ముడి చమురు బిల్లు.. రూపాయిల్లో చెల్లింపు
By Sakshi

న్యూఢిల్లీ: ఇరాన్ ముడిచమురు బిల్లును భారత్ రూపాయిల్లో చెల్లించనున్నది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని సమాచారం. ఈ ఒప్పందంలో భాగంగా భారత రిఫైనరీలు ఇరాన్ నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురుకు చెల్లించాల్సిన సొమ్ములను యూకో బ్యాంక్‌లోని నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ ఖాతాలో జమ చేస్తాయి.ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలు గత నెల 5నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే ఈ ఆంక్షల నుంచి భారత్‌తో సహా ఏడు దేశాలకు అమెరికా మినహాయింపును ఇచ్చింది.
You may be interested
ఎతిహాద్ నుంచి రుణానికి జెట్ ప్రయత్నాలు
Friday 7th December 2018ముంబై: నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్.. తమ భాగస్వామ్య సంస్థ ఎతిహాద్ ఎయిర్వేస్ను 350 మిలియన్ డాలర్ల రుణం ఇవ్వాల్సిందిగా కోరింది. ఓ వైపు సమస్యల నుంచి గట్టెక్కే క్రమంలో వాటా విక్రయ ప్రయత్నాలను కొనసాగిస్తూనే మరోవైపు తక్కువ వడ్డీ రేటుపై ఈ మేరకు రుణం సమకూర్చాలంటూ జెట్ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వివరించాయి.
శుక్రవారం వార్తల్లోని షేర్లు
Friday 7th December 2018వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఇవి ఖాదీం ఇండియా:- రూ.30 కోట్ల వాణజ్య పేపర్ల జారీ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది. కేడిల్లా హెల్త్‌కేర్, జైడస్వెల్నెస్:- కేడిల్లా హెల్త్‌కేర్ తన అనుబంధ సంస్థ జైడస్ వెల్నెస్ ‘‘షేర్ సబ్స్క్రిప్షన్ అగ్రీమెంట్’’ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా కంపెనీ జైడస్ కంపెనీకి చెందిన 85లక్షల ఈక్విటీ షేర్లను ప్రతిషేరు ధర రూ.1,382ల వద్ద సబ్‌స్క్రెబ్ చేసుకుంది. సాగర్ సిమెంట్స్:- ఈ నవంబర్‌లో