STOCKS

News


కర్ణాటక బ్యాంక్‌ లాభం రూ.163 కోట్లు

Thursday 12th July 2018
news_main1531404321.png-18253

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ కర్ణాటక బ్యాంక్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 22 శాతం వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.134 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.163 కోట్లకు చేరుకున్నట్లు కర్ణాటక బ్యాంక్‌ తెలిపింది. బ్యాంక్‌ చరిత్రలో ఇదే అత్యధిక త్రైమాసిక లాభమని బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ ఎమ్‌.ఎస్‌.మహాబలేశ్వర చెప్పారు. రుణ నాణ్యత మెరుగుపడటం, నికర వడ్డీ ఆదాయం అధికంగా ఉండటం, నిర్వహణ లాభం పెరగడంతో ఈ స్థాయిలో నికర లాభం సాధించామని తెలియజేశారు. నికర వడ్డీ ఆదాయం 10 శాతం పెరిగి రూ.469 కోట్లకు చేరిందన్నారు. నిర్వహణ లాభం 19 శాతం పెరిగి రూ.369 కోట్లకు పెరగ్గా, ఇతర ఆదాయం మాత్రం 4 శాతం క్షీణించి రూ.209 కోట్లకు తగ్గిందని తెలిపారు. మొత్తం ఆదాయం రూ.1,548 కోట్ల నుంచి రూ.1,616 కోట్లకు ఎగసిందని వెల్లడించారు.
తగ్గిన మొండి బకాయిలు..
గత క్యూ1లో 4.32 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు 4.72 శాతానికి పెరిగాయని మహాబలేశ్వర పేర్కొన్నారు. అయితే అంతకు ముందటి క్వార్టర్ స్థూల మొండిబకాయిలతో (4.92 శాతం)తో పోల్చితే ఈ క్యూ1లో తగ్గాయని వివరించారు.  ‘‘నికర మొండి బకాయిలు మాత్రం 3.2 శాతం నుంచి 2.92 శాతానికి తగ్గాయి. అంతకు ముందటి క్వార్టర్‌లో 2.96 శాతంగా ఉన్నాయి. కేటాయింపులు రూ.199 కోట్ల నుంచి రూ.222 కోట్లకు చేరాయి. అంతకు ముందటి క్వార్టర్‌తో పోలిస్తే కేటాయింపులు 59 శాతం తగ్గాయి. అంతకు ముందటి క్వార్టర్‌లో 41.1 శాతంగా ఉన్న ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో ఈ జూన్‌ క్వార్టర్‌లో 67.21 శాతానికి పెరిగింది. ఈ క్యూ1లో బ్యాంక్‌ డిపాజిట్లు 12 శాతం వృద్ధితో రూ.62,725 కోట్లకు, రుణాలు 24 శాతం వృద్ధితో రూ.47,731 కోట్లకు ఎగిశాయి’’ అని వివరించారు.

ఆర్థిక ఫలితాలు బాగుండటంతో బీఎస్‌ఈలో కర్ణాటక బ్యాంక్‌ షేర్‌ 5 శాతం లాభంతో రూ.124 వద్ద ముగిసింది. 



You may be interested

యాంబీ వ్యాలీని కొనేవారు లేరు

Thursday 12th July 2018

న్యూఢిల్లీ: సహారా యాంబీవ్యాలీ వేలం ప్రక్రియను నిలిపివేశామని, వేలం నోటీసుకు ఎటువంటి స్పందన లభించకపోవడమే దీనికి కారణమని బోంబే హైకోర్టు అధికారిక లిక్విడేటర్‌ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. అయితే, ఇన్వెస్టర్ల డబ్బులు చెల్లించేందుకు గాను ఈ ఆస్తుల వేలం ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని లిక్విడేటర్‌ను చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా,, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, ఏకే సిక్రిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఇక, ముంబైలోని వాసాయ్‌ వద్దనున్న తమ ఆస్తులను కొనుగోలు

ఎయిర్‌టెల్ పేమెంట్స్‌ బ్యాంకుకు ఊరట

Thursday 12th July 2018

న్యూఢిల్లీ: కొత్తగా మళ్లీ ఖాతాదారులను చేర్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్‌ నుంచి అనుమతులు లభించినట్లు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తెలియజేసింది. అలాగే ఖాతాదారుల వివరాల ధృవీకరణ కోసం ఆధార్‌ ఈ-కేవైసీని ఉపయోగించుకునేందుకు విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికార సంస్థ యూఐడీఏఐ నుంచి కూడా అనుమతి లభించినట్లు తెలియజేసింది. ఎయిర్‌టెల్ మొబైల్‌ సబ్‌స్క్రయిబర్ల అనుమతి లేకుండానే వారి పేరున ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాలు తెరవడం, కోట్ల కొద్దీ రూపాయల వంటగ్యాస్ సబ్సిడీ

Most from this category