పారిశ్రామిక రంగం పరుగు
By Sakshi

న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం జూన్‌లో పరుగు పెట్టింది. సంబంధిత సమీక్షా నెలలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు 7 శాతంగా నమోదయ్యింది. మే నెలలో ఈ రేటు 3.9 శాతంకాగా, 2017 జూన్‌లో వృద్ధి అసలు లేకపోగా, -0.3 శాతం క్షీణత నమోదయ్యింది. సూచీలో దాదాపు 77 శాతంగా ఉన్న తయారీతోపాటు మైనింగ్, విద్యుత్ రంగాల నుంచి మెరుగైన ఉత్పత్తి జూన్‌లో మంచి వృద్ధి ఫలితానికి దారితీసింది. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం...
♦ తయారీ: జూన్‌లో ఉత్పత్తి వృద్ధి రేటు 6.9 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా -0.7 శాతం క్షీణించింది. ఇక ఈ విభాగాన్ని ఏప్రిల్ నుంచి జూన్ మధ్య చూస్తే వృద్ధిరేటు 1.6 శాతం నుంచి (2017 ఇదే కాలంతో పోల్చి) 6.2 శాతానికి చేరింది. తయారీ రంగంలోని 23 పారిశ్రామిక గ్రూపుల్లో 19 సానుకూల వృద్ధి తీరును నమోదుచేసుకున్నాయి.
♦ మైనింగ్: జూన్‌లో వృద్ధి రేటు 0.1 శాతం నుంచి 6.6 శాతానికి పెరిగింది. ఏప్రిల్-జూన్ మధ్య ఈ రేటు 1.1 శాతం నుంచి 5.4 శాతానికి చేరింది.
♦ విద్యుత్: వృద్ధి రేటు 2.1 శాతం నుంచి 8.5 శాతానికి పెరిగింది. అయితే ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో ఈ రేటు 5.3 శాతం నుంచి 4.9 శాతానికి తగ్గింది.
♦ క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్రపరికరాల డిమాండ్‌కు సంబంధించిన ఈ విభాగంలో వృద్ధి రేటు 9.6 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలలో వృద్ధిలేకపోగా -6.1 శాతం క్షీణత నమోదయ్యింది.
♦ కన్జూమర్ డ్యూరబుల్స్: -3.5 శాతం క్షీణత భారీగా 13.1 శాతం వృద్ధికి మారింది.
ఆరునెలల్లో...
ఐఐపీ వృద్ధి రేటు ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో 5.2 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 1.9 శాతం.
You may be interested
టాటా స్టీల్‌కు భూషణ్ స్టీల్‌ను విక్రయించొచ్చు
Saturday 11th August 2018న్యూఢిల్లీ: దివాలా పరిష్కార చర్యల్లో భాగంగా భూషణ్ స్టీల్‌ను టాటా స్టీల్‌కు విక్రయించాలన్న నిర్ణయాన్ని జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) సమర్థించింది. ఐబీసీ చట్టంలోని సెక్షన్ 29ఏ ప్రకారం కంపెనీ కొనుగోలుకు బిడ్ వేసే అర్హత టాటా స్టీల్‌కు లేదన్న భూషన్ స్టీల్ ప్రమోటర్ నీరజ్ సింఘాల్ వాదనను తోసిపుచ్చింది. ‘‘టాటా స్టీల్ విదేశీ సబ్సిడరీ అయిన టాటా స్టీల్ యూకేకు బ్రిటన్ కోర్టు ఈ ఏడాది
నల్లధనం సమాచార మార్పిడిపై స్విస్‌తో భారత్ చర్చలు
Saturday 11th August 2018న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లధనం వివరాలను సేకరించే ప్రయత్నాలను భారత ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా వారి రహస్య ఖాతాల్లోని డబ్బుకు సంబంధించి ఆటోమేటిక్‌గా సమాచార మార్పిడిపై స్విట్జర్లాండ్‌తో చర్చలు జరుపుతోంది. శుక్రవారం విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్, స్విట్జర్లాండ్ విదేశాంగ మంత్రి ఇగ్నేజియో క్యాసిస్ మధ్య జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య ఆటోమేటిక్‌గా సమాచార