STOCKS

News


ఎల్‌ అండ్‌ టీకి రూ.2,547 కోట్ల ఆర్డర్లు

Saturday 8th December 2018
news_main1544240422.png-22747

న్యూఢిల్లీ: లార్సెన్‌ అండ్‌ టుబ్రోకి (ఎల్‌ అండ్‌ టీ) చెందిన విభాగం రూ.2,547 కోట్ల ఆర్డర్లను సాధించింది. తమ విద్యుత్‌ ప్రసార, పంపిణీ విభాగం ఈ ఆర్డర్లను దక్కించుకున్నట్లు ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. టాంజానియాలో దారుస్సలామ్‌- మోరొగొరొల మధ్య 220 కిలో వాట్ల ట్రాన్సిమిషన్‌ లైన్‌ నిర్మాణ ప్రాజెక్ట్‌ను సాధించామని వెల్లడించింది. ఉత్తర ఆఫ్రికాలో సబ్‌స్టేషన్ల నిర్మాణానికి సంబంధించిన రెండు ఆర్డర్లను కూడా ఈ విభాగం పొందిందని పేర్కొంది. థాయ్‌లాండ్‌లో 230 కేవీ గ్యాస్‌ ఇన్సులేటేడ్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణ ఆర్డర్‌ కూడా సాధించామని వివరించింది. ఇవి కాకుండా దేశీయంగా కూడా పలు ఆర్డర్లను పొందామని ఎల్‌ అండ్ టీ  పేర్కొంది. రూ.2,547 కోట్ల ఆర్డర్లు సాధించిన నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎల్‌ అండ్‌ టీ షేర్‌ 1.3 శాతం లాభంతో రూ.1,398 వద్ద ముగిసింది. 



You may be interested

200 విమానాలతో ఇండిగో రికార్డు

Saturday 8th December 2018

ముంబై: బడ్జెట్‌ ధరల ఎయిర్‌లైన్స్‌ ఇండిగో దేశీయంగా అధిక సంఖ్యలో విమానాలు కలిగిన సంస్థగా రికార్డు నమోదు చేసింది. దేశీయంగా 200 విమానాలను కలిగి ఉన్న తొలి సంస్థ ఇదే. రెండు ఎయిర్‌బస్‌ ఏ320(సియో), రెండు ఎయిర్‌బస్‌ ఏ320 నియో విమానాలు తాజాగా వచ్చి చేరడంతో సంస్థ విమానాల సంఖ్య 200కు చేరుకుంది. దేశీయ మార్కెట్లో ఇండిగో 40 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. 2015 డిసెంబర్‌ 24న ఈ

భారత స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేయండి

Saturday 8th December 2018

గోవా: ఇన్‌ఫ్రా, వ్యవసాయం, వైద్యం తదితర రంగాలకు చెందిన దేశీ స్టార్టప్‌ సంస్థల్లో ఇన్వెస్ట్ చేయాలంటూ అంతర్జాతీయ ఫండ్స్‌కు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు పిలుపునిచ్చారు. 2035 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 10 లక్షల కోట్ల స్థాయికి చేరనున్న నేపథ్యంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. శుక్రవారమిక్కడ జరిగిన గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు

Most from this category