STOCKS

News


10750 పాయింట్ల దిగువకు నిఫ్టీ

Monday 14th January 2019
Markets_main1547464044.png-23581

  • 36వేల దిగువకు సెన్సెక్స్‌
  • 10750 స్థాయిని కోల్పోయిన నిఫ్టీ
  • చివరి గంటలో రికవరీ

మెటల్‌, అటో, ప్రైవేట్‌ రంగ షేర్ల పతనంతో మార్కెట్‌ మూడోరోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 156 పాయింట్లు నష్టపోయి 35853 వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు కోల్పోయి 10737.60 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అస్థితర సైతం సూచీల ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపింది. నేడు డబ్ల్యూపీఐ గణాంకాల విడుదలతో పాటు వివిధ కంపెనీల క్యూ3 ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతతో ట్రేడింగ్‌ ఆద్యంతం సూచీలు నష్టాల్లో కొనసాగాయి. ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్‌ తీవ్ర ప్రభావాన్ని చూపాయి. రేపు బ్రెగ్జిట్ ఒప్పందంపై బ్రిటన్‌లో ఓటింగ్‌, అమెరికా-ఇరాన్‌ దేశాల మధ్య రాజకీయ ఉద్రికత్తలు ప్రపంచ మార్కెట్లలో అస్థిరత పరిస్థితులను నెలకొల్పాయి. మిడ్‌ సెషన్‌ సమయంలో ఐరోపా మార్కెట్ల నష్టాల ప్రారంభంతో  నిఫ్టీ 10700 మార్కును కోల్పోయి 10,692.35 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్‌ సూచీ సైతం 300 పాయింట్ల నష్టపోయి 35,692 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. అయితే చివరి గంటలో బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో సూచీలు కొంత రికవరి అయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ ఇండెక్స్‌ 205 పాయింట్ల నష్టపోయి 27,248.25 వద్ద ముగిసింది. అత్యధికంగా మెటల్‌ ఇండెక్స్‌ 1శాతం నష్టపోగా, ఫార్మా ఇండెక్స్‌ మాత్రం అరశాతం నష్టపోయింది.
ఎల్‌ అండ్‌ టీ, టెక్‌ మహీంద్రా, ఇండియన్‌బుల్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌, గెయిల్‌ విప్రో షేర్లు 2.50శాతం నుంచి 5శాతం నష్టపోగా, మారుతి, బజాజ్‌ఫైనాన్స్‌, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం నుంచి 6శాతం లాభపడ్డాయి.



You may be interested

ఈ రంగాలకు ప్రస్తుతం దూరం: మోతీలాల్‌ ఓస్వాల్‌

Monday 14th January 2019

ఆటో, మెటల్స్‌, సిమెంట్‌ రంగాల షేర్లకు ప్రస్తుతం దూరంగా ఉండడం నయమని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమ్కా సూచించారు. రిటైల్‌ ఇన్వెస్టర్లు ఎన్నికల వరకు వేచి ఉండాలా అనే దానిపై సంశయంతో ఉన్నారని చెప్పారు. గతేడాది చివర్లో రాష్ట్రాల ఎన్నికల ముందు వ్యాల్యూమ్‌లు తగ్గిపోయాయని, కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాల్లో ఓటమి పాలైనా గానీ తర్వాత మార్కెట్లు పెరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

మధ్యంతర బడ్జెట్‌ మార్కెట్‌ను మురిపిస్తుందా?

Monday 14th January 2019

కేంద్రంలో కొలువుతీరిన బీజేపీ సారధ్యంలోని ప్రభుత్వం త్వరలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. సాధారణ ఎన్నికల ముందు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనవాయితీ. ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం తిరిగి పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ సారి ఎన్నికల ముందు వచ్చే మధ్యంతర బడ్జెట్‌ మార్కెట్లో జోష్‌ నింపుతుందని పలువురు ఆశిస్తున్నారు. ఎన్నికల వేళ మధ్యతరగతికి, రైతులకు ప్రయోజనకర చర్యలను బడ్జెట్లో ప్రవేశపెట్టవచ్చని అంచనా. ఇలాంటి చర్యలు సాధారణంగా

Most from this category