STOCKS

News


ఎతిహాద్‌ నుంచి రుణానికి జెట్‌ ప్రయత్నాలు

Friday 7th December 2018
news_main1544161113.png-22716

ముంబై: నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌.. తమ భాగస్వామ్య సంస్థ ఎతిహాద్ ఎయిర్‌వేస్‌ను 350 మిలియన్ డాలర్ల రుణం ఇవ్వాల్సిందిగా కోరింది. ఓ వైపు సమస్యల నుంచి గట్టెక్కే క్రమంలో వాటా విక్రయ ప్రయత్నాలను కొనసాగిస్తూనే  మరోవైపు తక్కువ వడ్డీ రేటుపై ఈ మేరకు రుణం సమకూర్చాలంటూ జెట్ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వివరించాయి. గతంలో కూడా జెట్‌ను ఎతిహాద్ గట్టెక్కించిన సందర్భాలున్నాయి. 2013లో రూ.2,060 కోట్లతో జెట్‌ ఎయిర్‌వేస్‌లో ఎతిహాద్ 24 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఆ తర్వాత 150 మిలియన్ డాలర్ల రుణాన్ని తక్కువ వడ్డీ రేటుకు ఇచ్చింది. అలాగే జెట్‌ ప్రివిలేజ్ ప్రోగ్రాంలో 50.1 శాతం వాటాను కొనుగోలు చేసింది. జెట్ ఎయిర్‌వేస్ గత మూడు త్రైమాసికాల్లో వరుసగా నష్టాలు నమోదు చేస్తోంది. గురువారం బీఎస్‌ఈలో జెట్ షేరు 3 శాతం క్షీణించి రూ. 278.20 వద్ద ముగిసింది.



You may be interested

5వారాల గరిష్టానికి పసిడి

Friday 7th December 2018

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం 5వారాల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి నెమ్మదించిన నేపథ్యంలో అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్ల పెంపు అనుమానాలు తలెత్తాయి. ఫలితంగా డాలర్‌ ఇండెక్స్‌ పతనం, అమెరికా ట్రెజరీ ఈల్డ్‌ తగ్గడం పసిడి ధరకు బలాన్నిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ఆర్థిక గణాంకాలు బలహీనంగా ఉండటం, వాణిజ్య యుద్ధ సంధిపై ఇన్వెస్టర్లకు విశ్వాసం లేకపోవడం, తాజాగా తలెత్తిన చైనా-అమెరికాల మధ్య రాజకీయ

ముడి చమురు బిల్లు.. రూపాయిల్లో చెల్లింపు

Friday 7th December 2018

న్యూఢిల్లీ: ఇరాన్‌ ముడిచమురు బిల్లును భారత్‌ రూపాయిల్లో  చెల్లించనున్నది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని సమాచారం. ఈ ఒప్పందంలో భాగంగా భారత రిఫైనరీలు ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురుకు చెల్లించాల్సిన సొమ్ములను యూకో బ్యాంక్‌లోని నేషనల్‌ ఇరానియన్‌ ఆయిల్‌ కంపెనీ ఖాతాలో జమ చేస్తాయి.ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలు గత నెల 5నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే ఈ ఆంక్షల నుంచి

Most from this category