STOCKS

News


బీమా, పెన్షన్‌ నిబంధనల్లో కీలక మార్పులు

Friday 9th November 2018
personal-finance_main1541787760.png-21831

బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ ‘ఐఆర్‌డీఏ’ ఇటీవల పెన్షన్‌, బీమా ప్లాన్లలో పలు మార్పులను ప్రతిపాదించింది. వీటిలో కొన్ని పాలసీదారుల ప్రయోజనాల కోణంలో తీసుకొన్నవి. మరి వీటి ప్రభావం పాలసీదారులపై ఏ విధంగా ఉంటుందో నిపుణుల అభిప్రాయాల ఆధారంగా తెలుసుకుందాం...

 

60 శాతం నిధులు వెనక్కి
కాలం ముగిసిన పెన్షన్‌ ప్లాన్ల నుంచి ఇకపై 60 శాతం నిధులను వెనక్కి తీసుకునే అవకాశం కల్పించడం ఒక ప్రతిపాదన. ప్రస్తుతం ఇది 33 శాతంగానే ఉంది. దీంతో అధిక నిధులు పాలసీదారులకు అందుబాటులోకి వస్తాయి. ఇక ఐదేళ్ల లాకిన్‌ పీరియడ్‌ తర్వాత పాక్షిక ఉపసంహరణలకు అవకాశం కల్పించడం మరొకటి. పాలసీ కాల వ్యవధిలో మొత్తం మూడు సార్లు ఇలా తీసుకునేందుకు వీలుంటుంది. పాక్షిక ఉపసంహరణ అన్నది అప్పటి ఫండ్‌ విలువలో 25 శాతానికే పరిమితం. ఇక ఇతర పెన్షన్‌ ప్లాన్లలో మాదిరిగానే పిల్లల ఉన్నత విద్య, వారి వివాహం, ఇంటి నిర్మాణం, తీవ్ర వ్యాధుల సందర్భాల్లో ఉపసంహరణలకు అవకాశం కల్పించడం కూడా ఇందులో ఉంది.

తగ్గింపులు
పెట్టుబడి ఆధారిత బీమా పథకాల్లో మోర్టాలిటీ (మరణాలు) మోర్బిడిటీ (వ్యాధులు) చార్జీలపై కంపెనీలు తగ్గింపులు ఆఫర్‌ చేయవచ్చు. పాలసీదారుల ఆరోగ్యస్థితిని పలు పరికరాలు, టెక్నాలజీ సాయంతో పర్యవేక్షిస్తూ మంచి స్కోరు సాధించే వారికి తగ్గింపులను ఇవ్వొచ్చన్నది ప్రతిపాదన. వార్షిక ప్రీమియానికి కనీసం పది రెట్ల మేర బీమా కవరేజీని 45 ఏళ్లలోపు వారికి ఆఫర్‌ చేయాలన్నది ప్రస్తుతమున్న నిబంధన. 45 ఏళ్ల పైన ఉన్న వారికి 7 రెట్ల మేర కవరేజీని ఇవ్వాలి. అయితే, ఐఆర్‌డీఏ కొత్త ప్రతిపాదన ప్రకారం ప్రీమియానికి 10 రెట్ల మేర బీమా కావాలనుకుంటే అందుకు పాలసీదారులే కంపెనీతో చర్చించుకోవాల్సి ఉంటుంది. ప్రీమియం అదే స్థాయిలో ఉండడం, కవరేజీ తగ్గిపోవడం, మోర్టాలిటీ చార్జీలను తీసివేయగా, మిగిలిన పెట్టుబడిపై వచ్చే రాబడులు ఎక్కువగా ఉండవని నిపుణులు అంటున్నారు. 

యాన్యుటీ 
యాన్యుటీ, డిఫర్డ్‌ పెన్షన్‌ ప్లాన్‌ను ఒకే బీమా కంపెనీ నుంచి తీసుకోవాలన్నది ప్రస్తుతమున్న నిబంధన. కానీ, దీన్ని పాలసీదారుల ఇష్టానికే వదిలిపెట్టాలన్నది మరొక ప్రతిపాదన. దీంతో మార్కెట్లో మరింత పోటీ పెరుగుతుందని, దాంతో బీమా కంపెనీలు పోటా పోటీగా వడ్డీ రేట్లను ఆఫర్‌ చేయవచ్చని పాలసీబజార్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ సంతోష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. అంతేకాదు పోటీ కారణంగా మంచి ఫీచర్లతో ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని పేర్కొంటున్నారు. 

రెండేళ్లకే సరెండర్‌ వ్యాల్యూ
ఎండోమెంట్‌ పాలసీలను కనీసం మూడేళ్ల పాటు ప్రీమియం చెల్లించిన తర్వాత తిరిగి వెనక్కిచ్చేస్తే ఎంతో కొంత విలువ (సరెండర్‌ వ్యాల్యూ) దక్కుతుంది. అయితే, దీన్ని రెండేళ్లకు తగ్గించడం మరో ప్రతిపాదన. 
 



You may be interested

అక్టోబర్‌లో రూ.7,900 కోట్ల ‘సిప్‌’

Friday 9th November 2018

సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) మరింత బలపడుతోంది. స్టాక్‌ మార్కెట్లలో అస్థిరతలు నెలకొన్న సమయాల్లోనూ సిప్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వస్తున్న పెట్టుబడులు ప్రతీ నెలా పెరుగుతుండడం ఇన్వెస్టర్లలో వచ్చిన మార్పును తెలియజేస్తోంది. గత నెలలో సిప్‌ రూపంలో వచ్చిన పెట్టుబడులు రూ.7,900 కోట్లకు చేరాయి. గత ఏడాది అక్టోబర్‌లో సిప్‌ ద్వారా వచ్చిన నిధులతో పోలిస్తే 42 శాతం అధికం. ఇక, ఈ ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన రూ.7,727

దీర్ఘకాలానికి ఐఐఎఫ్‌ఎల్‌ సిఫార్సులు.!

Friday 9th November 2018

ముంబై: స్వల్పకాలనికి దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్యనే కొనసాగేందుకు ఆస్కారం ఉందని ఇండియ‌న్ ఇన్ఫోలైన్ లిమిటెడ్‌(ఐఐఎఫ్ఎల్‌) సీఈఓ అరిందం చందా అంచనావేశారు. అక్టోబర్‌, డిసెంబర్‌ భారీ పతనం నుంచి కోలుకుంటున్న సూచీలు.. పలు కార్పొరేట్‌ కంపెనీల ఎర్నింగ్స్‌ బాగుండడం, క్రమంగా సెంటిమెంట్‌ బలపడడం వంటి కారణాలతో ఆశాజనకంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ప్రతికూల అంశాలు, ద్రవ్యలభ్యత అంశాల కారణంగా షార్ట్‌టెర్మ్‌లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.. వచ్చే ఏడాది దీపావళి నాటికి

Most from this category