STOCKS

News


నవంబర్‌లో జేఎల్‌ఆర్‌ విక్రయాలు 8% డౌన్‌

Saturday 8th December 2018
auto-mobiles_main1544240229.png-22745

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన జేఎల్‌ఆర్‌ కార్ల విక్రయాలు నవంబర్‌లో 8 శాతం తగ్గిపోయాయి. 48,160 కార్లను సంస్థ విక్రయించింది. చైనా, ఇతర ప్రధాన మార్కెట్లలో అమ్మకాల పరంగా ఉన్న సవాళ్లు ప్రభావం చూపించినట్టు కంపెనీ తెలిపింది. జాగ్వార్‌ బ్రాండ్‌ రిటైల్‌ అమ్మకాలు 8.9 శాతం పెరిగి 14,909 యూనిట్లుగా ఉన్నాయి. ల్యాండ్‌రోవర్‌ బ్రాండ్‌ కార్ల అమ్మకాలు 33,251 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 14 శాతం తగ్గాయి. ముఖ్యంగా చైనా మార్కెట్లో జేఎల్‌ఆర్‌ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కంపెనీ విక్రయాలు నవంబర్‌లో ఏకంగా 51 శాతం తగ్గిపోయాయి. టారిఫ్‌ల్లో మార్పులు, వాణిజ్య పరమైన ఆందోళనలు వినియోగారుల్లో అనిశ్చితికి దారితీశాయని కంపెనీ వివరణ ఇచ్చింది. చైనాలో రిటైలర్లతో కలసి జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ ప్రయత్నాలు కొనసాగుతాయని సంస్థ ప్రకటించింది. 



You may be interested

భారత స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేయండి

Saturday 8th December 2018

గోవా: ఇన్‌ఫ్రా, వ్యవసాయం, వైద్యం తదితర రంగాలకు చెందిన దేశీ స్టార్టప్‌ సంస్థల్లో ఇన్వెస్ట్ చేయాలంటూ అంతర్జాతీయ ఫండ్స్‌కు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు పిలుపునిచ్చారు. 2035 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 10 లక్షల కోట్ల స్థాయికి చేరనున్న నేపథ్యంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. శుక్రవారమిక్కడ జరిగిన గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు

జనవరి నుంచి ఫోక్స్‌వ్యాగన్‌ కార్ల ధరల పెంపు

Saturday 8th December 2018

ముంబై: ఫోక్స్‌వ్యాగన్‌ సంస్థ జనవరి 1 నుంచి తన కార్ల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. రూపాయి విలువ పడిపోవడం, తయారీ వ్యయాలు పెరిగిపోవడమే ధరలు పెంచడానికి కారణమని పేర్కొంది. ఈ కారణాల వల్ల తప్పనిసరై ధరలను పెంచుతున్నట్టు సంస్థ ప్యాసింజర్‌ కార్ల విభాగం డైరెక్టర్‌ స్టీఫెన్‌న్యాప్‌ తెలిపారు. మారుతి సుజుకి, టయోటా, ఇసుజు మోటార్స్‌ ఇప్పటికే ధరలను పెంచాయి. 

Most from this category