ఒడిదుడుకుల మార్కెట్లో ప్రయాణం ఎలా..?
By P Pavan Adithya

ముంబై: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అధిక స్థాయి ఒడిదుడుకులకు ఆస్కారం ఉండనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికలపై ఇన్వెస్టర్లు పూర్తి దృష్టిసారించగా.. మధ్యప్రదేశ్‌లో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ నెలకొందని ఒపినియన్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో స్పష్టమైన మెజర్టీ ఉండగా.. రాజస్థాన్‌లో ఓటమి అవకాశాలు ఉన్నట్లు వెల్లడించాయి. అధికార పార్టీ భవిష్యత్తు ఏంటనే అంశం సంస్కరణల కొనసాగింపునకు ముడిపడి ఉన్న అంశం అయినందున డిసెంబర్ 11 వరకు తీవ్ర ఒడిదుడుకులకు అవకాశం ఉండనుందని భావిస్తున్నారు. కోటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా ప్రకారం.. బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధిస్తే మార్కెట్ ర్యాలీ కొనసాగనుంది. ఇలా కాకుండా మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ఓటమిపాలైతే షార్ప్ కరెక్షన్కు అవకాశం ఉంది. వచ్చే వారంలో వైల్డ్ స్వింగ్స్ తప్పవని విశ్లేషించింది. ఒడిదుడుకులు తప్పవనే సంకేతాలు ఇప్పటికే అందగా.. ఇక ఇటువంటి సమయంలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిదనే విషయంపై పలువురు నిపుణులు తమదైన శైలిలో విశ్లేషణలు అందించారు. రానున్న ఓలటాలిటీని.. ప్రస్తుత ఉద్దేశిత అస్థిరత (కరెంట్ ఇంప్లైడ్ ఓలటాలిటీ), భవిష్యత్ అవగాహన అస్థిరత (ప్యూచర్ రియలైజ్డ్ ఓలటాలిటీ) అని రెండుగా విభజించి చూడడం వల్ల ట్రేడింగ్ మరింత అనుకూలంగా ఉంటుందని క్వాంట్స్యాప్ సీఈఓ, హెడ్ రీసెర్చ్ శుభం అగర్వాల్ సూచించారు. ఉద్దేశిత అస్థిరత అధికంగా ఉన్నప్పుడు కాల్, పుట్ ఆప్షన్ రెండింటిని కలిపి విక్రయించాలన్నారు. అంటే.. అధిక కాల్స్, తక్కువ పుట్స్‌లో ఏకకాల లాంగ్స్ తీసుకోవాలని సూచించారు. లేదంటే, ఈ రకరమైన ఒడిదుడుకులు ఉన్నప్పుడు ఆప్షన్స్‌లో లాంగ్‌కు వెళ్లమని సూచించారు. గతంలో జరిగిన గుజరాత్, కర్ణాటక ఎన్నికల సమయంలో ఉద్దేశిత అస్థిరత పైకి 16–18 శ్రేణిలో ఉండగా, దిగువన 11–13 శ్రేణిలో ఉంది. సగటున 14.50-15 స్థాయిలో ఉందన్నారు. ఇక ఎన్నికల కంటే ముందు 500 పాయింట్ల పెరుగుదలను చూడగా.. రిస్క్ తీసుకోగలిగిన ఇన్వెస్టర్లు, లాంగ్ పొజిషన్లను హెడ్జ్ చేయదలిచిన వారు 174 వద్ద ట్రేడవుతున్న 10800 ఎట్ ద మనీ (ఎటీఎం) పుట్ ఆప్షన్స్‌ను తీసుకోవచ్చని.. అయితే, ఒడిదుడుకుల వల్ల ప్రీమియం వాల్యూయేషన్స్ తగ్గుతాయని యాక్సిస్ సెక్యూరిటీస్ టెక్నికల్ & డెరివేటివ్స్ అనలిస్ట్ రాజేష్ పాలవియా సూచించారు. ఇక ఎటువంటి వ్యూహాలు అవలంభించాలనే విషయంపై మరికొందరి విశ్లేషణలు ఎలా ఉన్నాయన్న విషయానికి వస్తే.. చార్ట్‌వ్యూ ఇండియా డాట్ ఇన్ టెక్నికల్ రీసెర్చ్ అండ్ ట్రేడింగ్ అడ్వైజరీ చీఫ్ స్ట్రాటజిస్ మజర్ మహ్మద్ సూచన జీఈపీఎల్ కాపిటల్ వైస్ ప్రెసిడెంట్, టెక్నికల్ రీసెర్చ్ పుష్కరాజ్ షామ్ కనిత్కర్ సూచన ఐసీఐసీఐ డైరెక్ట్ డెరివేటివ్ హెడ్ అమిత్ గుప్తా సూచన యాక్సిస్ సెక్యూరిటీస్ టెక్నికల్ అండ్ డెరివేటివ్స్ అనలిస్ట్ రాజేష్ పాలవియా సూచన ఇవి కేవలం అనలిస్టుల అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్ సూచన.
