STOCKS

News


జెట్ ఎయిర్‌వేస్‌ పరిణామాలపై కేంద్రం దృష్టి

Saturday 11th August 2018
news_main1533957771.png-19164

న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌పై కేంద్రం దృష్టి సారించింది. కంపెనీ పరిణామాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్‌ చౌబే చెప్పారు. అయితే, కంపెనీ ఆర్థిక ఆడిటింగ్‌ను నిర్వహించే యోచనేదీ లేదని ఆయన స్పష్టం చేశారు. తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించడాన్ని కూడా జెట్ ఎయిర్‌వేస్ వాయిదా వేసిన నేపథ్యంలో చౌబే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సాధారణంగా విమానయాన సంస్థలు సమస్యలేమైనా ఎదుర్కొంటున్నప్పుడు పౌర విమానయాన శాఖతో చర్చిస్తాయని, కానీ ఆర్థిక సమస్యలు.. ఉద్యోగుల తగ్గింపు తదితర అంశాల గురించి జెట్ ఎయిర్‍వేస్ తమను సంప్రతించటం వంటివేమీ చేయలేదని చౌబే చెప్పారు. అయితే, ‍అలాంటి విషయాలన్నింటిపైనా తమ శాఖను సంప్రతించాలన్న నిబంధన కూడా ఏమీ లేదని పేర్కొన్నారు. ఈ నెల 2 నుంచి ఇప్పటిదాకా జెట్ ఎయిర్‌వేస్ షేరు సుమారు 12 శాతానికి పైగా క్షీణించింది. శుక్రవారం ఇంట్రాడేలో 52 వారాల కనిష్ట స్థాయి రూ.258ని కూడా తాకింది. 



You may be interested

2 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయిన క్రెడిట్‌యాక్సెస్‌ గ్రామీణ్‌ ఐపీఓ

Saturday 11th August 2018

న్యూఢిల్లీ: ​‍క్రెడిట్‌యాక్సెస్‌ గ్రామీణ్‌ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) 2.22 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. శుక్రవారం ముగిసిన ఈ  ఐపీఓ సైజు రూ.1,131 కోట్లు. ఈ ఐపీఓకు ప్రైస్‌బ్యాండ్‌గా రూ.418-422ను కంపెనీ నిర్ణయించింది. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్ల వాటా 5.5 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా 88 శౠతం చొప్పున సబ్‌స్క్రైబయ్యాయి. ఈ కంపెనీ షేర్లు ఈ నెల 23న స్టాక్‌ మార్కెట్లో లిస్టవుతాయని అంచనా. ఇటీవలనే ఈ  సూక్ష్మ రుణ సంస్థ,

విలీనాల తర్వాత ఉద్యోగుల తొలగింపుల్లేవ్‌

Saturday 11th August 2018

న్యూఢిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)తో భారతీయ మహిళా బ్యాంక్‌సహా ఐదు అనుబంధ బ్యాంకుల విలీనం అనంతరం ఉద్యోగులు ఎవరినీ తొలగించలేదని ఆర్థికశాఖ మంత్రి పియూష్‌ గోయెల్‌ పేర్కొన్నారు. 2018 మార్చి 31వ తేదీ నాటికి ఎస్‌బీఐ మొత్తం 1,56,965 మంది ఉద్యోగులను, 1,56,964 మంది అధికారులను కలిగి ఉన్నట్లు మంత్రి లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు. బ్యాంకులన్నీ కలిశాక 6,950 బ్రాంచీల విలీనం జరిగిందని తెలిపారు. 

Most from this category