STOCKS

News


హిందుస్తాన్‌ యూనిలీవర్‌ లాభం రూ.1,525 కోట్లు

Saturday 13th October 2018
news_main1539410076.png-21114

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌(హెచ్‌యూఎల్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ. 1,525 కోట్ల నికర  లాభం(స్టాండలోన్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం(రూ.1,276 కోట్లు)తో పోల్చితే 20 శాతం వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్‌ తెలిపింది. వివిధ కేటగిరీల్లో రెండంకెల వృద్ధి సాధించడం, నిర్వహణ పనితీరు బాగా ఉండటం వల్ల ఈ స్థాయిలో నికర లాభం పెరిగిందని కంపెనీ సీఎమ్‌డీ సంజీవ్‌ మెహతా చెప్పారు. గత క్యూ2లో రూ.8,199 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు ఈ క్యూ2లో 11 శాతం వృద్దితో రూ.9,138 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేర్‌పై రూ.9 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. ఎబిటా 20 శాతం వృద్ధితో రూ.2,019 కోట్లకు, ఎబిటా మార్జిన్‌ 1.7 శాతం పెరిగి 21.9 శాతానికి పెరిగాయని వివరించారు.

డిమాండ్‌ నిలకడగానే..
కీలకమైన సెగ్మెంట్లను పటిష్టం చేయడంపై దృష్టి సారించడం, వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేయడం వల్ల మంచి లాభాల వృద్ధిని సాధించామని సంజీవ్‌ వ్యాఖ్యానించారు. వ్యయాల నియంత్రణ వల్ల ముడి పదార్ధాల ధరల పెరుగుదల సమస్యను తట్టుకోగలిగామని, మార్జిన్లను పెంచుకోగలిగామని వివరించారు.  సమీప భవిష్యత్తులో డిమాండ్‌ నిలకడగానే ఉండగలదన్న అంచనాలున్నాయని పేర్కొన్నారు. ముడి చమురు ధరలు పెరగడం, కరెన్సీ పతనం వల్ల ఉత్పన్నమయ్యే ప్రతికూల పరిస్థితులను తట్టుకోగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. 

డొమెక్స్‌, విమ్‌, సర్ఫ్‌ ఎక్సెల్‌ తదితర బ్రాండ్లతో కూడిన హోమ్‌ కేర్‌ కేటగిరీలో కొన్ని ఉత్పత్తుల ధరలను 2-3 శాతం రేంజ్‌లో పెంచామని కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ పాఠక్‌ తెలిపారు. గత క్యూ2లో రూ.3,910 కోట్లుగా ఉన్న పర్సనల్‌ కేర్‌ సెగ్మెంట్‌ ఆదాయం ఈ క్యూ2లో 10 శాతం వృద్ధితో రూ.4,316 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. హోమ్‌కేర్‌ ఉత్పత్తుల విభాగం ఆదాయం 12 శాతం వృద్ధితో రూ.3,080 కోట్లకు, ఫుడ్‌, రిఫ్రెష్‌మెంట్‌ కేటగిరీ విభాగం ఆదాయం 12 శాతం వృద్ధితో రూ.1,704 కోట్లకు పెరిగాయని వివరించారు. ఇక ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా లియో పురిని నియమించామని, ఆయన నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపారు. 

ఇక ఆరు నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-సెప్టెంబర్‌ కాలంలో రూ.2,559 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం అదే కాలానికి 19 శాతం వృద్ధితో రూ.3,054 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఇక నికర అమ్మకాలు రూ.17,293 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.18,494 కోట్లకు పెరిగిందని వివరించారు. 

మార్కెట్‌ ముగిసిన తర్వాత హెచ్‌యూఎల్‌ ఫలితాలు వచ్చాయి. ఫలితాలు బాగానే ఉంటాయనే అంచనాలతో బీఎస్‌ఈలో హెచ్‌యూఎల్‌ షేర్‌ 2.6 శాతం లాభంతో రూ.1,569 వద్ద ముగిసింది. 



You may be interested

రూపాయి... ఒకే రోజు 55పైసలు లాభం

Saturday 13th October 2018

ముంబై: ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌  మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ శుక్రవారం ఒకేరోజు 55 పైసలు లాభపడింది. గడచిన మూడు వారాల్లో ఒకేరోజు రూపాయి ఇంత ఎక్కువగా రికవరీ అవ్వడం ఇదే తొలిసారి. వరుసగా ఆరు రోజులు ఏ రోజుకారోజు కొత్త రికార్డులతో పతనం బాట పట్టిన రూపాయి ఈ నెల 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే అటు తర్వాత 10,11,12 తేదీల్లో

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సబ్సిడరీలకు నామినీ డైరెక్టర్లు

Saturday 13th October 2018

ముంబై: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ నూతన బోర్డు ఎనిమిది సబ్సిడరీ కంపెనీలకు నామినీ డైరెక్టర్లను నియమించింది. వ్యక్తిగత, నిర్వహణ వ్యయాల విషయంలో పొదుపు చర్యలను సైతం ప్రకటించింది. ఉదయ్‌ కోటక్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బోర్డు శుక్రవారం సమావేశమై ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. అలాగే, తీవ్ర రుణ సంక్షోభంలో ఉన్న సంస్థ భవిష్యత్తు రోడ్‌మ్యాప్‌పైనా చర్చించింది. ఎన్‌సీఎల్‌టీ అనుమతి మేరకు పలు సబ్సిడరీ కంపెనీలకు నామినీ డైరెక్టర్లను భర్తీ చేస్తున్నట్టు ఓ

Most from this category