STOCKS

News


జెట్‌ ఎయిర్‌వేస్‌ 16శాతం జూమ్‌..!

Monday 14th January 2019
Markets_main1547460938.png-23579

రుణ పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తుందనే వార్తలతో జెట్‌ ఎయిర్‌వేస్‌ సోమవారం 17శాతం ర్యాలీ చేసింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.253.5ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ‘గుదిబండగా మారిన రుణభారాన్ని తగ్గించుకునే పరిష్కార ప్రణాళికల్లో భాగంగా కంపెనీకి రుణదాతలతో ఈ వారంలో బోర్డు సమావేశం నిర్వహించనుందనే ఒక ప్రముఖ టీ.వీ ఛానెల్‌ వార్తల్ని ప్రసారం చేసింది. అలాగే ప్రస్తుత ప్రధాన ప్రమోటర్‌ నరేష్‌ గోయల్‌ కంపెనీలో 10శాతం వాటాను తగ్గించుకోవడంతో 20-25శాతానికి పరిమితం చేసుకోని బోర్డు సభ్యుని తప్పుకోనున్నారని వార్త ఛానెల్‌ తెలిపింది. అలాగే సంస్థలో ఈక్విటీలో 24 శాతం వాటా ఉన్న ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ వాటా 49 శాతానికి పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆ కంపెనీ ప్రమోటర్‌ నరేష్‌ గోయల్‌కు 51 శాతం వాటా ఉంది. ఈ వార్తల ప్రభావంతో నేడు జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు 17శాతం ర్యాలీ చేసి రూ.297.00 ఇంట్రాడే గరిష్టానికి చేరుకున్నాయి. చివరికి 15.72 శాతం లాభంతో రూ.293.35 వద్ద ముగిసింది.



You may be interested

మధ్యంతర బడ్జెట్‌ మార్కెట్‌ను మురిపిస్తుందా?

Monday 14th January 2019

కేంద్రంలో కొలువుతీరిన బీజేపీ సారధ్యంలోని ప్రభుత్వం త్వరలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. సాధారణ ఎన్నికల ముందు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనవాయితీ. ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం తిరిగి పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ సారి ఎన్నికల ముందు వచ్చే మధ్యంతర బడ్జెట్‌ మార్కెట్లో జోష్‌ నింపుతుందని పలువురు ఆశిస్తున్నారు. ఎన్నికల వేళ మధ్యతరగతికి, రైతులకు ప్రయోజనకర చర్యలను బడ్జెట్లో ప్రవేశపెట్టవచ్చని అంచనా. ఇలాంటి చర్యలు సాధారణంగా

అవెన్యూ సూపర్‌మార్ట్‌ 11 శాతం డౌన్‌..!

Monday 14th January 2019

క్యూ3 ఫలితాల ఎఫెక్ట్‌  ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు డిసెంబర్ క్వార్టర్‌(క్యూ 3) ఫలితాలు అంతంత మాత్రంగా నమోదుకావడంతో అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్లు సోమవారం 11 శాతం  పతనమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్లు రూ.1454.70ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. డిసెంబర్ క్వార్టర్‌లో కంపెనీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో క్యూ3 గణాంకాలు అంతంగా మాత్రంగా నమోదయ్యాయి. ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలైన జెప్ఫారీస్‌, క్రిడెట్‌ శాష్యూ, ఎడెల్వీజ్‌,

Most from this category