STOCKS

News


భారీగా తగ్గిన క్వాలిటీ నికర లాభం

Saturday 15th September 2018
news_main1536987807.png-20278

న్యూఢిల్లీ: డెయిరీ ఉత్పత్తుల కంపెనీ క్వాలిటీ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో భారీగా తగ్గింది. గత క్యూ1లో రూ.28 కోట్ల నికర లాభం రాగా ఈ క్యూ1లో రూ.కోటికే పరిమితమైనట్లు క్వాలిటీ తెలిపింది. అమ్మకాలు అంతంత మాత్రంగా ఉండటమే నికర లాభం భారీగా తగ్గడానికి కారణమని వివరించింది. గత క్యూ1లో రూ.1,573 కోట్లుగా ఉన్న నికర ఆదాయం ఈ క్యూ1లో రూ.1,266 కోట్లకు తగ్గింది. ‘‘నిధుల కొరత కారణంగా వినియోగదారులకు అవసరమైన ఉత్పత్తులను సరఫరా చేయలేకపోయాం. మా పూర్తి అనుబంధ కంపెనీ, క్వాలిటీ డెయిరీ ప్రొడక్ట్స్‌ కంపెనీ కార్యకలాపాలను దశలవారీగా నిలిపేయాలని నిర్ణయించాం. ఈ నిర్ణయం దీర్ఘకాలంలో కంపెనీకి ప్రయోజనకరమే. కానీ స్వల్ప కాలంలో మాత్రం ప్రభావం తీవ్రంగానే ఉంటుంది’’ అని వివరించింది. ఈ క్యూ1లో కంపెనీ ఎమ్‌డీ సంజయ్‌ థింగ్రా తాకట్టు పెట్టిన షేర్లను కొన్ని ఆర్థిక సంస్థలు రూ.54 కోట్లకు విక్రయించాయని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో క్వాలిటీ షేర్‌ 4.4 శాతం నష్టంతో రూ.20.50 వద్ద ముగిసింది.



You may be interested

వైజాగ్‌లో చైనా సంస్థ ట్రినాసోలార్ తయారీ ప్లాంట్‌

Saturday 15th September 2018

న్యూఢిల్లీ: చైనాకి చెందిన ట్రినా సోలార్‌ సంస్థ భారత్‌లో సౌర విద్యుత్ పరికరాల తయారీ ప్లాంటుపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఇన్వెస్టర్లు, తయారీదారులు, డెవలపర్లతో చర్చలు జరుపుతున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యిన్‌ రోంగ్‌ ఫాంగ్ తెలిపారు. 3,5,10 కి.వా. సామర్ధ్యం గల ట్రినాహోమ్ సౌర ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. 2010లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన ట్రినాసోలార్‌.. తమ తయారీ ప్లాంటు

మార్కెట్లోకి వెర్నా వార్షికోత్సవ ఎడిషన్

Saturday 15th September 2018

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన కార్ల కంపెనీ హ్యుందాయ్‌ మోటార్ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) మిడ్‌-సైజ్‌ సెడాన్‌ వెర్నా వార్షికోత్సవ ఎడిషన్‌ను శుక్రవారం మార్కెట్‌లోకి విడుదలచేసింది. మాన్యువల్‌, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌... పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ వేరియంట్లలో లభ్యమయ్యే ఈ కారు ధరల శ్రేణి రూ.11.69 లక్షల నుంచి రూ.13.03 లక్షలుగా నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. మొత్తం 1,000 యూనిట్లను ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది. వైర్‌ లెస్‌ ఫోన్‌ చార్జింగ్‌,

Most from this category