అనుసరించవలసిన వ్యూహం: 10,700 పుట్ ఆప్షన్‌ను కొనుగోలు చేయాలి. ఇదే సమయంలో 11,000 కాల్ ఆప్షన్‌ను కూడా కలిపి తీసుకోవాలి.
ఒడిదుడుకుల సమయానికి అతి సమీపంలో ఉన్నందున ఇన్వెస్టర్లు తమ లాంగ్స్‌ను హెడ్జ్ చేసుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇందుకు అత్యంత తక్కువ పెట్టుబడి అవసరమైన పుట్ ఆప్షన్స్‌ను ఎంచుకోమని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమైనా పాజిటీవ్ అంశాలు ఉన్నప్పటికీ మార్కెట్ ఒక్కసారిగా ర్యాలీ చేసే అవకాశం కానీ, మరింత పైకి వెళ్లే అవకాశం కానీ లేదు. అయితే, ప్రతికూల వార్తలకు మాత్రం కరెక్షన్ భారీ స్థాయిలో ఉండనుంది. 10450 వరకు నిఫ్టీ చేరుకునే అవకాశం ఉందన్నారు. ఈ కదలికల ఆధారంగా.. 10,700 పుట్ ఆప్షన్‌ను కొనుగోలు చేయాలి. ఇదే సమయంలో 11,000 కాల్ ఆప్షన్‌ను కూడా కలిపి తీసుకోవాలని సూచించారు. ఆ తరువాత నష్టాలను తగ్గించుకోవల్సి వస్తే 11400 కాల్ ఆప్షన్‌ను సూచించారు.
అనుసరించవలసిన వ్యూహం: 80 సమీపంలో 10,500 పుట్ ఆప్షన్‌ను తీసుకుని ఇదే సమయంలో 20 వద్ద 10,000 పీఈని విక్రయించాలి.
గడిచిన 5-6 వారాల్లో ఇండియా వీఐఎక్స్ (ముఖ్యంగా ఆప్షన్స్ ప్రీమియంలో అనుసరించే ఒడిదుడుకుల సూచీ) 22 నుంచి 18 శాతానికి తగ్గింది. ఈ మేరకు తగ్గడం చూస్తుంటే.. ఎన్నికల ఫలితాలు సాధారంగానే ఉంటాయని మార్కెట్ ముందుగానే పసిగట్టిందనే అంచనాకు రావచ్చని అన్నారు. మార్కెట్ వర్గాలు ఊహించని ఫలితాలు వెల్లడైతే మాత్రం దిశ వేరుగా ఉండనుందన్నారు. ఈ అంచనాల ఆధారంగా 80 సమీపంలో 10,500 పుట్ ఆప్షన్‌ను కొని, ఇదే సమయంలో 20 వద్ద 10,000 పుట్ ఆప్షన్‌ను విక్రయించాలని సూచించారు. ఇలా చేయడం వల్ల ఈ వ్యూహం ఖర్చు 60 (80-20)గా ఉంటుందన్నారు. కాంట్రాక్ట్ ముగింపు నాటికి 10440 అనేది లాభనష్టాల మధ్యస్థ స్థాయిగా ఉంటుందని విశ్లేషించారు.
అనుసరించవలసిన వ్యూహం: 60-65 శ్రేణిలో 10,400 పుట్ ఆప్షన్ షార్ట్ చేసి.. 40-45 శ్రేణిలో 11,200 కాల్ ఆప్షన్ తీసుకోవాలి.
