STOCKS

News


డీఎల్‌ఎఫ్‌ టార్గెట్‌ @ 253

Saturday 10th November 2018
Markets_main1541834038.png-21865

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా రియల్టీ సంస్థ డీఎల్‌ఎఫ్‌ షేరును కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..

బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
స్టాక్‌: డీఎల్‌ఎఫ్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.174
టార్గెట్‌ ప్రైస్‌: రూ.253

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా డీఎల్‌ఎఫ్‌పై బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.253గా నిర్ణయించింది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (క్యూ2, జూలై-సెప్టెంబర్‌)లో మంచి ఆర్థిక ఫలితాలను ప్రకటించిందని పేర్కొంది. డీఎల్‌ఎఫ్‌ ప్రాజెక్టులను కలిగిన ఎన్‌సీఆర్‌ మార్కెట్‌ మెరుగుపడటం సానుకూల అంశమని తెలిపింది. అలాగే కంపెనీ క్విప్‌కు వెళ్తోందని పేర్కొంది. రుణ భారం తగ్గుదల, అమ్మకాల మెరుగుదల వంటి అంశాల కారణంగా డీఎల్‌ఎఫ్‌పై పాజిటివ్‌గా ఉన్నామని తెలిపింది. రూ.253 టార్గెట్‌ ప్రైస్‌తో స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. అలాగే కంపెనీ హెచ్‌ఎస్‌ఐఐడీసీ ప్రాజెక్టు కోసం గ్లోబల్‌ రియల్టీ ఫండ్‌ హైన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోనుందని పేర్కొంది. రెంటల్‌ పోర్ట్‌ఫోలియో బలమైన వృద్ధిని కనబరుస్తోందని తెలిపింది. 

క్యూ2 ఎర్నింగ్స్‌ గమనిస్తే..
రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్లో 26 రెట్లు పెరిగింది. గత క్యూ2లో రూ.14 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.375 కోట్లకు పెరిగిందని డీఎల్‌ఎఫ్‌ తెలిపింది. అనుబంధ కంపెనీల, జాయింట్‌ వెంచర్ల కార్యకలాపాల ద్వారా రూ.239 కోట్ల లాభం వచ్చిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.1,751 కోట్ల నుంచి రూ.2,305 కోట్లకు పెరిగిందని పేర్కొంది. 

కంపెనీ పనితీరుకు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1541834042DLF_-_2QFY19_-_HDFC_sec.pdf)

You may be interested

10,750 దాటేవరకు భారీ లాభాలు ఉండకపోవచ్చు..!

Saturday 10th November 2018

ముంబై: శుక్రవారం సెన్సెక్స్‌ 79 పాయింట్లు నష్టంతో 35,158 వద్ద ముగిసింది. నిఫ్టీ 13 పాయింట్ల నష్టంతో 10,585 వద్ద ముగిసింది. ఉదయం 10,614 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ.. అంతక్రితం ముగింపుతో పోల్చితే 17 పాయింట్ల లాభంతో ప్రారంభమై, ఇంట్రాడేలో 10,619 పాయింట్ల వద్ద గరిష్టస్థాయిని, 10,545 వద్ద కనిష్టస్థాయిని నమోదుచేసింది. అంతకుముందు వారంతో పోల్చితే గడిచిన వారంలో నిఫ్టీ 32 పాయింట్లు లాభంతో ముగిసింది. మొత్తం మీద

నెలరోజుల కనిష్టానికి పతనమైన పసిడి ధర

Saturday 10th November 2018

డిసెంబర్‌లో కీలకవడ్డీ రేట్ల పెంపుపై స్పష్టత రావడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం రాత్రి నెలరోజుల కనిష్టానికి పతనమయ్యాయి. గతరాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ఏకంగా 16 డాలర్లు(1.30శాతం) నష్టపోయి 1210.30 డాలర్ల వద్ద ముగిసింది. ఫెడ్‌రిజర్వ్‌ బ్యాంక్‌ ఈసారి వడ్డీరేట్లపై యథాతద వైఖరిని అవలంభించింది. అయితే, ఈ డిసెంబర్‌లో కీలకవడ్డీ రేట్ల పెంపు కచ్చితంగా ఉంటుందనే అంచనాలు ఊపందుకున్నాయి. వడ్డీ రేట్ల పెంపు అంచనాల నేపథ్యంలో రాత్రి

Most from this category