STOCKS

News


మార్కెట్లోకి వెర్నా వార్షికోత్సవ ఎడిషన్

Saturday 15th September 2018
auto-mobiles_main1536987734.png-20277

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన కార్ల కంపెనీ హ్యుందాయ్‌ మోటార్ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) మిడ్‌-సైజ్‌ సెడాన్‌ వెర్నా వార్షికోత్సవ ఎడిషన్‌ను శుక్రవారం మార్కెట్‌లోకి విడుదలచేసింది. మాన్యువల్‌, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌... పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ వేరియంట్లలో లభ్యమయ్యే ఈ కారు ధరల శ్రేణి రూ.11.69 లక్షల నుంచి రూ.13.03 లక్షలుగా నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. మొత్తం 1,000 యూనిట్లను ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది. వైర్‌ లెస్‌ ఫోన్‌ చార్జింగ్‌, స్కిడ్ ప్లేట్ రేర్‌ స్పాయిలర్ వంటి అధునాతన ఫీచర్లు ఈ కారులో ఉన్నట్లు హ్యుందాయ్ సీఈఓ వై.కే.కూ వివరించారు. గతేడాది ఆగస్టులో విడుదలైన తదుపరి తరం వెర్నాకు మంచి స్పందన లభించిందని ఈ సందర్భంగా చెప్పారు.



You may be interested

భారీగా తగ్గిన క్వాలిటీ నికర లాభం

Saturday 15th September 2018

న్యూఢిల్లీ: డెయిరీ ఉత్పత్తుల కంపెనీ క్వాలిటీ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో భారీగా తగ్గింది. గత క్యూ1లో రూ.28 కోట్ల నికర లాభం రాగా ఈ క్యూ1లో రూ.కోటికే పరిమితమైనట్లు క్వాలిటీ తెలిపింది. అమ్మకాలు అంతంత మాత్రంగా ఉండటమే నికర లాభం భారీగా తగ్గడానికి కారణమని వివరించింది. గత క్యూ1లో రూ.1,573 కోట్లుగా ఉన్న నికర ఆదాయం ఈ క్యూ1లో రూ.1,266 కోట్లకు

ఇన్ఫోసిస్‌ చేతికి ఫ్లూయిడో కంపెనీ

Saturday 15th September 2018

న్యూఢిల్లీ: ఫిన్లాండ్‌కు చెందిన ఫ్లూయిడో కంపెనీని భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ రూ.545 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి ఈ లావాదేవీ పూర్తవుతుందని ఇన్ఫోసిస్‌ తెలిపింది. ఈ కంపెనీ కొనుగోలుతో నార్డిక్‌ ప్రాంతంలో మరింత శక్తివంతమవుతామని పేర్కొంది. ఫిన్లాండ్‌లోని ఈస్‌పూ కేంద్రంగా ఫ్లూయిడో కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2010లో ఆరంభమైన ఈ కంపెనీ ఫిన్లాండ్‌, డెన్మార్క్‌, స్వీడన్‌, నార్వే, స్లోవేకియా దేశాల్లో క్లయింట్లకు సాఫ్ట్‌వేర్‌ సర్వీసులందిస్తోంది.

Most from this category