STOCKS

News


ఏడు నెలల కనిష్టానికి పారిశ్రామిక రంగం

Thursday 12th July 2018
news_main1531411471.png-18266

న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం- ఐఐపీ (పారిశ్రామిక ఉత్పత్తి సూచీ) మే నెలలో పేలవ పనితీరును ప్రదర్శించింది. కేవలం 3.2 శాతం వృద్ధిని మాత్రమే నమోదుచేసుకుంది. ఇంత తక్కువ స్థాయి వృద్ధి ఏడు నెలల తర్వాత ఇదే తొలిసారి. గత ఏడాది మే నెలలో వృద్ధి 2.9 శాతమే కావడం గమనార్హం. తయారీ, విద్యుత్‌ రంగాల పేలవ పనితీరును పదర్శించాయి. కాగా ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలనూ చూస్తే (ఏప్రిల్‌, మే) పారిశ్రామిక రంగం వృద్ధి 3.1 శాతం నుంచి 4.4 శాతానికి పెరిగింది. కేంద్ర గణాంకాల కార్యాలయం గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కొన్ని కీలక రంగాలను చూస్తే...
♦ తయారీ: మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా ఉన్న తయారీ రంగం వృద్ధి రేటు మే నెలలో స్వల్పంగా మాత్రమే పెరిగింది. 2017 మే నెలలో 2.6 శాతం వృద్ధి రేటు ఉంటే ఇది 2018 మే నెలలో 2.8 శాతంగా మాత్రమే నమోదయ్యింది. ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో ఈ వృద్ధి 2.8 శాతం నుంచి 4 శాతానికి పెరిగింది. 
♦ విద్యుత్‌: నెలవారీగా వృద్ధి 8.3 శాతం నుంచి 4.2 శాతానికి పడిపోగా, ఏప్రిల్‌, మే నెలలను కలిపిచూస్తే, ఈ రేటు 6.9 శాతం నుంచి 3.1 శాతానికి తగ్గింది. 
♦ మైనింగ్‌: మేలో వృద్ధి రేటు 0.3 శాతం నుంచి భారీగా 5.7 శాతానికి ఎగిసింది. రెండు నెలలనూ కలిపిచూస్తే, రేటు 1.6 శాతం నుంచి 4.9 శాతానికి చేరింది. 
♦  ఎఫ్‌ఎంసీజీ: అసలు వృద్ధిలేకపోగా - 2.6 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. 2017 మే  నెలలో ఈ రంగం వృద్ధి రేటు 9.7 శాతం. 
♦ కన్జూమర్ గూడ్స్‌:  కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ విభాగంలో 4.3 శాతం వృద్ధి నమోదయ్యింది. అయితే కన్జూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌ విభాగంలో వృద్ధిలేకపోగా -2.6 క్షీణత నెలకొంది. 



You may be interested

సిప్లా చేతికి దక్షిణాఫ్రికా ఫార్మా కంపెనీ

Thursday 12th July 2018

న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం సిప్లా కంపెనీ దక్షిణాఫ్రికాకు చెందిన మిర్రెన్‌ లిమిటెడ్‌ను కొనుగోలు చేయనున్నది. ఓవర్‌ ద కౌంటర్‌ (ఓటీసీ) ఔషధాలను తయారు చేసే మిర్రెన్‌ కంపెనీని రూ.228 కోట్లకు (45 కోట్ల దక్షిణాఫ్రికా రాండ్‌లు) కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని సిప్లా తెలిపింది. మిర్రెన్‌ లిమిటెడ్‌ను తమ దక్షిణాఫ్రికా అనుబంధ కంపెనీ, సిప్లా మెడ్‌ప్రో సౌత్‌ ఆఫ్రికా కొనుగోలు చేయనున్నదని వివరించింది. ఈ లావాదేవీకి దక్షిణాఫ్రికా కాంపిటీషన్‌ కమిషన్

తలసరి ఆదాయంలో వెనుకే ఉన్నాం!

Thursday 12th July 2018

న్యూఢిల్లీ: ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించడం ఊహించినదేనని, తలసరి ఆదాయ పరంగా ఇప్పటికీ మనం తక్కువ స్థాయిలోనే ఉన్నామని, ఈ విషయంలో చాలా దూరం ప్రయాణించాల్సి ఉందన్నారు నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌. అంతర్జాతీయంగా భారత్‌ చెప్పుకోతగ్గ స్థాయిలో జోక్యం చేసుకునే విధంగా ఉండాలని కుమార్‌ అభిప్రాయపడ్డారు. త్వరలోనే మన దేశం బ్రిటన్‌ను అధిగమించి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు. ‘‘చాలా

Most from this category