STOCKS

News


నిఫ్టీ సగం స్టాక్స్‌ ప్రీమియం వ్యాల్యూషన్లలోనే...

Friday 17th May 2019
Markets_main1558032397.png-25784

నిఫ్టీ ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిల నుంచి చూస్తే ఐదు శాతం దిగువనే ఉన్నాయి. నిఫ్టీ-50లో కొన్ని స్టాక్స్‌ మాత్రం ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిలకు చేరిపోయాయి కూడా. ముఖ్యంగా 22 స్టాక్స్‌ విలువలు వాటి గత 10 ఏళ్ల సగటు పీఈతో పోలిస్తే అధికంగానే ట్రేడవుతున్నాయి. ఇక వోలటాలిటీ ఇండెక్స్‌ నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరిపోయింది. మే 23న ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇది మరింత పెరిగిపోతుందన్న అంచనా ఉంది. ఈ దశలో అధిక ప్రీమియం, పీఈ వద్ద ట్రేడయ్యే స్టాక్స్‌పై మరింత ఒత్తిడి ఉంటుందంటున్నారు విశ్లేషకులు. 

 

పదేళ్ల సగటు పీఈ కంటే అధిక వ్యాల్యూషన్‌లో ట్రేడవుతున్న వాటిల్లో బజాజ్‌ ఆటో (4 శాతం అధికం), మారుతి సుజుకీ (18శాతం), టాటా మోటార్స్‌ (49శాతం), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (17శాతం), ఐసీఐసీఐ బ్యాంకు (7శాతం), కోటక్‌ మహీంద్రా బ్యాంకు (35శాతం), బజాజ్‌ ఫైనాన్స్‌ (116శాతం), హెచ్‌డీఎఫ్‌సీ (32శాతం), అల్ట్రాటెక్‌ సిమెంట్‌ (43శాతం), ఏషియన్‌ పెయింట్స్‌ (37శాతం), బ్రిటానియా ఇండస్ట్రీస్‌ (47శాతం), హిందుస్తాన్‌ యూనిలీవర్‌ (37శాతం), ఐటీసీ (2శాతం), జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ (9శాతం), రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (53శాతం), టైటాన్‌ (58శాతం), హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ (8శాతం), ఇన్ఫోసిస్‌ (12శాతం), టీసీఎస్‌ (34 శాతం), టెక్‌ మహీంద్రా (20 శాతం), విప్రో (15శాతం), యూపీఎల్‌ (49శాతం) చొప్పున అధిక వ్యాల్యూషన్‌లో ట్రేడవుతున్నాయి. 

 

మరి ఈ స్టాక్స్‌లో పెట్టుబడులు ఉన్నవారు ఇప్పుడు లాభాలను బుక్‌ చేసుకోవాలా? ఈ ప్రశ్నకు.. అన్ని స్టాక్స్‌కూ లాభాల స్వీకరణ వర్తించదన్న సమాధానం విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది. ‘‘బ్రిటానియా, టైటాన్‌ ప్రీమియం వ్యాల్యూషన్లలో ఉన్నప్పటికీ ఈ స్టాక్స్‌ పట్ల బుల్లిష్‌గానే ఉన్నాం. టైటాన్‌ దేశంలోనే టాప్‌ 10 కొనుగోలు బెట్స్‌లో ఒకటి. ఇక రిలయన్స్‌ స్టాక్‌కు అధిక వ్యాల్యూషన్‌ కారణంగా ఇటీవలే కొనుగోలు నుంచి న్యూట్రల్‌ రేటింగ్‌కు తగ్గించాం’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఇనిస్టిట్యూషనల్‌ రీసెర్చ్‌ హెడ్‌ గౌతం దుగ్గద్‌ పేర్కొన్నారు. మార్కెట్లు ఎగువ వైపునకు ర్యాలీ చేసిన తర్వాత కొన్ని స్టాక్స్‌ అధిక కొనుగోళ్ల జోన్‌లోకి వెళ్లాయని, ఇది కరెక్షన్‌క సంకేతంగా చాయిస్‌ బ్రోకింగ్‌ ఈడీ సుమీత్‌ బగాడియా అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో పాక్షికంగా అయినా లాభాలను తీసుకోవడం మంచి ఫలితాన్నిచ్చే విధానం అవుతుందన్నారు. స్టాక్స్‌ పడిపోయిన తర్వాత తిరిగి కొనుగోలు చేసుకోవచ్చని, దీనివల్ల పోర్ట్‌ఫోలియో కాస్ట్‌ తగ్గుతుందన్నారు. అయితే, కేవలం పీఈ రేషియోనే కాకుండా, డీ/ఈ రేషియో, పీఈజీ రేషియో, పీర్‌ పనితీరు, పరిశ్రమ వృద్ధి తదితర అంశాలనూ చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాపార సైకిల్‌ ముఖ్యంగా చూడాలని, వ్యాపారం అనేది పెరుగుతున్నప్పుడు పీఈ కూడా పెరిగిపోతుందని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌నవీన్‌ కులకర్ణి సూచించారు. భవిష్యత్తు వృద్ధి అవకాశాలు, వ్యాపార నిలకడను చూడడం ముఖ్యమని ఇండియా నివేష్‌ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ ధర్మేష్‌కంత్‌ సూచించారు.
 



You may be interested

సెన్సెక్స్‌ 100 పాయింట్ల లాభంతో ప్రారంభం

Friday 17th May 2019

మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నడుమ శుక్రవారం దేశీయ మార్కెట్‌ స్వల్ప లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 100 పాయింట్లు పెరిగి 37,494 వద్ద, నిఫ్టీ 4 పాయింట్లు స్వల్ప లాభంతో  11,262 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించాయి. ఒక్క ఫార్మా తప్ప అన్ని రంగ షేర్లు లాభాల్లోనే ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంజీసీ, ఆర్థిక రంగ షేర్లు ఎక్కువగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఆసియా మార్కెట్లల్లో వాణిజ్య యుద్ధ భయాలు కొనసాగుతున్న నేపథ్యంలో

ఈ స్మాల్‌క్యాప్స్‌ మార్కెట్‌ ఊగిసలాటకు అతీతమా!

Friday 17th May 2019

ఏడాదికిపైగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి చూస్తూనే ఉన్నాం. ఈ విభాగంలో గత ఏడాది కాలంలో స్టాక్స్‌లో పెట్టుబడులపై లాభాల్లేని పరిస్థితి. ఏవో కొన్ని స్టాక్స్‌ మినహా అన్నీ నష్టాలే మిగిల్చాయి. అయితే, ఓ 12 స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ మాత్రం మార్కెట్‌ అస్థిరతలతో తమకేం సంబంధం లేనట్టుగా, ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రతీ నెలా ఎంతో కొంత లాభాలనే ఇస్తూ వస్తున్నాయి. మరి ఈ కంపెనీల్లో నిజంగానే

Most from this category