STOCKS

News


జేఎల్‌ఆర్‌కు ట్రేడ్‌వార్‌ సెగ

Saturday 11th August 2018
auto-mobiles_main1533956731.png-19152

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) అమ్మకాలు జూలైలో భారీ క్షీణతను నమోదుచేశాయి. ఒడిదుడుకులు అధికంగా ఉండడం, వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో జేఎల్‌ఆర్‌ అమ్మకాలు 21.6 శాతం తగ్గి 36,144 యూనిట్లకు పరిమితమైనట్లు ఆ సంస్థ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ ఫెలిక్స్‌ బ్రౌటిగమ్‌ తెలిపారు. జాగ్వార్‌ బ్రాండ్‌ సేల్స్‌ 15.2 శాతం తగ్గి 10,992 యూనిట్లుగా నమోదుకాగా.. ల్యాండ్‌ రోవర్‌ అమ్మకాలు 24 శాతం క్షీణించి 25,152 యూనిట్లుగా నిలిచినట్లు వెల్లడించారు. ‘కీలక మార్కెట్లలో గత నెల అమ్మకాలు క్లిష్టతరంగా మారాయి. చైనాలో రిటైల్‌ సేల్స్‌ 46.9 శాతం తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న తేలికపాటి వాహన పరీక్షా విధానంలో జాప్యం వల్ల బ్రిటన్‌లో అమ్మకాలు 18.3 శాతం తగ్గాయి. ఉత్తర అమెరికాలో 9.5 శాతం తగ్గుదల నమోదైంది. టారిఫ్‌ మార్పులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం.’ అని వివరించారు. వాణిజ్య యుద్ధం కారణంగా కొనుగోలుదారుల ఆలోచనలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని చెప్పారాయన.



You may be interested

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు విస్తరణ...

Saturday 11th August 2018

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎ౾ంఆర్‌ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ పనుల కాంట్రాక్టులను ఎల్ అండ్‌ టీ, మెగావైడ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ దక్కించుకున్నాయి. ఇందులో ఎల్‌ అండ్‌ టీ కాంట్రాక్టు విలువ రూ.3,028 కోట్లు కాగా మెగావైడ్‌ దక్కించుకున్న కాంట్రాక్టు విలువ రూ.980 కోట్లు. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఈ మేరకు రెండు సంస్థలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసినట్లు జీఎంఆర్ ఇన్‌ఫ్రా స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది.

ఐసీఐసీఐ బ్యాంకులో పెట్టుబడి రెట్టింపు అవుతుందా!?

Saturday 11th August 2018

ఐసీఐసీఐ బ్యాంకు వచ్చే రెండేళ్ల కాలంలో పెట్టుబడులపై నూరు శాతం లాభాన్ని ఇవ్వగలదంటే నమ్మశక్యంగా లేదా..? కానీ, ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ మాత్రం 100 శాతం వరకు లాభం ఇవ్వగలదని భావిస్తోంది. మొండి బకాయిల నుంచి వృద్ధి వైపు అడుగులు పడుతున్న క్రమంలో ఇది సాధ్యమేనంటోంది. ఈ స్టాక్‌లో వచ్చే రెండు మూడు త్రైమాసికాలు ఆటుపోట్లు ఉంటాయని, ఆ తర్వాత రిస్క్‌ రాబడులన్నవి సానుకూలంగా మారతాయని

Most from this category