STOCKS

News


హెచ్‌సీఎల్‌ టెక్‌ 7% డౌన్‌.. కారణం ఇదే!!

Friday 7th December 2018
Markets_main1544169137.png-22730

దేశీ మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో 7 శాతం మేర క్షీణించింది. ఐబీఎం-హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ డీల్‌ ఇందుకు కారణం. ఐబీఎం నుంచి 1.8 బిలియన్‌ డాలర్ల విలువైన వివిధ రకాల సాఫ్ట్‌వేర్‌ ప్రొడక్టులను కొనుగోలు చేస్తామని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ప్రకటించడం షేరుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. కాగా ఐబీఎం-హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ డీల్‌ వచ్చే ఏడాది ప్రథమార్ధం చివరి భాగంలో పూర్తి కావొచ్చు. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేరు మధ్యాహ్నం 1:16 సమయంలో ఎన్‌ఎస్‌ఈలో 6 శాతం క్షీణతతో రూ.954 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం రూ.1,000 వద్ద ప్రారంభమైన షేరు ఇంట్రాడేలో ఒకానొక సమయంలో రూ.934 స్థాయికి కూడా పతనమైంది. 



You may be interested

5రోజుల తరువాత లాభాల్లోకి

Friday 7th December 2018

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేరు ర్యాలీ అండతో శుక్రవారం బ్యాంక్‌ నిఫ్టీ 5 రోజుల తర్వాత లాభాల్లోకి మళ్లింది. రిజర్వ్‌ బ్యాంకు వడ్డీరేట్లపై యధాతథ నిర్ణయం నేపథ్యంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లపై అ‍మ్మకాల ఒత్తిడి ఏర్పడింది. ఫలితంగా గత 5 ట్రేడింగ్‌ సెషన్స్‌లో బ్యాంకు నిఫ్టీ నష్టాలతోనే ముగిసింది. వారెన్‌ బఫెట్‌ కంపెనీ బెర్కషైర్ హాత్వే కోటక్‌ బ్యాంక్‌లో 10శాతం వాటాను కోనుగోలు చేస్తున్నట్లు వార్తలు వెలువడంతో నేడు ఆ

ఒడిదుడుకుల మార్కెట్‌లో ప్రయాణం ఎలా..?

Friday 7th December 2018

ముంబై: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అధిక స్థాయి ఒడిదుడుకులకు ఆస్కారం ఉండనుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికలపై ఇన్వెస్టర్లు పూర్తి దృష్టిసారించగా.. మధ్యప్రదేశ్‌లో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ నెలకొందని ఒపినియన్‌ పోల్స్‌ వెల్లడిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో స్పష్టమైన మెజర్టీ ఉండగా.. రాజస్థాన్‌లో ఓటమి అవకాశాలు

Most from this category