STOCKS

News


ఆర్‌ క్యాప్‌ షేర్లను వదిలించుకోనున్న ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌

Friday 14th June 2019
news_main1560501647.png-26297

అనిల్‌ అంబాని రిలయన్స్‌ క్యాపిటల్‌ షేర్లను ఇప్పటి వరకు కవర్‌ చేస్తూ వస్తున్న ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌  తాజాగా ఈ షేర్లను వదిలించుకోవటానికి సిద్ధపడింది.  దీనితో షేరును కవర్‌ చేస్తున్న ఏకైక  బ్రోకరేజీ కంపెనీ కూడా ఆర్‌ క్యాప్‌ను వదిలించుకున్నట్లు కానుంది.  పీడబ్యుసీ విరమించుకున్న తర్వాత ఏర్పడిన పరిణామాల వలన ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఈ నిర్ణయం తీసుకుంది. తక్కువ రేటింగ్‌లు, ఆడిటర్‌ విరమణ, ఒత్తిడిలో ఉన్న బ్యాలెన్స్‌ సీట్లు... కారణంగా ఈ సమయంలో ఆర్‌ క్యాప్‌లో పెట్టుబడులు పెట్టడం తెలివైన పని కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఏడాది కాలంలో ఆర్‌క్యాప్‌ షేరు విలువ 80శాతం పడిపోయి ప్రస్తుతం రూ.84.40 వద్ద ఉంది.
     ‘ ఆర్‌ క్యాప్‌ అనుబంధ సంస్థల రేటింగ్‌లు కూడా ప్రస్తుతం తక్కువ స్ధాయిలో ఉన్నాయి. పీడబ్యుసీ విరమణ కంపెనీకి పెద్ద దెబ్బ. రిటర్న్‌ ఆఫ్‌ ఈక్విటిలు(ఆర్‌ఓఈ)  బలంగా ఉన్న వ్యాపరాల నుంచి వైదొలడంతో ఆర్‌క్యాప్‌ ఎర్నింగ్స్‌ భవిష్యత్‌లో మరింత క్షీణించవచ్చు. ఇది ఇప్పుడున్న స్టాక్‌ హోల్డర్‌లకు నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే మేం ఈ కంపెనీ కవరేజీ నుంచి తప్పుకుంటున్నాం’ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ వివరించింది. లాభాలను అందించే ఏమ్‌సీ, జనరల్‌ ఇన్స్యూరెన్స్, హౌసింగ్‌ ఫైనాన్స్‌ వంటి వ్యాపారాలలోని వాటాలను అసురక్షిత రుణాలు, కార్పోరేట్‌ అప్పులను తీర్చడంలో భాగంగా రిలయన్స్‌ క్యాపిటల్‌ అమ్ముకుంది. రిలయన్స్‌ మీడియా రంగంలో పెట్టుబడులు ప్రస్తుతమున్న స్టాక్‌ హోల్డర్లకు ప్రతికూలతనే మిగులుస్తాయి.  ఆర్‌ క్యాప్‌ తన అనుబంధ సంస్థలైన రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌లో మెజార్టీ వాటాను, జనరల్‌ ఇన్య్సూరెన్స్‌లో 49శాతం వరకు వాటాలను అమ్మేశాక ఆయా కంపెనీల్లో నామామాత్రం వాటాదారుగా మిగిలింది.  



You may be interested

22 నెలల కనిష్టానికి డబ్ల్యూపీఐ గణాంకాలు

Friday 14th June 2019

ఆహార పదార్థాలు, ఇంధన, విద్యుత్‌ ధరలు దిగిరావడంతో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) మే నెలలో 22 నెలల కనిష్టానికి దిగివచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మే నెలలో 2.45శాతంగా నమోదైంది. ఏప్రిల్‌లో ఇది 3.07శాతంగా ఉండగా, గతేడాది(2018) ఇదే మేలో 4.78శాతంగా నమోదైంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల వివరాలు ఇలా ఉన్నాయి. 1. ఆహార పదార్థాల ద్రవ్యోల్బం మేలో 6.99శాతానికి పరిమితమైంది. ఏప్రిల్‌

మా వృద్ధిలో తెలుగు రాష్ట్రాలు కీలకం

Friday 14th June 2019

క్లయింట్ల సంఖ్య 14%; ఆదాయం 63% ఎడిల్‌వైజ్‌ వెల్త్‌ అడ్వయిజరీ వెల్లడి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: అధిక నెట్‌వర్త్‌ గల వ్యక్తులకు, ప్రొఫెషనల్స్‌కు వ్యక్తిగత వెల్త్‌ అడ్వయిజరీ సేవలందిస్తున్న ఎడిల్‌వైజ్‌... గత ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో తమ క్లయింట్ల సంఖ్య 14 శాతం మేర పెరిగినట్లు ప్రకిటించింది. మార్కెట్లలో ఇన్వెస్ట్‌మెంట్‌, ట్రేడింగ్‌కు సంబంధించి ఆధునిక టెక్నాలజీతో సొంత ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేశామని, దానివల్లే ఈ వృద్ధి సాధ్యమయిందని కంపెనీ హెడ్‌ రాహుల్‌

Most from this category