STOCKS

News


రేపు భారత్‌-22 ఈటీఎఫ్‌ ఫాలో ఆన్‌ ఆఫర్‌

Wednesday 13th February 2019
Markets_main1550039381.png-24170

  • రేపు భారత్‌-22 ఈటీఎఫ్‌ ఫాలో ఆన్‌ ఆఫర్‌
  • రూ. 3,500 కోట్ల సమీకరణ లక్ష్యం! 
  • ఒక్క రోజుకే ఎఫ్‌పీఓ పరిమితం 

భారత్‌-22 ఈటీఎఫ్‌ (ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌) ఫాలో ఆన్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ)రేపు(గురువారం) జరగనున్నది. ఒక్క రోజు మాత్రమే జరిగే ఈ ఎఫ్‌పీఓ ద్వారా కనీసం రూ.3,500 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతకు మించి బిడ్‌లు వస్తే, వాటిని కూడా అట్టే పెట్టుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ.80,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సమీకరణలో భాగంగానే భారత్‌-22 ఈటీఎఫ్‌ను మరో దఫా ప్రభుత్వం ఆఫర్‌ చేస్తోంది. కాగా ఇప్పటిదాకా డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా ప్రభుత్వం రూ.36,000 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. సాధారణంగా ఏ ఈటీఎఫ్‌ ఎఫ్‌పీఓ అయినా నాలుగు రోజుల పాటు ఉంటుంది. తొలి రోజు యంకర్‌ ఇన్వెస్టర్లకు, మిగిలిన మూడు రోజులు రిటైల్‌ ఇన్వెస్టర్లకు, సంస్థాగత ఇన్వెస్టర్లకు రిజర్వ్‌ చేస్తారు. కానీ ఈ ఎఫ్‌పీఓ ఒక్క రోజుకే పరిమితమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

ఇప్పటిదాకా రూ.22,900 కోట్లు 
భారత్‌-22 ఈటీఎఫ్‌ ద్వారా ప్రభుత్వం రెండు దఫాలుగా రూ.22,900 కోట్లు సమీకరించింది. 2017, నవంబర్‌లో రూ.14,500 కోట్లు, గత ఏడాది జూన్‌లో రూ.8,400 కోట్లు చొప్పున సమీకరించింది. ఈ ఈటీఎఫ్‌లో ఓఎన్‌జీసీ, ఐఓసీ, ఎస్‌బీఐ, బీపీసీఎల్‌, కోల్‌ ఇండియా, నాల్కో, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, ఇంజినీర్స్‌ ఇండియా, ఎన్‌బీసీసీ, ఎన్‌టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, గెయిల్‌, ఎల్‌ఎల్‌సీ ఇండియా తదితర ప్రభుత్వ రంగ సంస్థల షేర్లు ఉన్నాయి. ఎస్‌బీఐ, ఇండియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వంటి మూడు ప్రభుత్వ రంగ షేర్లు కూడా ఉన్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ, ఎల్‌ అండ్‌టీ షేర్లు కూడా ఉన్నాయి. 

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రెండో ఈటీఎఫ్‌. మరో ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌, సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ ఫాలో ఆన్‌ ఆఫర్‌ ద్వారా కేంద్రం గత ఏడాది నవంబర్‌లో రూ.17,300 కోట్లు సమీకరించింది. దేశీయంగా అత్యథిక నిధులు సమీకరించిన  ఈటీఎఫ్‌ ఇదే. ఈ సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌లో 11 ప్రభుత్వ రంగ షేర్లున్నాయి.You may be interested

సన్‌ ఫార్మా లాభం నాలుగు రెట్లు

Wednesday 13th February 2019

పుంజుకున్న అమెరికా జనరిక్స్‌ వ్యాపారం రూ.7,740 కోట్లకు మొత్తం ఆదాయం  ఆర్‌ అండ్‌ డీ పెట్టుబడులు అమ్మకాల్లో 6 శాతం  న్యూఢిల్లీ: సన్‌ ఫార్మా నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో నాలుగు రెట్లు పెరిగింది. గత క్యూ3లో రూ.322 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ3లో రూ.1,242 కోట్లకు పెరిగిందని సన్‌ ఫార్మా తెలిపింది. శాతం పరంగా చూస్తే, 286 శాతం వృద్ధి సాధించింది. అమెరికా జనరిక్స్‌

హిందాల్కో లాభం 47 శాతం అప్‌

Wednesday 13th February 2019

రూ.713 కోట్లకు నికర లాభం  తగ్గిన వడ్డీ వ్యయాలు  8 శాతం పెరిగిన ఆదాయం  హిందాల్కో నికర లాభం ఈ డిసెంబర్‌ క్వార్టర్లో 47 శాతం(ఉత్కళ్‌ ప్లాంట్‌ను కలుపుకొని) వృద్ధితో రూ.713 కోట్లకు  పెరిగింది. గత క్యూ3లో రూ. 484 కోట్ల నికర లాభం వచ్చిందని హిందాల్కో తెలిపింది. నిర్వహణ ఆదాయం అధికంగా ఉండటం, వడ్డీ వ్యయాలు తక్కువగా ఉండటంతో నికర లాభం పెరిగిందని వివరించింది.  ఆదాయం రూ,.11,028 కోట్ల నుంచి 8 శాతం

Most from this category