STOCKS

News


సిటియూనియన్‌ బ్యాంకును కొనొచ్చు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌

Saturday 11th August 2018
Markets_main1533967635.png-19175

ముంబై:- ఇటీవలే ప్రైవేట్‌ రంగ దిగ్గజం సిటి యూనియన్‌ బ్యాంకు ఇటీవలే త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా ఫలితాలను సాధించి మార్కెట్‌ వర్గాలను మెప్పించగలిగింది. దీంతో పలు రేటింగ్‌ సంస్థలు, బ్రేకరేజ్‌ సంస్థలు సిటియూనియన్‌ బ్యాంకు షేరుపై సానుకూలంగా ఉన్నాయి. వాటిలో ప్రముఖ రేటింగ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఈ బ్యాంకు షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ ఇచ్చింది. ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సంస్థ ఈ షేరుపై విశ్లేషణ చూద్దాం..!
రేటింగ్‌:- కొనొచ్చు.
ప్రస్తుత ప్రైజ్‌:- రూ.178
టార్గెట్‌ ప్రైజ్‌:- రూ.210
విశ్లేషణ:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో క్వార్టర్‌ నుంచి క్వార్టర్‌ నికరలాభం 17శాతం వృద్ధి చెందింది. అందరూ ఊహించినట్లే మార్జిన్లు 4.24శాతం తగ్గాయి. స్థూల ఎన్‌పీఏలు 3.05శాతం నుంచి 3.02 శాతానికి, నికర ఎన్‌పీఏలు 1.79శాతం నుంచి 1.70శాతానికి తగ్గుముఖం పట్టాయి. నిర్వహణ వ్యయాలు 13 శాతం పెరిగాయి. ప్రొవిజన్లు 10శాతం తగ్గాయి.  స్థిరమైన వృద్ధి, ఆస్తుల నాణ్యత మీద గట్టి పట్టు ఉండటం కారణంగా రానున్న రోజుల్లో అత్యుత్తమైన ఆదాయ నిష్పత్తులను ఆర్జించగలదు. తన వ్యాపార నైపుణ్యంతో వినియోగదారులను మెప్పించి చిన్న, మధ్య తరహా వ్యాపార విభాగంలో మరింత వృద్ధిని సాధిస్తుంది. ఇతర బ్యాంకులతో ఎలాంటి పోటీ లేకపోవడం ఈ బ్యాంకుకు కలిసోచ్చే అంశం. ప్రభుత్వ బ్యాంకుల మెడకు మొండి బకాయిల బండ ఉండడంతో ఇటీవల బ్యాంకింగ్‌ రంగలో పెట్టుబడులకు ఆసక్తి ఉన్న సంస్థలు ప్రైవేట్‌ రంగ బ్యాంకులకు తరలిరావడం సిటీ యూనియన్‌ బ్యాంకు మరో సానుకూమైన అంశం.

View Pdf One (1533967796City_Union_Bank_-_1QFY19_-_HDFC_sec.pdf)

You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌

Saturday 11th August 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ శుక్రవారం రాత్రి విదేశీ మార్కెట్లో 24 పాయింట్ల నష్టంతో 11,415 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది మన మార్కెట్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ ముగింపుకన్నా తక్కువ స్థాయిలో ఉందని గమనించాలి. దీంతో అంతర్జాతీయంగా, దేశీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తనప్పుడు సోమవారం నిఫ్టీ నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇక అమెరికా మార్కెట్లు కూడా శుక్రవారం నష్టాల్లో ఉండటం ప్రతికూల అంశం. నాస్‌డాక్‌ 53 పాయింట్ల నష్టంతో 7,839 వద్ద, డౌజోన్స్‌ 196 పాయింట్ల

ఈ స్టాక్‌ హోల్డ్‌ చేయొచ్చు!!

Saturday 11th August 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ బ్రోకింగ్‌ తాజాగా రత్నమయి మెటల్స్‌ అండ్‌ ట్యూబ్స్‌ స్టాక్‌ను హోల్డ్‌ చేయవచ్చని సిఫార్సు చేసింది.  స్టాక్‌: రత్నమయి మెటల్స్‌ అండ్‌ ట్యూబ్స్‌ ఇండస్ట్రీ: మెటల్స్‌ రేటింగ్‌: హోల్డ్‌ ప్రస్తుత ధర: రూ.861 టార్గెట్‌ ప్రైస్‌: రూ.940 సెం‍ట్రమ్‌.. రత్నమయి మెటల్స్‌ అండ్‌ ట్యూబ్స్‌పై పాజిటివ్‌గానే ఉంది. అయితే టార్గెట్‌ ప్రైస్‌ను రూ.970 నుంచి రూ.940కి తగ్గించింది. భవిష్యత్‌ బలమైన వృద్ధి అంచనాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం  అప్‌ట్రెండ్‌ సామర్థ్యం పరిమితంగానే ఉండటం ఇందుకు కారణంగా

Most from this category