STOCKS

News


కర్నాటక బ్యాంక్‌ లాభం 20 శాతం అప్‌

Saturday 13th October 2018
news_main1539410416.png-21120

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగంలోని కర్నాటక బ్యాంక్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 20 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.93 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.112 కోట్లకు పెరిగిందని కర్నాటక బ్యాంక్‌ తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు తక్కువగా ఉండటం, కీలక ఆదాయం బాగా ఉండటం వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కర్నాటక బ్యాంక్‌​ ఎమ్‌డీ, సీఈఓ ఎమ్‌.ఎస్‌. మహాబలేశ్వర్‌ చెప్పారు. గత క్యూ2లో రూ.1,566 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.1,654 కోట్లకు పెరిగిందని తెలిపారు. వడ్డీ ఆదాయం రూ.1,318 కోట్ల నుంచి రూ.1,453కోట్లకు ఎగసిందని పేర్కొన్నారు. 

తగ్గిన నికర మొండి బకాయిలు...
గత క్యూ2లో 3.04 శాతంగా ఉన్న నికర మొండి బకాయిలు ఈ క్యూ2లో 3 శాతానికి తగ్గాయని మహాబలేశ్వర్‌ చెప్పారు. స్థూల మొండి బకాయిలు మాత్రం 4.13 శాతం నుంచి 4.66 శాతానికి పెరిగాయని వివరించారు.  మొండి బకాయిలకు కేటాయింపులు రూ.226 కోట్ల నుంచి రూ.193 కోట్లకు తగ్గాయని తెలిపారు. ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 46.94 శాతం నుంచి 57.49 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. రుణ నాణ్యత మధ్యస్థంగా ఉందని, టర్నౌ అరౌండ్‌ సూచనలు కనిపిస్తున్నాయని వివరించారు.  మొత్తం వ్యాపారం 17 శాతం వృద్ధితో రూ.1,13,854 కోట్లకు పెరిగిందని తెలిపారు. డిపాజిట్లు 13 శాతం వృద్ధితో రూ.63,885 కోట్లకు, రుణాలు 22 శాతం వృద్ధితో రూ.49,970 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో కర్నాటక బ్యాంక్‌ షేర్‌ ఫ్లాట్‌గా రూ.98 వద్ద ముగిసింది. 



You may be interested

వాణిజ్య వాహనాలపై ఇంధన ధరల ప్రభావం

Saturday 13th October 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వర్షాభావం, ఇంధన ధరల పెరుగుదల వాణిజ్య వాహనాల మీద ప్రభావం ఉంటుందని.. దీంతో అమ్మకాలు కాస్త నెమ్మదించే అవకాశముందని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఆటోమోటివ్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెటింగ్‌) మహేశ్‌ కులకర్ణి చెప్పారు. దేశంలో ఏటా 2.20 లక్షల పికప్‌ వాహనాలు విక్రయమవుతున్నాయని.. వీటిల్లో మహీంద్రా వాటా 62 శాతం వరకు ఉంటుందని ఆయన తెలిపారు. ఏటా మహీంద్రా నుంచి 12 వేల వాహనాలను

షేర్ల బైబ్యాక్‌కు నాల్కో బోర్డ్‌ ఆమోదం

Saturday 13th October 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ నేషనల్‌ అల్యూమినియమ్‌ కంపెనీ(నాల్కో) రూ.504.8 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేయనున్నది. ఈ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనకు శుక్రవారం జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని నాల్కో పేర్కొంది. షేర్ల బైబ్యాక్‌లో భాగంగా ఒక్కో షేర్‌ ధరను రూ.75 చొప్పున 6,73,11,386 షేర్లకు మించకుండా షేర్లను బైబ్యాక్‌ చేస్తామని వివరించింది. కాగా ఈ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం

Most from this category