News


2018లో ఇళ్ల విక్రయాల్లో 7 శాతం వృద్ధి

Monday 14th January 2019
Markets_main1547451465.png-23572

  • హైదరాబాద్‌లో 17 శాతం పడిపోయిన అమ్మకాలు
  • 9 ప్రధాన పట్టణాల్లో పరిస్థితులపై ప్రాప్‌ టైగర్‌ నివేదిక

న్యూఢిల్లీ: నివాసానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్లకు డిమాండ్‌ నెలకొనడంతో... 2018లో ప్రముఖ పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు మొత్తం మీద 7 శాతం పెరిగాయి. ప్రాప్‌ ఈక్విటీ అనే సంస్థ పరిశోధనలో ఈ వివరాలు తెలిశాయి. దేశవ్యాప్తంగా 9 పట్టణాల్లో కొత్త యూనిట్ల ప్రారంభం 22 శాతం తగ్గి గతేడాదిలో 1.46 లక్షల యూనిట్లకు పరిమితం అయ్యాయి. 2017లో 1.87 లక్షల యూనిట్లు కొత్తగా ప్రారంభం కావడం గమనార్హం. అమ్ముడుపోని ఇళ్లు 2018లో 6 లక్షల యూనిట్లుగా ఉన్నాయని ప్రాప్‌ టైగర్‌ తన నివేదికలో తెలిపింది. హైదరాబాద్‌, బెంగళూరు, థానే, చెన్నై, పుణె, కోల్‌కతా, ముంబై, నోయిడా, గురుగ్రామ్‌ నగరాల్లో అమ్మకాలను విశ్లేషించి ప్రాప్‌ టైగర్‌ ఈ గణాంకాలను విడుదల చేసింది. అంతకుముందు సంవత్సరంలో ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేయడంపై డెవలపర్లు ఎక్కువగా దృష్టి సారించడమే కొత్త యూనిట్ల ఆరంభం తగ్గడానికి కారణంగా ప్రాప్‌ టైగర్‌ తెలిపింది.
హైదరాబాద్‌లో భిన్నం
బెంగళూరులో ఇళ్లు/ఫ్లాట్ల అమ్మకాలు 19 శాతం వృద్ధితో 38,525 యూనిట్లుగా ఉన్నాయి. చెన్నైలోనూ 40 శాతం అధికంగా 14,920 యూనిట్లు అమ్ముడుపోయాయి. కానీ, దక్షిణాదిన మరో ప్రధాన మార్కెట్‌ హైదరాబాద్‌లో మాత్రం ఇళ్లు/ఫ్లాట్ల అమ్మకాలు 2018లో 17 శాతం తగ్గి 15,486 యూనిట్లుగానే ఉన్నాయి. అలాగే, గురుగ్రామ్‌ మార్కెట్లోనూ అమ్మకాలు 16 శాతం క్షీణించి 9,425 యూనిట్లుగా ఉన్నాయి.



You may be interested

ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌ మంచివేనా

Monday 14th January 2019

ప్ర: ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్‌ (ఎఫ్‌ఎమ్‌పీ)ల్లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచిదే కదా ? ఈ విషయమై తగిన సూచనలివ్వండి. -మృణాళిని, సికింద్రాబాద్‌ జ: ఎఫ్‌ఎమ్‌పీలు ఎప్పుడైనా  మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలే.  ప్రస్తుతం ఇవి మంచి రాబడులనిస్తున్న మాట వాస్తవమే. కానీ వీటికి ఉన్న ఏకైక సమస్య లిక్విడిటీ. వీటికి లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. ఇవి స్టాక్‌ మార్కెట్లో లిస్టైనప్పటికీ, వీటి వాల్యూమ్స్‌ చాలా తక్కువగా ఉంటాయి. ​ట్రేడింగ్‌ చాలా

కార్పోరేట్‌ టాక్స్‌ తగ్గాలి.

Monday 14th January 2019

రూ.20 లక్షలపైన వేతన జీవులకే 30 శాతం పన్ను కేంద్రానికి ఫిక్కీ ముందస్తు బడ్జెట్‌ సూచనలు న్యూఢిల్లీ: టర్నోవర్‌తో సంబంధం లేకుండా కార్పొరేట్‌ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి రానున్న బడ్జెట్‌లో తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పారిశ్రామిక సంఘం ఫిక్కీ కోరింది. ఆర్థిక వృద్ధి పుంజుకోవడానికి, పన్నుల ఆదాయం పెరిగేందుకు ఈ చర్యను సూచించింది. అలాగే, వ్యక్తిగత ఆదాయపన్నులో గరిష్ట రేటు 30 శాతాన్ని వార్షికాదాయం రూ.20 లక్షలు దాటినవారికే

Most from this category