News


ఈవారంలో హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సిఫార్సు చేసిన షేరు ఇదే..!

Saturday 12th January 2019
Markets_main1547273752.png-23551

నిర్మాణ రంగంలో 99 ఏళ్లుగా సేవ‌లు అందిస్తున్న ఇండియన్‌ హ్యూమ్ పైప్‌(ఐహెచ్‌పీ) షేరును కొనవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ బ్రోక‌రేజ్ సంస్థ సిఫార్సు చేస్తుంది.
రంగం:- నిర్మాణ రంగం
రేటింగ్‌:- బై
టార్గెట్ ధ‌ర‌:- రూ.445లు
విశ్లేషణ:- డ్రైనేజీ, ఇరిగేష‌న్‌, తాగునీటి స‌ర‌ఫ‌రా రంగంలో దేశంలోనే ప్రథ‌మస్థానంలో ఉంది. కంపెనీ 2018 ఆర్థిక సంవ‌త్సరం నాటికి రూ.1000 కోట్ల విలువైన ఆర్డర్లను ద‌క్కించుకుంది. అక్టోబ‌ర్ 2018 నాటికి కంపెనీ రూ.3737 కోట్ల విలువైన బుక్ ఆర్డర్లను క‌లిగి ఉంది. దేశీయ నిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పు తెచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం ఇటీవ‌ల చేప‌ట్టిన కార్యక్రమాలు, 2018 బ‌డ్జెట్‌లో అంద‌రికి ఇల్లు ప‌థ‌కం లాంటి అంశాలు రానున్న రోజుల్లో షేరు ర్యాలీకి తోడ్పాటును అందిస్తాయని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. దాదాపు రూ.4000 కోట్ల విలువైన బుక్ ఆర్డర్లు కంపెనీలో చేతిలో ఉన్న నేప‌థ్యంలో మ‌రో రెండేళ్లలో ఆదాయం 9శాతం పెరగ‌డంతో పాటు పీఏటీ సీఏజీఆర్ 33శాతం వృద్ధి చెందుతుంద‌ని బ్రోక‌రేజ్ సంస్థ అంచ‌నా వేస్తుంది.
స‌వాళ్లు, ఆందోళ‌న‌లు:-
1. వ‌ర్కింగ్ క్యాపిట‌ల్ తగ్గుముఖం
2. లో పేస్ ఆర్డర్లు కంపెనీకి గిట్టుబాటు ధరను అందించలేవు.
3.ముడి సరుకుల ధ‌ర‌లు పెర‌గ‌డంతో కంపెనీ మార్జిన్లపై ఒత్తిడిని పెంచ‌వ‌చ్చు.
(ఇండియన్‌ హ్యూమ్ పైప్‌ షేరుపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషణ కొరకు కింది లింక్‌ ఓపెన్‌ చేయగలరు.)

View Pdf One (1547274241HSL PCG - Pick-of-the-Week - Indian Hume Pipe Company - 07012019.pdf)

You may be interested

అక్కడక్కడే పసిడి ధర

Saturday 12th January 2019

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర అక్కడక్కడే ముగిసింది. అమెరికా మార్కెట్లో శుక్రవారం రాత్రి 2డాలర్లు (0.50డాలరు) స్వల్పంగా పెరిగి 1,289.50 డాలర్ల వద్ద స్థిరపడింది. నాలుగురోజుల పాటు అమెరికా-చైనా దేశాల మధ్య జరిగిన వాణిజ్య చర్చల్లో భాగంగా ఎలాంటి సమాచారం వెలువడకపోవడంతో ఇన్వెస్టర్లలో ఇరుదేశాల మధ్య చర్చలు విఫలమై ఉంచవచ్చనే అనుమానాలు రేకత్తాయి. అలాగే గత 5రోజులుగా ర్యాలీ చేస్తున్న అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగియండంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక

ఎన్‌ఎస్‌ఈ చైర్మన్‌ అశోక్‌ చావ్లా రాజీనామా

Saturday 12th January 2019

న్యూఢిల్లీ:  నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ) చైర్మన్‌ అశోక్‌ చావ్లా శుక్రవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా తక్షణం అమల్లోకి వస్తుందని ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని న్యాయపరమైన పరిణామాల కారణంగా చావ్లా రాజీనామా చేశారని పేర్కొంది. మరే ఇతర వివరాలను ఎన్‌ఎస్‌ఈ వెల్లడించలేదు. ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ కేసులో అశోక్‌ చావ్లా, మరో నలుగురు కేంద్ర ప్రభుత్వ అధికారులపై చార్జీషీటు దాఖలు చేయడానికి ప్రభుత్వం నుంచి ఆమోదం పొందామని సీబీఐ

Most from this category