STOCKS

News


సుప్రీం కోర్ట్‌లో సత్వర విచారణ పిటీషన్‌

Thursday 13th June 2019
news_main1560407310.png-26267

  • దాఖలు చేసిన ఇండియాబుల్స్‌ హౌసింగ్‌
  • సెలవుల అనంతరం విచారిస్తామన్న వెకేషన్‌ బెంచ్‌

న్యూఢిల్లీ: ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌) కంపెనీకి  సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఈ కంపెనీలో రూ.98,000 కోట్ల మేర అవకతవకలు జరిగాయంటూ సుప్రీం కోర్ట్‌లో పిటీషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. కేవలం రూ.3,000తో నాలుగు ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్లు కొనుగోలు చేసిన పాలు విక్రయదారొకరు ఈ పిటిషన్‌ను దాఖలు చేశాడని ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌ తరపున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది ఏ.ఎమ్‌. సింఘ్వి పేర్కొన్నారు. కంపెనీని బ్లాక్‌మెయిల్‌ చేయాలనే ఉద్దేశంతోనే పిటిషనర్‌ దీన్ని దాఖలు చేశారని, అందుకే పిటిషన్‌లోని వివరాలను మీడియాకు లీక్‌ చేశారని వివరించారు. అవాస్తవాలతో కూడిన ఈ పిటీషన్‌ కారణంగా ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌) కంపెనీ మార్కెట్‌ విలువ రెండు రోజుల్లో రూ.7,000 కోట్లు హరించుకుపోయిందని వివరించారు. అందుకే ఈ పిటిషన్‌ను సత్వరం విచారించాల్సిందిగా విన్నవిస్తున్నానని చెప్పారు. సత్వరం విచారించాలన్న అభ్యర్థనను స్వీకరిస్తున్నామన్న వెకేషన్‌ బెంచ్‌... ఆ తర్వాత సత్వర విచారణ పిటిషన్‌లో లోపాలున్నాయని, వేసవి సెలవుల అనంతరం విచారిస్తామని పేర్కొంది. 



You may be interested

బ్యాంకర్లతో ఈనెల 13న నిర్మల సమావేశం

Thursday 13th June 2019

రుణ ప్రవాహం సులభతరం చేయడమే ప్రధాన అజెండా న్యూఢిల్లీ: బడ్జెట్‌ ముందస్తు చర్చల్లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 13న (గురువారం) బ్యాంకర్లతో సమావేశం కానున్నారు. రుణ ప్రవాహం సులభతరం చేయడమే ప్రధాన అజెండాగా ఈ చర్చలు కొనసాగనున్నట్లు వెల్లడైంది. ఆ తరువాత రోజైన 14న ప్రభుత్వ వర్గాల నుంచి ఇందుకు సంబంధించిన కీలక ప్రకటన జరిగే అవకాశం ఉంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ),

అదుపులో ధరలు... పరిశ్రమల పరుగు!

Thursday 13th June 2019

అదుపులో ధరలు... పరిశ్రమల పరుగు! ఊరటనిచ్చిన ఆర్థిక గణాంకాలు ఏప్రిల్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 3.4 శాతం ఆరు నెలల గరిష్ట స్థాయి నిరాశలోనే తయారీ, క్యాపిటల్‌ గూడ్స్‌  మేలో 3.05 శాతంగా రిటైల్‌ ధరల స్పీడ్‌ 7 నెలల గరిష్టమైనా నిర్దేశిత స్థాయిలోనే! న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగానికి సంబంధించి అలాగే రిటైల్‌ ధరల పరిస్థితికి సంబంధించి బుధవారం కేంద్రం విడుదల చేసిన గణాంకాలు కొంత ఊరట కల్పించాయి. ఏప్రిల్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 3.4 శాతంగా

Most from this category