STOCKS

News


ఎఫ్‌ఎంసీజీ ఎర్నింగ్స్‌ ఓకే.. ఓకే!!

Saturday 13th October 2018
Markets_main1539417469.png-21131

కన్సూమర్‌ విభాగపు కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికంలో (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఎలాంటి ఆర్థిక ఫలితాలు ప్రకటించవచ్చొ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఒక నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం కన్సూమర్‌ కంపెనీలు ఆరోగ్యకరమైన క్యూ2 ఎర్నింగ్స్‌ను వెల్లడించనున్నాయి. ఎఫ్‌ఎంసీజీ విభాగానికి వస్తే.. అంతర్జాతీయ వ్యాపారాలు మెరుగుపడటం, గ్రామీణ డిమాండ్‌ నేపథ్యంలో దేశీ వ్యాపారంలో బలమైన వృద్ధి, కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణ వంటివి సానుకూల అంశాలని పేర్కొంది. హెచ్‌యూఎల్‌, బ్రిటానియా, జూబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌, ఐటీసీ, డాబర్‌, మారికో వంటి స్టాక్స్‌కు ప్రాధాన్యమివొచ్చని తెలిపింది. హెచ్‌యూఎల్‌ ఇప్పటికే క్యూ2 ఫలితాలను ప్రకటించింది. కన్సూమర్‌ అప్లయెన్సెస్‌ విభాగంలో హావెల్స్‌, వి-గార్డ్‌, వొల్టాస్‌ స్టాక్స్‌కు ప్రాధాన్యమివొచ్చని తెలిపింది. కంపెనీల క్యూ2 ఎర్నిం‍గ్స్‌ ఎలా ఉండొచ్చొ ఒకసారి చూద్దాం.. 

కంపెనీ        క్యూ2 ఎర్నింగ్స్‌ అంచనా
ఐటీసీ        యావరేజ్‌
గోద్రెజ్‌ కన్సూమర్‌    యావరేజ్‌
డాబర్‌        బాగుంటాయి
బ్రిటానియా    యావరేజ్‌
మారికో        యావరేజ్‌
కోల్గేట్‌        యావరేజ్‌
ఇమామి        బలహీనం
జూబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌    బాగుంటాయి
హావెల్స్‌ ఇండియా    బాగుంటాయి
వొల్టాస్‌            యావరేజ్‌
క్రాంప్టన్‌ కన్సూమర్‌    యావరేజ్‌
సింఫనీ (స్టాండలోన్‌)    బలహీనం    
వి-గార్డ్‌            యావరేజ్‌
టీటీకే ప్రెస్టీజ్‌        యావరేజ్‌


కన్సూమర్‌ విభాగపు కంపెనీల క్యూ2 ఎర్నింగ్స్‌కు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1539417470Consumer_-_2QFY19_Results_Preview_-_HDFC_sec.pdf)

You may be interested

ఫార్మా క్యూ2 ఫలితాలు బాగుంటాయా?

Saturday 13th October 2018

ఇండియన్‌ ఫార్మా కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికంలో (క్యూ2, జూలై-సెప్టెంబర్‌)లో మంచి ఫలితాలను ప్రకటించవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. రూపాయి క్షీణత, అమెరికా వ్యాపారం నిలకడగా ఉండటం, యూఎస్‌ఎఫ్‌డీఏ సమస్యలు పరిష్కారమవ్వడం వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపనున్నాయని పేర్కొంది. సన్‌ ఫార్మా, లుపిన్‌, ఆల్‌కెమ్‌, డిష్‌మాన్‌ షేర్లను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. కంపెనీలు ఎలాంటి ఫలితాలు ప్రకటించనున్నాయో ఒకసారి చూద్దాం..  కంపెనీలు  

ఆటో రంగం: క్యూ2 ఎర్నింగ్స్‌ అంతంతే!!

Saturday 13th October 2018

ఆటోమొబైల్‌ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండొచ్చని బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. గ్రామీణ డిమాండ్‌, మైనింగ్‌/తయారీ కార్యకలాపాలు పుంజుకోవడం వల్ల వార్షికంగా టూవీలర్లు, కమర్షియల్‌ వాహన విక్రయాల్లో వరుసగా 9 శాతం, 27 శాతం వృద్ధి నమోదైనప్పటికీ.. ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు 3 శాతం తగ్గాయని గుర్తుచేసింది. పండుగ సీజన్‌ ఆలస్యం కావడం, కేరళ

Most from this category