STOCKS

News


హిందాల్కో లాభం 47 శాతం అప్‌

Wednesday 13th February 2019
news_main1550039231.png-24169

  • రూ.713 కోట్లకు నికర లాభం 
  • తగ్గిన వడ్డీ వ్యయాలు 
  • 8 శాతం పెరిగిన ఆదాయం 

హిందాల్కో నికర లాభం ఈ డిసెంబర్‌ క్వార్టర్లో 47 శాతం(ఉత్కళ్‌ ప్లాంట్‌ను కలుపుకొని) వృద్ధితో రూ.713 కోట్లకు  పెరిగింది. గత క్యూ3లో రూ. 484 కోట్ల నికర లాభం వచ్చిందని హిందాల్కో తెలిపింది. నిర్వహణ ఆదాయం అధికంగా ఉండటం, వడ్డీ వ్యయాలు తక్కువగా ఉండటంతో నికర లాభం పెరిగిందని వివరించింది.  ఆదాయం రూ,.11,028 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.11,938 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నిర్వహణ ఆదాయం 3.5 శాతం వృద్ధితో రూ.1,926 కోట్లకు చేరిందని తెలిపింది. గత క్యూ3లో 16.9 శాతంగా ఉన్న ఎబిటా మార్జిన్‌ ఈ క్యూ3లో 16.1 శాతానికి తగ్గిందని పేర్కొంది. 

12 శాతం తగ్గిన వడ్డీ వ్యయాలు..
బొగ్గు, ఫర్నేస్‌ ఆయిల్‌ వంటి ఉత్పత్తి వ్యయాలు పెరిగినా, నిర్వహణ సామర్థ్యం మెరుగుపడటంతో మంచి ఫలితాలు సాధించామని కంపెనీ తెలిపింది.  దీర్ఘకాల రుణాల పునర్వ్యస్థీకరణ కారణంగా వడ్డీ వ్యయాలు 12 శాతం తగ్గి రూ.477 కోట్లకు చేరాయని తెలిపింది. అల్యూమినియమ్‌ వ్యాపారం 13 శాతం వృద్ధితో రూ.6,018 కోట్లకు, ఎబిటా 8 శాతం ఎగసి రూ.1,266 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఈ క్యూ3లో 324 కిలో టన్నుల అల్యూమినియమ్‌ లోహాన్ని ఉత్పత్తి చేశామని తెలిపింది. రాగి వ్యాపారం ఆదాయం 4 శాతం వృద్ధితో రూ.5,925 కోట్లకు పెరిగిందని నిర్వహణ ఆదాయం 2 శాతం వృద్ధితో రూ.431 కోట్లకు ఎగసిందని పేర్కొంది.

 



You may be interested

రేపు భారత్‌-22 ఈటీఎఫ్‌ ఫాలో ఆన్‌ ఆఫర్‌

Wednesday 13th February 2019

రేపు భారత్‌-22 ఈటీఎఫ్‌ ఫాలో ఆన్‌ ఆఫర్‌ రూ. 3,500 కోట్ల సమీకరణ లక్ష్యం!  ఒక్క రోజుకే ఎఫ్‌పీఓ పరిమితం  భారత్‌-22 ఈటీఎఫ్‌ (ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌) ఫాలో ఆన్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ)రేపు(గురువారం) జరగనున్నది. ఒక్క రోజు మాత్రమే జరిగే ఈ ఎఫ్‌పీఓ ద్వారా కనీసం రూ.3,500 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతకు మించి బిడ్‌లు వస్తే, వాటిని కూడా అట్టే పెట్టుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా

టాటా మోటార్స్‌ అంతర్జాతీయ అమ్మకాలు 12% డౌన్‌

Wednesday 13th February 2019

జనవరి సేల్స్‌ 1,00,572 యూనిట్లు న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ అంతర్జాతీయ విక్రయాల్లో గతనెల 12 శాతం తగ్గుదల నమోదైంది. లగ్జరీ కార్ల విభాగానికి చెందిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) అమ్మకాలను కలుపుకుని సంస్థ మొత్తం కార్ల అమ్మకాలు జనవరిలో 1,00,572 యూనిట్లుగా నిలిచాయి. 2018 జనవరిలో అమ్ముడైన 1,14,797 యూనిట్లతో పోల్చితే 12 శాతం క్షీణత నమోదైనట్లు కంపెనీ వివరించింది. ఇక వాణిజ్య వాహనమైన టాటా దేవూ విక్రయాలు 9 శాతం

Most from this category