STOCKS

News


ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సబ్సిడరీలకు నామినీ డైరెక్టర్లు

Saturday 13th October 2018
news_main1539410022.png-21113

ముంబై: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ నూతన బోర్డు ఎనిమిది సబ్సిడరీ కంపెనీలకు నామినీ డైరెక్టర్లను నియమించింది. వ్యక్తిగత, నిర్వహణ వ్యయాల విషయంలో పొదుపు చర్యలను సైతం ప్రకటించింది. ఉదయ్‌ కోటక్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బోర్డు శుక్రవారం సమావేశమై ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. అలాగే, తీవ్ర రుణ సంక్షోభంలో ఉన్న సంస్థ భవిష్యత్తు రోడ్‌మ్యాప్‌పైనా చర్చించింది. ఎన్‌సీఎల్‌టీ అనుమతి మేరకు పలు సబ్సిడరీ కంపెనీలకు నామినీ డైరెక్టర్లను భర్తీ చేస్తున్నట్టు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. డైరెక్టర్లుగా నియమితులైన వారిలో సెబీ మాజీ చైర్మన్‌ జీఎన్‌ బాజ్‌పాయి, ఐసీఐసీఐ బ్యాంకు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జీసీ చతుర్వేది, ఐఏఎస్‌ అధికారి, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ షిప్పింగ్‌ మాలినీ శంకర్‌, వినీత్‌ నయ్యర్‌, సీనియర్‌ ఆడిటర్‌ నందకిషోర్‌, రాజస్థాన్‌ రాష్ట్ర మాజీ చీఫ్‌ సెక్రటరీ సీఎస్‌ రాజన్‌ తదితరులున్నారు. వీరిలో కొందరు ప్రస్తుతం ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ బోర్డులోనూ ఉన్నారు. నయ్యర్‌ ఆధ్వర్యంలో కోర్‌ ఆపరేటింగ్‌ కమిటీ ఏర్పాటుకు కూడా బోర్డు అనుమతి తెలిపింది. 



You may be interested

హిందుస్తాన్‌ యూనిలీవర్‌ లాభం రూ.1,525 కోట్లు

Saturday 13th October 2018

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌(హెచ్‌యూఎల్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ. 1,525 కోట్ల నికర  లాభం(స్టాండలోన్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం(రూ.1,276 కోట్లు)తో పోల్చితే 20 శాతం వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్‌ తెలిపింది. వివిధ కేటగిరీల్లో రెండంకెల వృద్ధి సాధించడం, నిర్వహణ పనితీరు బాగా ఉండటం వల్ల ఈ స్థాయిలో నికర లాభం పెరిగిందని కంపెనీ సీఎమ్‌డీ

ఆర్థిక గణాంకాల నీరసం!

Saturday 13th October 2018

న్యూఢిల్లీ: భారత్‌ తాజా ఆర్థిక గణాంకాలు కొంత నిరాశ పరిచాయి. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం- ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధి రేటు 4.3 శాతంగా (2017 ఇదే నెలతో పోల్చి చూస్తే) నమోదయ్యింది. మూడు నెలల కాలంలో ఇంత తక్కువ స్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. మైనింగ్‌ రంగం అలాగే భారీ ఉత్పత్తుల యంత్ర

Most from this category