STOCKS

News


కోటక్‌ బ్యాంక్‌లో బఫెట్‌ పెట్టుబడి

Friday 7th December 2018
Markets_main1544167013.png-22727

  • 14శాతం ర్యాలీ చేసిన షేరు

ప్రైవేటు రంగ కోట‌క్ మ‌హీంద్రా బ్యాంకు షేరు శుక్రవారం 14శాతం ర్యాలీ చేసింది. వారెన్‌ బఫెట్‌ కంపెనీ బెర్కషైర్ హాత్వే కోటక్‌ బ్యాంక్‌లో 10శాతం వాటాను కోనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వెలువడం ఇందుకు కారణమైంది. సుమారు 4మిలియన్‌ డాలర్ల నుంచి 6మిలియన్‌ డాలర్ల మధ్యలో ఈ మొత్తం వాటాను బెర్కషైర్ హాత్వే కొనుగోలు చేయవచ్చని తెలుస్తుంది. ప్రమోటర్‌ నుంచి కొనుగోలు చేయడం ద్వారా లేదా ఫ్రిపరెన్షియల్‌ అలాట్‌మెంట్‌ పద్ధతిలో గానీ ఈ వాటాను కొనుగోలుకు చేయవచ్చు. ఆర్‌బీఐ ఈ ఏడాది ఆగస్ట్‌లో ప్రధాన ప్రమోటరైన ఉదయ్‌ కోటక్‌ను బ్యాంకులో తన మొత్తం వాటా 20శాతానికి మించకుడదని ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉదయ్‌ కోటక్‌ తన మొత్తం వాటా 30శాతంలోంచి 20శాతం వాటాను విక్రయించేందుకు అనుమతులు ఇవ్వాల్సిందిగా ఆర్‌బీఐ కోరారు. ఇప్పుడు ఈ వాటా విక్రయానికి అనుమతులు లభించి ఉండవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ విషయంపై వివరణ ఇచ్చేందుకు ఇరువర్గాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. నేడు కోటక్‌ బ్యాంక్‌ రూ.1183.00ల ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఇంట్రాడేలో బ్యాంకులో బఫెట్‌ పెట్టుబడుల వార్తలు హల్‌చల్‌ చేయడంతో ఇన్వెస్టర్లు బ్యాంకు షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా షేరు 14శాతం లాభపడి రూ.1345.35ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:45ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.1181.5)తో పోలిస్తే 10.54శాతం లాభంతో రూ.1306 వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 992.50 రూ.1424.00లుగా నమోదయ్యాయి.



You may be interested

వ్యాల్యు పిక్‌: హెచ్‌యూఎల్‌

Friday 7th December 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా ఎఫ్‌ఎంసీజీ దిగ్గజమైన హిందుస్తాన్‌ యూనిలివర్‌ (హెచ్‌యూఎల్‌) స్టాక్‌పై బుల్లిష్‌గా ఉంది. ఎందుకో చూద్దాం..  బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి స్టాక్‌: హెచ్‌యూఎల్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.1,808 టార్గెట్‌ ప్రైస్‌: రూ.2,250 ఆనంద్‌రాఠి.. హెచ్‌యూఎల్‌పై పాజిటివ్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. వచ్చే 12 నెలల కాలంలో హెచ్‌యూఎల్‌ షేరు ధర రూ.2,250 స్థాయికి పెరగొచ్చని అంచనా వేసింది. హెచ్‌యూఎల్‌ దేశంలోనే అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ కంపెనీ అని పేర్కొంది. ప్రతి

అర్వింద్‌ కొనొచ్చు..

Friday 7th December 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా అర్వింద్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..  ‍బ్రోకరేజ్‌: కోటక్‌ సెక్యూరిటీస్‌ స్టాక్‌: అర్వింద్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.100 టార్గెట్‌ ప్రైస్‌: రూ.130 కోటక్‌ సెక్యూరిటీస్‌.. అర్వింద్‌పై పాజిటివ్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.130గా నిర్ణయించింది. కంపెనీ తన వ్యాపారాన్ని విడగొట్టి అర్వింద్‌ ఫ్యాషన్స్‌, అనూప్‌ ఇంజినీరింగ్‌ అనే రెండు ప్రత్యేకమైక కంపెనీలను ఏర్పాటు చేసిందని పేర్కొంది.

Most from this category