STOCKS

News


200 విమానాలతో ఇండిగో రికార్డు

Saturday 8th December 2018
news_main1544240481.png-22748

ముంబై: బడ్జెట్‌ ధరల ఎయిర్‌లైన్స్‌ ఇండిగో దేశీయంగా అధిక సంఖ్యలో విమానాలు కలిగిన సంస్థగా రికార్డు నమోదు చేసింది. దేశీయంగా 200 విమానాలను కలిగి ఉన్న తొలి సంస్థ ఇదే. రెండు ఎయిర్‌బస్‌ ఏ320(సియో), రెండు ఎయిర్‌బస్‌ ఏ320 నియో విమానాలు తాజాగా వచ్చి చేరడంతో సంస్థ విమానాల సంఖ్య 200కు చేరుకుంది. దేశీయ మార్కెట్లో ఇండిగో 40 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. 2015 డిసెంబర్‌ 24న ఈ సం‍స్థ నిర్వహణలోకి 100వ విమానం వచ్చి చేరగా, మూడేళ్ల తర్వాత రెట్టింపు స్థాయికి చేరుకున్నట్టు అయింది. 



You may be interested

హెచ్‌సీఎల్‌ చేతికి ఐబీఎం ఉత్పత్తులు!

Saturday 8th December 2018

న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్... తాజాగా ఐటీ ఉత్పత్తుల దిగ్గజం ఐబీఎంకి చెందిన ఏడు సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం సుమారు 1.8 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.12,700 కోట్లు) వెచ్చించనుంది. పూర్తిగా నగదు రూపంలో ఉండే ఈ డీల్‌... నియంత్రణ సంస్థల అనుమతులన్నీ లభించాక...  2019 మధ్య నాటికి పూర్తి కాగలదని భావిస్తున్నట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒప్పందం ప్రకారం

ఎల్‌ అండ్‌ టీకి రూ.2,547 కోట్ల ఆర్డర్లు

Saturday 8th December 2018

న్యూఢిల్లీ: లార్సెన్‌ అండ్‌ టుబ్రోకి (ఎల్‌ అండ్‌ టీ) చెందిన విభాగం రూ.2,547 కోట్ల ఆర్డర్లను సాధించింది. తమ విద్యుత్‌ ప్రసార, పంపిణీ విభాగం ఈ ఆర్డర్లను దక్కించుకున్నట్లు ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. టాంజానియాలో దారుస్సలామ్‌- మోరొగొరొల మధ్య 220 కిలో వాట్ల ట్రాన్సిమిషన్‌ లైన్‌ నిర్మాణ ప్రాజెక్ట్‌ను సాధించామని వెల్లడించింది. ఉత్తర ఆఫ్రికాలో సబ్‌స్టేషన్ల నిర్మాణానికి సంబంధించిన రెండు ఆర్డర్లను కూడా ఈ విభాగం పొందిందని పేర్కొంది.

Most from this category