల్లోనే ట్రేడ్‌ అవుతున్నాయి. దీంతో నిఫ్టీ నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.  ఆసియా మార్కెట్లు పతనం.. జపాన్‌ ఇండెక్స్‌  నికాయ్‌ 225.. 356 పాయింట్ల క్షీణతతో 21,942 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 500 పాయింట్ల

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంపీ ఐపీవో లాభంపై పన్ను పడుద్ది

Sunday 12th August 2018

మీరు రిటైల్‌ ఇన్వెస్టర్లా...? ఇటీవలే ఐపీవోకు వచ్చి స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయిన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీలో పాల్గొని మంచి లాభాన్ని కళ్ల జూశారా? అయితే మీకు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉన్నట్టే. ఐపీవోలో ఒక్కో షేరు రూ.1,100కు కేటాయించగా, రూ.1,739 వద్ద కంపెనీ లిస్ట్‌ అయిన విషయం తెలిసే ఉంటుంది. అంటే ఒక్కో షేరుపై రూ.639 లాభం అనమాట. ప్రస్తుతం షేరు రూ.1,739.40 స్థాయిలో ఉంది. అమ్మకుండా ఉంచుకున్న వారి

Most from this category