STOCKS

News


15 శాతం ఎర్నింగ్స్‌ గ్రోత్‌ ఖాయం!

Wednesday 13th February 2019
Markets_main1550041538.png-24175

రాబోయే మూడు ఆర్థిక సంవత్సరాల పాటు దేశీయ ఈక్విటీలు రెండంకెల ఎర్నింగ్స్‌ వృద్ది నమోదు చేస్తాయని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. పన్నులు, మొండిపద్దులకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, విధాన నిర్ణయాల ఫలితంగా ఎకానమీలోకి నగదు ప్రవాహం పెరుగుతుందని అభిప్రాయపడింది. మొండిపద్దుల వసూళ్లు, జీఎస్‌టీ కారణంగా కంపెనీలకు మూలధన వ్యయాలు దిగివస్తాయని, ప్రజల్లో పొదుపు పెరుగుతుందని, దీంతో ఎర్నింగ్స్‌ 10- 15 శాతం వరకు దూసుకుపోతాయని సంస్థ సీఈఓ శిల్పా కుమార్‌ చెప్పారు. గత నాలుగేళ్లలో సూచీల్లో ప్రాఫిట్‌గ్రోత్‌ ఒక్క ఏడాదే కనిపించింది. కానీ ఇదే సమయంలో సూచీలు మాత్రం బాగానే లాభపడ్డాయి. దీంతో వాల్యూషన్లపై ఫండ్‌మేనేజర్లు ఆందోళన చెందడం ఆరంభమైంది. ఈ ఆందోళనతో ఎర్నింగ్స్‌ అంచనాలు దిగివచ్చాయి. కానీ ఈ ఇబ్బంది తాత్కాలికమేనని, విధాన నిర్ణయాల్లో మార్పులకారణంగా వచ్చే ఒడిదుడుకుల స్వల్పకాలికాలని, లాభాలు దీర్ఘకాలం ఉంటాయని కుమార్‌ చెప్పారు. ఇకపై పాలసీల ఫలితాలు కనిపిస్తాయని, ఎర్నింగ్స్‌ జోరు చూపుతాయని వివరించారు. ఇప్పటికే కొంత రికవరీ కనిపిస్తోందని, క్యు3లో చాలా కంపెనీల ఫలితాల్లో మంచి మెరుగుదల నమోదయిందని చెప్పారు.

2020 మార్చినాటికి చాలా సంస్కరణల ఫలితాలు కాపుకొస్తాయని, 2020 క్యు4లో ఎర్నింగ్స్‌ వృద్ధి చాలా ఎక్కువగా ఉండొచ్చని క్రెడిట్‌ సూసీ సైతం పేర్కొంది. క్రూడాయిల్‌ ధరల తరుగుదల ఎకానమీపై మంచి పాజిటివ్‌ ప్రభావం చూపుతుందని, దీంతో రూపీ బలపడి విత్తలోటు కట్టడి కావచ్చని బ్రోకింగ్‌ సంస్థలు భావిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు, రాబోయే ఎర్నింగ్స్‌ గ్రోత్‌ను దృష్టిలో ఉంచుకొని లాంగ్‌టర్మ్‌కు బ్యాంకులు, ఫైనాన్షియల్స్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాలకు చెందిన నాణ్యమైన స్టాకులను పరిశీలించవచ్చని కుమార్‌ సిఫార్సు చేశారు. You may be interested

సెల్లింగ్‌కు సరైన సమయం ఎప్పుడు?

Wednesday 13th February 2019

మీరు కొన్న స్టాకు బాగా లాభాలను ఆర్జించినప్పుడు అమ్ముతారా, అట్టిపెట్టుకుంటారా? మీరు కొన్న స్టాకు ఆల్‌టైమ్‌ హైకి చేరినప్పుడు అమ్ముతారా, అట్టిపెట్టుకుంటారా?.... ఈ ప్రశ్నలకు చాలామంది అమ్మేస్తామనే సమాధానం ఇస్తారు. కానీ దిగ్గజ ఇన్వెస్టర్లు మాత్రం రివర్సులో సమాధానం ఇస్తారు. తాము కొన్న స్టాకులు 100 శాతం లాభాల్లో ఉన్నప్పుడు, ఆల్‌టైమ్‌ హైకి చేరినప్పుడు తాము విక్రయించమని చెబుతారు. ఇండియన్‌ వారెన్‌ బఫెట్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా ఇందుకు సంబంధించి రెండు

కొన్ని ప్రధాన కంపెనీ క్యూ3 ఫలితాలు

Wednesday 13th February 2019

నాట్కో మధ్యంతర డివిడెండు రూ.3.50 హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఔషధ రంగ కంపెనీ నాట్కో ఫార్మా 2018-19 సంవత్సరానికిగాను రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రెండవ మధ్యంతర డివిడెండుగా రూ.3.50 చెల్లించనుంది. ఈ నిర్ణయాన్ని బోర్డు మంగళవారం ఆమోదించింది. డిసెంబరు త్రైమాసికంలో నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 26.7 శాతం తగ్గి రూ.159 కోట్లుగా నమోదయింది. యూఎస్‌ఏ మార్కెట్లో ఓసెల్టామివిర్‌ మార్జిన్‌ తగ్గడం వల్లే లాభం

Most from this category