STOCKS

News


61శాతం పెరిగిన కర్ణాటక బ్యాంక్‌ లాభం

Saturday 12th January 2019
Markets_main1547272784.png-23547

దన్నుగా నిలిచిన నిర్వహణ, ఇతర ఆదాయాలు
న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగంలోని కర్ణాటక బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.140 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.87 కోట్ల నికర లాభం వచ్చిందని, 61 శాతం వృద్ధి సాధించామని కర్ణాటక బ్యాంక్‌ తెలిపింది. నిర్వహణ, ఇతర  ఆదాయాలు బాగా పెరగడంతో ఈ స్థాయిలో నికర లాభం పెరిగిందని తెలియజేసింది. నికర వడ్డీ ఆదాయం రూ.451 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.488 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇతర ఆదాయం 55 శాతం ఎగసి రూ.301 కోట్లకు, . నిర్వహణ లాభం 24 శాతం ఎగసి రూ.400 కోట్లకు పెరిగాయని వివరించింది.
పెరిగిన కేటాయింపులు..
రుణ నాణ్యత నిలకడగా ఉన్నా, కేటాయింపులు మాత్రం పెరిగాయి. గత క్యూ3లో 3.96 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 4.45 శాతానికి పెరిగాయని కర్ణాటక బ్యాంక్‌ పేర్కొంది. నికర మొండి బకాయిలు 2.85 శాతం నుంచి 3 శాతానికి చేరాయని వివరించింది. కేటాయింపులు 6 శాతం పెరిగి రూ.209 కోట్లకు చేరగా, ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 57.5 శాతం నుంచి  57.2 శాతానికి తగ్గింది. ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో బీఎస్‌ఈలో కర్నాటక బ్యాంక్‌ షేర్‌ 0.6 శాతం లాభపడి రూ.116 వద్ద ముగిసింది.



You may be interested

యస్ బ్యాంక్ చీఫ్ రేసులో ఇద్దరు..

Saturday 12th January 2019

 లిస్టులో రజత్ మోంగా, విదేశీ బ్యాంక్ సీఈవో పేర్లు న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యస్ ‍బ్యాంక్ ఎండీ, సీఈవో రాణా కపూర్ వారసుడిని ఎంపిక చేసేందుకు రూపొందించిన షార్ట్‌ లిస్ట్‌లో ఇద్దరి పేర్లు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరిలో ఒకరు యస్ బ్యాంక్‌లో ప్రస్తుతం సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్‌గా ఉన్న రజత్ మోంగా కాగా మరొక పేరు విదేశీ బ్యాంక్ సీఈవోది ఉన్నట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. 2004లో యస్‌ బ్యాంక్

బిగ్‌ సీలో సంక్రాంతి ఆఫర్లు

Saturday 12th January 2019

హైదరాబాద్‌: మొబైల్‌ రిటైల్‌ విక్రయ సంస్థ బిగ్‌ సీ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. శామ్‌సంగ్‌ గెలాక్సీ జే6, జే6 ప్లస్, ఏ7 మొబైల్స్‌పై అన్ని బ్యాంక్‌ల కార్డ్‌ల ద్వారా 10 శాతం క్యాష్‌ బ్యాక్, అన్ని వివో మోడల్స్‌పై సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లను అందిస్తోంది. దీంతో పాటు  ఒప్పో ఎఫ్‌9 ప్రొ కొంటే రైస్‌ కుక్కర్‌ ఉచితం, రూ.1,590 కార్బన్‌న్‌కే3 బూమ్‌ మ్యాక్స్‌ సెల్‌ఫోన్‌పై రూ.2,500 విలువ

Most from this category