STOCKS

News


భారీగా పెరిగిన హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లాభం

Saturday 10th November 2018
news_main1541829286.png-21854

ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో భారీగా పెరిగింది. గత క్యూ2లో రూ.68 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 325 శాతం వృద్ధితో రూ.289 కోట్లకు పెరిగిందని హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ తెలిపింది. ఆదాయం రూ.2,373 కోట్ల నుంచి 10 శాతం పెరిగి రూ.2,610 కోట్లకు పెరిగిందని పేర్కొంది. గత క్యూ2లో రూ.125 కోట్లుగా ఉన్న ఎబిటా ఈ క్యూ2లో రూ.523 కోట్లకు ఎగసిందని వివరించింది. నిర్వహణ మార్జిన్‌ 5.3 శాతం నుంచి నాలుగు రెట్లు పెరిగి 20 శాతానికి చేరిందని పేర్కొంది. ముడి పదార్ధాల ధరలు రూ.929 కోట్ల నుంచి 28 శాతం తగ్గిరరూ.668 కోట్లకు తగ్గాయని తెలిపింది. 
ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో ఈ షేర్‌ కూడా భారీగా పెరిగింది. బుధవారం రూ.790 వద్ద ముగిసిన ఈ షేర్‌ శుక్రవారం రూ.785-944 కనిష్ట, గరిష్ట స్థాయిల వద్ద కదలాడింది. చివరకు 16 శాతం లాభంతో రూ.919 వద్ద ముగిసింది. 


HAL

You may be interested

జూన్‌లో ఏఐఎం నుంచి కొత్త స్కీమ్‌

Saturday 10th November 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గ్రామీణ, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ (ఏఐఎం) వచ్చే జూన్‌ నుంచి మరొక సరికొత్త పథకంతో రానుంది. దేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎస్‌ఎంఈ), స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు లఘు వ్యాపార ఆవిష్కరణలు (స్మాల్‌ బిజినెస్‌ ఇన్నోవేషన్‌) పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు నీతి ఆయోగ్‌ అడిషనల్‌ సెక్రటరీ, అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ డైరెక్టర్‌ ఆర్‌ రామనన్‌ రామనాథన్‌ తెలిపారు.

ఇండియా సిమెంట్స్‌ ఆదాయం రూ.1,391 కోట్లు

Saturday 10th November 2018

న్యూఢిల్లీ: ఇండియా సిమెంట్స్‌ కంపెనీ నికర లాభం  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 94 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.24 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1 కోటికి తగ్గిందని ఇండియా సిమెంట్స్‌ తెలిపింది. అమ్మకాల పరిమాణం పెరిగినా, ధర తక్కువగా ఉండటం, ఇంధన వ్యయాలు పెరగడం వల్ల నికర లాభం తగ్గిందని కంపెనీ ఎమ్‌డీ, వైస్‌ చైర్మన్‌ ఎన్‌. శ్రీనివాసన్‌ వివరించారు.

Most from this category