STOCKS

News


త్వరలో మైండ్‌ట్రీలో మెజార్టీ వాటా సొంతం!

Thursday 13th June 2019
news_main1560415376.png-26271

ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ ధీమా

ఇంజినీరింగ్‌ దిగ్గజం లార్సన్‌–టూబ్రో(ఎల్‌ అండ్‌ టీ) మరికొద్ది కాలంలో మైండ్‌ ట్రీలో మెజార్టీ వాటాను దక్కించుకుంటుందని ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ ఏఎమ్‌ నాయక్‌ అన్నారు. 40 శాతం కంటే ఎక్కువ వాటాను  ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా పొందే దారిలో ఉన్నామన్నారు. ప్రస్తుతం ఈ బెంగుళూరు కంపెనీలో ఎల్‌అండ్‌టీ వాటా 28.9శాతానికి చేరింది. జూన్‌ 17 న ప్రారంభమై జూన్‌ 28 ను ముగియనున్న ఓపెన్‌ ఆఫర్‌లో మరో 31శాతం వాటాను  ఎల్‌అండ్‌టీ సమీకరించనుంది. ‘సెబి లేదా ఇతర నియంత్రణ సం‍స్థల నుంచి ఓపెన్‌ ఆఫర్‌కు ఎటువంటి అభ్యంతరాలను వ్యక్తం కాలేదు. ఇక భవిష్యత్‌లో కూడా ఎలాంటి అభ్యంతరాలు ఉండవని ఆశిస్తున్నాం. వాటా కొనుగోలుకు ఇప్పటికే రూ.4000 ‍కోట్లను కేటాయించాం. ఈ పరిస్థితుల్లో తమ ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఎవరినీ అనుమతించం’ అని  నాయక్‌ ఖండితంగా చెప్పారు. మైండ్‌ట్రీలో 13శాతం వాటాదారుగా ఉన్న కంపెనీ ప్రమోటర్లు ఎల్‌అండ్‌టీ స్వాధీనాన్ని ‘బలవంతపు దురాక్రమణ’ గా అభివర్ణించారు. ‘ఎల్‌ అండ్‌ టీ తో కలవడం మైండ్‌ ట్రీకి బంగారు అవకాశం కానీ వాళ్లు ఈ విషయంలో మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు’ అని నాయక్‌ అన్నారు. మైండ్‌ ట్రీ లో కేఫ్‌ కాఫీ డే చైర్మన్‌ వీజీ సిద్ధార్ధకు ఉన్న 20.32శాతం వాటాను షేరు రూ.980 చొప్పున ఎల్‌అండ్‌టీ ఏప్రిల్‌లో ఒకే లావాదేవిలో కొనుగోలు చేసింది. అప్పటి నుంచి కంపెనీలో తమ వాటాను పెంచుకునేందుకు ఎల్‌ అండ్‌ టీ ప్రయత్నిస్తోంది. ‘ మైండ్‌ ట్రీ ప్రమోటర్లతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. విలీన సం‍స్థకు ప్రస్తుత మైండ్‌ ట్రీ చైర్మన్‌ నటరాజన్‌నే చైర్మన్‌గా నియమించేందుకు ఒప్పుకున్నాం కానీ వాళ్లు ఈ ఒప్పందాన్ని బలవంతపు ఒప్పందంగా భావిస్తున్నారు. కానీ వారి అభిప్రాయం మమ్మల్ని ఆపలేదు’ అని నాయక్‌ అన్నారు. ‘ మంచి ధరతో ఓపెన్‌ ఆఫర్‌కి వెళుతున్నాం. ఈ డీల్‌పై  మాకు పూర్తి విశ్వాసం ఉం‍ది’ అని ఆయన వివరించారు. మైండ్‌ ట్రీ స్వతంత్ర బోర్డు మెంబర్‌లు ఈ ఓపెన్‌ ఆఫర్‌ సహేతుకంగా ఉందని తాజాగా సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఎల్‌ అండ్‌ టీ ఓపెన్‌ ఆఫర్‌ను మైనార్టీ ఇన్వెస్టర్లు తిరస్కరించే విధంగా నలంద క్యాపిటల్స్‌కు చెందిన  పులక్‌ ప్రసాద్‌ ప్రయత్నాలు చేస్తున్నారని ఎల్‌ అండ్‌ టీ, మైండ్‌ ట్రీ సంస్థాగత ఇన్వెస్టర్లు కొంత మంది సెబి కి ఫిర్యాదు చేశారు. ఎరోహి ఎసెట్‌ మేనెజ్‌ వంటి సంస్థలు తమ షేర్లను ఓపెన్‌ ఆఫర్‌లో హోల్డ్‌బ్యాక్‌ చేసుకునే విధంగా ప్రసాద్‌ ఒత్తిడి తీసుకువస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.You may be interested

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13500 స్థాయికి నిఫ్టీ!

Thursday 13th June 2019

రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ అంచనా నిఫ్టీ సూచీ ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరపు వాస్తవ ఆదాయాలతో పోలిస్తే 18.2 రెట్లు అధికంగా ట్రేడ్‌ అవుతోంది. బడ్జెట్లో మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచే దిశగా ప్రభుత్వం అడుగులు పడాలని మార్కెట్‌ వర్గాలు కోరుకుంటున్నాయి. ఈ ఏడాది రెండో భాగంలో కంపెనీ ఎర్నింగ్స్‌ 15 శాతం వృద్ధి చెందుతాయన్న అంచనాలున్నాయి. ఇదే నిజమైతే ఈ ఆర్థిక సంవత్సరం చివరకల్లా నిఫ్టీ ఖచ్చితంగా 13,000-13,500 లకు చేరుకుంటుంది.

వ్యక్తుల ఐటీ గరిష్ఠ శ్లాబు తగ్గాలి

Thursday 13th June 2019

25 శాతానికి తగ్గించాలన్న పీహెచ్‌డీసీసీఐ న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపు పన్ను గరిష్ట స్థాయి శ్లాబుని ప్రస్తుత 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలని పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) బుధవారం కేంద్రాన్ని కోరింది. ఈ నిర్ణయం వల్ల వ్యక్తుల వద్ద అదనపు డబ్బు ఉంటుందని, ఇది వ్యయాల పెంపునకు, తద్వారా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ పెరుగుదలకు దోహదపడుతుందని విశ్లేషించింది. జూలై 5వ తేదీ పార్లమెంటులో బడ్జెట్‌ను

Most from this category