STOCKS

News


ఐఫోన్ 10ఎస్ @ రూ. 1.45 లక్షలు

Saturday 15th September 2018
auto-mobiles_main1536987609.png-20275

న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం యాపిల్ కొత్తగా ఐఫోన్‌ సిరీస్‌లో ప్రవేశపెట్టిన 10ఎస్‌ హ్యాండ్‌సెట్స్‌ ప్రారంభ ధర భారత్‌లో రూ.1 లక్ష పైగానే ఉండనుంది. భారత్‌లో ఐఫోన్ 10ఎస్‌ ధర రూ. 99,000 నుంచి (64 జీబీ వేరియంట్) ఉంటుంది. 256 జీబీ వేరియంట్ రేటు రూ.1,14,900 గాను 512 జీబీ రేటు రూ.1,34,900గాను ఉంటుంది. ఇక 6.5 అంగుళాల పెద్ద స్క్రీన్‌తో లభించే 10ఎస్ మ్యాక్స్ రేటు రూ.1,09,900 (64 జీబీ) నుంచి ప్రారంభమవుతుంది. 256 జీబీ వేరియంట్ ధర రూ. 1,24,900 కాగా 512 జీబీ వేరియంట్ ధర రూ. 1,44,900గా ఉంటుంది. దేశీయంగా ఎయిర్‌టెల్‌, రిలయన్స్ జియో వీటిని తమ ప్లాన్స్‌తో విక్రయించనున్నాయి. 10ఎస్‌, 10ఎస్ మ్యాక్స్‌కి సంబంధించి సెప్టెంబర్ 21 నుంచి, చౌక వెర్షన్ ఎక్స్‌ఆర్‌కి అక్టోబర్ 19 నుంచి తమ ఆన్‌లైన్ స్టోర్స్‌లో ప్రీ-ఆర్డర్స్ స్వీకరించనున్నట్లు ఎయిర్‌టెల్ వెల్లడించింది. అటు జియో ఇంకా తేదీలను ప్రకటించాల్సి ఉంది. 
యాపిల్ బుధవారం నాఽడు కొత్త ఐఫోన్ వేరియంట్స్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. భారత్‌లో సెప్టెంబర్ 28 నుంచి 10ఎస్‌, అక్టోబర్ 26 నుంచి ఎక్స్‌ఆర్‌ వేరియంట్లు అందుబాటులోకి వస్తాయని సంస్థ ప్రకటించింది. యాపిల్ తొలిసారిగా డ్యుయల్ సిమ్ ఫీచర్‌తో కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ఉపయోగించే ఈ-సిమ్ టెక్నాలజీని దేశీయంగా ఎయిర్‌టెల్‌, జియో అందిస్తున్నాయి.



You may be interested

ఇన్ఫోసిస్‌ చేతికి ఫ్లూయిడో కంపెనీ

Saturday 15th September 2018

న్యూఢిల్లీ: ఫిన్లాండ్‌కు చెందిన ఫ్లూయిడో కంపెనీని భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ రూ.545 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి ఈ లావాదేవీ పూర్తవుతుందని ఇన్ఫోసిస్‌ తెలిపింది. ఈ కంపెనీ కొనుగోలుతో నార్డిక్‌ ప్రాంతంలో మరింత శక్తివంతమవుతామని పేర్కొంది. ఫిన్లాండ్‌లోని ఈస్‌పూ కేంద్రంగా ఫ్లూయిడో కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2010లో ఆరంభమైన ఈ కంపెనీ ఫిన్లాండ్‌, డెన్మార్క్‌, స్వీడన్‌, నార్వే, స్లోవేకియా దేశాల్లో క్లయింట్లకు సాఫ్ట్‌వేర్‌ సర్వీసులందిస్తోంది.

సెల్‌ఫోన్‌ దిగుమతుల నిబంధనల్లో సడలింపు

Saturday 15th September 2018

న్యూఢిల్లీ: మొబైల్‌ హాండ్‌సెట్స్‌ దిగుమతులు మరింత పెరిగే దిశగా టెలికం మంత్రిత్వ శాఖ‌ (డీఓటీ) నిర్ణయం తీసుకుంది. వైఫై, బ్లూటూత్‌ ఫీచర్లు కలిగిన సెల్‌ఫోన్‌ దిగుమతులకు సంబంధించి కీలక ప్రకటనచేసింది. ఇక నుంచి ఈ తరహా మొబైల్‌ ఫోన్ల దిగుమతికి తమ నుంచి అనుమతి తీసుకోవల్సిన అవసరం లేదని డీఓటీ మెమొరాండం జారీచేసింది. వైఫై, బ్లూటూత్‌ కలిగిన ఫోన్లు విదేశీ వాణిజ్య విధానం పరిధిలో ఉన్నట్లు వివరించింది. తాజా మెమొరాండం

Most from this category