STOCKS

News


ఉపశమించిన వాణిజ్యలోటు

Saturday 15th September 2018
news_main1537020394.png-20295

భారత వాణిజ్యలోటు ఆగస్టులో కాస్త తగ్గింది. అంతకుముందు ఐదేళ్ల గరిష్టానికి చేరిన వాణిజ్యలోటు ఆగస్టులో దిగివచ్చి 1739 కోట్ల డాలర్లకు చేరింది. జూలైలో ఈ లోటు 1800 కోట్ల డాలర్లుగా నమోదయిన సంగతి తెలిసిందే. గతేడాది ఆగస్టులో వాణిజ్యలోటు 1272 కోట్ల డాలర్లుగా ఉంది. రూపీలో రీబౌండ్‌ కనిపించి, బాండ్‌ ఈల్డ్స్‌ చల్లబడ్డ తరుణంలో వాణిజ్యలోటు కాస్త ఉపశమించడం ప్రభుత్వానికి ఊరటనిచ్చేఅంశంగా నిపుణులు భావిస్తున్నారు. 
గతేడాదితో పోలిస్తే ఈ ఆగస్టులో మొత్తం దిగుమతులు 25.4 శాతం పెరిగి 4520 కోట్ల డాలర్లకు చేరాయి. బంగారం, ముడిచమురు భారం ఎక్కువ కావడంతో దిగుమతులు భారమయ్యాయి. భారత పెట్రో దిగుమతులు ఆగస్టులో 51.6 శాతం పెరిగి 1183 కోట్ల డాలర్లకు చేరాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే బ్రెంట్‌ క్రూడ్‌ ధర పెరగడంతో పెట్రో దిగుమతుల భారం ఎక్కువయింది. ఇదే విధంగా పండుగ సీజన్‌ సందర్భంగా బంగారం దిగుమతులు రెట్టింపయ్యాయి. ఎలక్ట్రిక్‌, నాన్‌ ఎలక్ట్రిక్‌ మెషనరీ దిగుమతుల్లో 46 శాతం పెరుగుదల కనిపించింది. రసాయనాల దిగుమతులు 35 శాతం పెరిగాయి. 
గతేడాదితో పోలిస్తే ఈ ఆగస్టులో ఎగుమతులు 19. 2శాతం పెరిగి 2336 కోట్ల డాలర్లకు చేరాయి. ఇంజనీరింగ్‌ గూడ్స్‌, జెమ్స్‌ అండ్‌ జువలరీ తదితరాల ఎగుమతుల్లో మంచి వృద్ది నమోదయింది. ఫార్మా ఎగుమతులు సైతం ఊపందుకున్నాయి. పెట్రోల్‌ ఉత్పత్తుల ఎగుమతుల్లో 32 శాతం పెరుగుదల నమోదయింది. 



You may be interested

ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ దెబ్బ ఎవరికి తగిలేనో?!

Saturday 15th September 2018

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌(ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌)రేటింగ్‌ను ఇక్రా తాజాగా జంక్‌కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. దీంతో ఈ గ్రూప్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్‌ ఫండ్స్‌తో పాటు వీటికి రుణాలిచ్చిన బ్యాంకులు సైతం ఇబ్బందులు ఎదుర్కోనున్నాయి. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌కు ప్రైవేట్‌ బ్యాంకుల కన్నా ప్రభుత్వ రంగ బ్యాంకులే ఎక్కువగా రుణాలిచ్చాయి. ఈ గ్రూప్‌లో ఆర్థిక బలహీనతలు ఇలాగే కొనసాగితే పలు పీఎస్‌బీలకు ఎదురుదెబ్బ తగలడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

10శాతం కరెక‌్షన్‌ వుండొచ్చు

Saturday 15th September 2018

ముంబై:-  మార్కెట్లో10శాతం వరకూ కరెక‌్షన్‌ ఉండొచ్చని ఎడెల్వీజ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ సాహిల్‌ కపూర్‌ అభిప్రాయపడుతున్నారు. మార్కెట్‌ స్థితిగతులు, భారీగా క్షీణిస్తున్న రూపాయి పతన ప్రభావం మన మార్కెట్‌పై ఎంతవరకు ఉండవచ్చన్న అంశాలపై ఆయన తన అభిప్రాయాలను ఒక ఆంగ్లచానల్‌లో వ్యక్తం చేశారు. అలాగే ఇటీవల వ్యవస్థలో నెలకొన్న స్థూల ఆర్థిక సవాళ్లను ఇన్వెస్టర్లు వ్యూహాత్మకంగా ఎలా ఎదుర్కోవాలో వివరించారు. ఇంటర్వ్యూ వివరాలు... ప్రశ్న:- రూపాయి పతనం మార్కెట్‌ వర్గాలకే కాకుండా, ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారింది. ఈ ప్రస్తుత

Most from this category