STOCKS

News


ఆటో రంగం: క్యూ2 ఎర్నింగ్స్‌ అంతంతే!!

Saturday 13th October 2018
Markets_main1539416158.png-21130

ఆటోమొబైల్‌ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండొచ్చని బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. గ్రామీణ డిమాండ్‌, మైనింగ్‌/తయారీ కార్యకలాపాలు పుంజుకోవడం వల్ల వార్షికంగా టూవీలర్లు, కమర్షియల్‌ వాహన విక్రయాల్లో వరుసగా 9 శాతం, 27 శాతం వృద్ధి నమోదైనప్పటికీ.. ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు 3 శాతం తగ్గాయని గుర్తుచేసింది. పండుగ సీజన్‌ ఆలస్యం కావడం, కేరళ వరదలు, ఇంధన ధరల పెరుగుదల, ఫైనాన్సింగ్‌ వ్యయాలు ఎగయడం వంటి అంశాలను ఇందుకు కారణంగా పేర్కొంది. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ నివేదిక ఇంకా ఏం చెబుతోందంటే.. 

♦ అశోక్‌ లేలాండ్‌, ఎక్సైడ్‌ నికర లాభం వార్షికంగా చూస్తే వరుసగా 43 శాతం, 24 శాతం పెరగొచ్చు. 

♦ టీటీఎంటీను మినహాయిస్తే ఆటో ఓఈఎం విభాగం వార్షికంగా 9 శాతం రెవెన్యూ వృద్ధిని ప్రకటించొచ్చు. అయితే ఈబీటా 5 శాతం తగ్గొచ్చు. ఈబీటా మార్జిన్‌ 14.4 శాతానికి క్షీణించొచ్చు.

♦ ప్యాసింజర్‌ వాహన విభాగంలో విక్రయాలు తగ్గడం, కరెన్సీ ప్రతికూలతలు వల్ల మారుతీ సుజుకీ నికర లాభం 26 శాతం దిగిరావొచ్చు.

♦ టూవీలర్‌ విభాగంలో ఉత్పత్తి ‍వ్యయాల పెరుగుదల వల్ల బజాజ్‌ ఆటో, హీరో మోటొకార్ప్‌ మార్జిన్లు తగ్గొచ్చు. 

♦ వాహన విడిభాగాల విభాగంలోని ఆర్‌కే ఫోర్జింగ్‌, జమ్నా ఆటో, సుబ్రోస్‌ నికర లాభంలో మంచి వృద్ధి నమోదు కావొచ్చు.

♦ కమోడిటీ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, డిమాండ్‌ మందగమనం వల్ల స్వరాజ్‌ ఇంజిన్‌ టార్గెట్‌ ప్రైస్‌ను రూ.2,027కి, టాటా మోటార్స్‌ టార్గెట్‌ ప్రైస్‌ను రూ.297కి తగ్గించింది. 

♦ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో ఆటోమొబైల్‌ రంగంపై ఇంధన ధరల పెరుగుదల, ఇన్సూరెన్స్‌ వ్యయాలు పెరుగుదల, ఫైనాన్స్‌ వ్యయాల పెరుగుదల వల్ల ప్రతికూల ప్రభావం పడొచ్చు. 

♦ పండుగ సీజన్‌ నేపథ్యంలో ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు పెరగొచ్చు.

♦ మారుతీ సుజుకీ ఇండియా, అశోక్‌ లేలాండ్‌, బజాజ్‌ ఆటో స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చు.

కంపెనీ            క్యూ2 ఎర్నిం‍గ్స్‌ అంచనాలు
మారుతీ సుజుకీ        బాగుండవు
టాటా మోటార్స్‌        బాగుండవు
బజాజ్‌ ఆటో        యావరేజ్‌
హీరో మోటొకార్ప్‌        యావరేజ్‌
అశోక్‌ లేలాండ్‌        బాగుంటాయి
స్వరాజ్‌ ఇంజిన్స్‌        బాగుండవు
ఎస్‌ఎంఎల్‌ ఇసుజు    బాగుంటాయి
ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌        బాగుంటాయి
సుప్రజిత్‌ ఇంజినీరింగ్‌    యావరేజ్‌
జమ్నా ఆటో        బాగుంటాయి
రామకృష్ణ ఫోర్జింగ్స్‌    బాగుంటాయి
సుబ్రోస్‌            యావరేజ్‌
జేబీఎం ఆటో        యావరేజ్‌
ఎన్‌ఆర్‌బీ బేరింగ్స్‌        యావరేజ్‌
లుమెక్స్‌ ఆటోటెక్‌        బాగుంటాయి

వాహన సంస్థలు, వాహన విడిభాగాల తయారీ కంపెనీల క్యూ2 ఎర్నింగ్స్‌కు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...
    

View Pdf One (1539416298Auto,_Auto_Anc_-_2QFY19_Results_Preview_-_HDFC_sec.pdf)

You may be interested

ఎఫ్‌ఎంసీజీ ఎర్నింగ్స్‌ ఓకే.. ఓకే!!

Saturday 13th October 2018

కన్సూమర్‌ విభాగపు కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికంలో (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఎలాంటి ఆర్థిక ఫలితాలు ప్రకటించవచ్చొ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఒక నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం కన్సూమర్‌ కంపెనీలు ఆరోగ్యకరమైన క్యూ2 ఎర్నింగ్స్‌ను వెల్లడించనున్నాయి. ఎఫ్‌ఎంసీజీ విభాగానికి వస్తే.. అంతర్జాతీయ వ్యాపారాలు మెరుగుపడటం, గ్రామీణ డిమాండ్‌ నేపథ్యంలో దేశీ వ్యాపారంలో బలమైన వృద్ధి, కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణ వంటివి సానుకూల అంశాలని పేర్కొంది. హెచ్‌యూఎల్‌, బ్రిటానియా, జూబిలంట్‌

ఈ వారం పిక్‌: అరబిందో ఫార్మా

Saturday 13th October 2018

బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా అరబిందో ఫార్మాను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..  బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌: అరబిందో ఫార్మా ఇండస్ట్రీ: ఫార్మాస్యూటికల్స్‌ ప్రస్తుత ధర: రూ.735 టార్గెట్‌ ప్రైస్‌: రూ.820-865 హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. అరబింతో ఫార్మాపై బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. వచ్చే 3-4 త్రైమాసికాల్లో స్టాక్‌ ధర రూ.820-865 స్థాయికి చేరొచ్చని అంచనా వేసింది. కంపెనీ రానున్న కాలంలో అమెరికా, యూరప్‌ మార్కెట్లలో కొత్త ప్రొడక్టులను

Most from this category