ఎన్నికల సమయం అయినందున ఒడిదుడుకులు అధిక స్థాయిలోనే ఉంటాయి. ఇండియా వీఐఎక్స్ 20 స్థాయిలో ఉంది. ట్రేడర్లు లాంగ్ పొజిషన్లను పుట్స్ కొనుగోలు ద్వారా హెడ్జ్ చేశారు. ఈ అంశాల ఆధారంగా 60-65 శ్రేణిలో 10,400 పుట్ ఆప్షన్ షార్ట్ చేసి.. 40-45 శ్రేణిలో 11,200 కాల్ ఆప్షన్ తీసుకోవాలని సూచించారు. ఇన్ఫ్రో 100-110గా ఉంటుందని, 140 వద్ద స్టాప్‌లాస్ నిర్వహించాలన్నారు. పూర్తి ప్రీమియం టార్గెట్ 10గా వెల్లడించారు.
అనుసరించవలసిన వ్యూహం: ఐరన్ కాండోర్
గతవారం 71 శాతం రోల్ఓవర్స్ నమోదుకాగా, అంతకుముందు కంటే కాస్త తక్కువగా ఉన్నాయి. 30 లక్షల షేర్లతో అధిక ఓపెన్ ఇంట్రెస్ట్ 11,000 స్ట్రైక్స్ వద్ద ఉండగా.. పుట్స్ వైపు 37 లక్షల షేర్లతో అధిక ఓపెన్ ఇంట్రెస్ట్ 10,500 స్ట్రైక్స్ వద్ద ఉంది. ఇది ప్రస్తుత ఎక్స్పైరీకి విస్తృత శ్రేణి ఉండవచ్చనే సంకేతం ఇస్తోందని విశ్లేషించారు. ఈ సమయంలో ఐరన్ కాండోర్ వ్యూహం అనుసరించడం మంచిదని సూచించారు. ఈ వ్యూహంలో భాగంగా.. 10800 కాల్స్, 10800 పుట్స్‌ను 375 ప్రీమియంతో విక్రయించి ఇదే సమయంలో 23 వద్ద 11300 కాల్స్, 48 వద్ద 10300 పుట్స్ కొనుగోలుచేయమని సూచించారు. ఈ వ్యూహం ద్వారా వచ్చే గరిష్ట లాభం 10800 స్థాయి వద్ద 23వేలు కాగా.. నష్ట అవకాశం 14500గా తెలిపారు. లాభనష్టాల మధ్యస్థ స్థాయి ఎగువన 11102, దిగువన 10498గా వెల్లడించారు.
You may be interested
హెచ్‌సీఎల్ టెక్ 7% డౌన్.. కారణం ఇదే!!
Friday 7th December 2018దేశీ మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో 7 శాతం మేర క్షీణించింది. ఐబీఎం-హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ డీల్ ఇందుకు కారణం. ఐబీఎం నుంచి 1.8 బిలియన్ డాలర్ల విలువైన వివిధ రకాల సాఫ్ట్వేర్ ప్రొడక్టులను కొనుగోలు చేస్తామని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రకటించడం షేరుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. కాగా ఐబీఎం-హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ డీల్ వచ్చే ఏడాది ప్రథమార్ధం చివరి భాగంలో పూర్తి కావొచ్చు.
వ్యాల్యు పిక్: హెచ్‌యూఎల్
Friday 7th December 2018ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా ఎఫ్ఎంసీజీ దిగ్గజమైన హిందుస్తాన్ యూనిలివర్ (హెచ్‌యూఎల్) స్టాక్‌పై బుల్లిష్‌గా ఉంది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్: ఆనంద్‌రాఠి స్టాక్: హెచ్‌యూఎల్ రేటింగ్: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.1,808 టార్గెట్ ప్రైస్: రూ.2,250 ఆనంద్‌రాఠి.. హెచ్‌యూఎల్‌పై పాజిటివ్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. వచ్చే 12 నెలల కాలంలో హెచ్‌యూఎల్ షేరు ధర రూ.2,250 స్థాయికి పెరగొచ్చని అంచనా వేసింది. హెచ్‌యూఎల్ దేశంలోనే అతిపెద్ద ఎఫ్ఎంసీజీ కంపెనీ అని పేర్కొంది. ప్రతి