STOCKS

News


లీజుకు హ్యుందాయ్‌ వాహనాలు

Friday 17th May 2019
news_main1558075411.png-25790

  • లీజింగ్‌ సేవల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంస్థ
  •  ఏఎల్‌డీ ఆటోమోటివ్‌ ఇండియాతో జట్టు
  • హైదరాబాద్, చెన్నై తదితర నగరాల్లో సేవలు

న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌) తాజాగా వాహనాల లీజింగ్ సర్వీసుల్లోకి ప్రవేశించింది. ఇందుకోసం ఏఎల్‌డీ ఆటోమోటివ్ ఇండియాతో జట్టు కట్టింది. హ్యుందాయ్ లీజింగ్‌ పేరిట ప్రారంభించిన ఈ సర్వీసు కింద తమ పోర్ట్‌ఫోలియోలో ఉన్న అన్ని రకాల వాహనాలు లీజింగ్‌కి లభిస్తాయని సంస్థ తెలియజేసింది. ముందస్తు చెల్లింపులు, మెయింటెనెన్స్ వ్యయాల్లాంటి బాదరబందీలు ఏమీ ఉండవని హెచ్‌ఎంఐఎల్‌ ఈడీ (సేల్స్ అండ్ మార్కెటింగ్‌) ఎస్‌జే ఝా ఈ సందర్భంగా చెప్పారు. భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ పెను మార్పులకు లోనవుతోందని, వాహనాల లీజింగ్ వ్యాపారం పుంజుకుంటోందని ఆయన చెప్పారు. భవిష్యత్‌లో ఈ విభాగంలో వ్యాపార అవకాశాలు గణనీయంగా ఉంటాయని చెప్పారాయన. వేతన జీవులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌, చిన్న.. మధ్య తరహా సంస్థలు, కార్పొరేట్స్‌, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు లక్ష్యంగా ‍హ్యుందాయ్ ఈ లీజింగ్ సేవలు అందిస్తోంది. తొలి దశలో హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. నగరం, ఎంచుకున్న మోడల్‌ను బట్టి వాహనాన్ని కనీసం రెండేళ్ల నుంచి అయిదేళ్ల దాకా లీజుకు తీసుకోవాల్సి ఉంటుంది. 



You may be interested

ఆయిల్‌, గ్యాస్‌ బ్లాక్‌ కోసం ఆర్‌ఐఎల్‌, బీపీ పోటీ

Friday 17th May 2019

ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి పోటీలోకి వేదాంత, ఓఎన్‌జీసీ, ఓఐఎల్‌ సైతం బిడ్లు దాఖలు 32 బ్లాక్‌లను ఆఫర్‌ చేస్తున్న కేంద్రం న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, దాని భాగస్వామి బ్రిటిష్‌ పెట్రోలియం (బీపీ పీఎల్‌సీ) ఎనిమిదేళ్ల విరామం తర్వాత తొలిసారిగా ఓ చమురు, సహజ వాయివు బ్లాక్‌ కోసం బిడ్‌ దాఖలు చేశాయి. వేదాంత 30 బ్లాక్‌ల కోసం బిడ్లు వేయగా, ఓఎన్‌జీసీ 20 బ్లాక్‌లకు బిడ్లు వేసింది. ఓపెన్‌ యాకరేజ్‌ లైసెన్సింగ్‌ పాలసీ (ఓఏఎల్‌పీ)

ఇండిగో ప్రమోటర్ల మధ్య విభేదాలు!!

Friday 17th May 2019

వ్యాపార వ్యూహాలపై భేదాభిప్రాయాలు  లీగల్‌ సంస్థల సహాయంతో పరిష్కార యత్నాలు షేరు కుదేలు.. 9 శాతం డౌన్‌ రూ. 5 వేల కోట్లు తగ్గిన మార్కెట్‌ క్యాప్‌ న్యూఢిల్లీ: ఒకదాని వెంట ఒకటిగా దేశీ విమానయాన సంస్థలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. రుణ సంక్షోభంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు నిల్చిపోగా.. తాజాగా చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో వ్యవస్థాపకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయన్న వార్తలు తెరపైకి వచ్చాయి. పనితీరు, వ్యాపార విస్తరణ వ్యూహాలపై వ్యవస్థాపకులు రాకేష్‌

Most from this category