News


14 నుంచి బంగారం బాండ్ల విక్రయం

Saturday 12th January 2019
Markets_main1547272355.png-23545

ముంబై: సౌర్వభౌమ బంగారం బాండ్లు మలి విడత విక్రయం ఈ నెల 14న ప్రారంభం కానుంది. 18వ తేదీ వరకు కొనసాగుతుంది. ఓ గ్రాము బంగారం ధర రూ.3,214గా ఆర్‌బీఐ ఖరారు చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, డిజిటల్‌ రూపంలో చెల్లించే వారికి గ్రాము బంగారంపై రూ.50ను తగ్గింపు ఇవ్వనున్నట్టు తెలిపింది. దీంతో గ్రాము బంగారాన్ని రూ.3,614కే ఇవ్వనుంది. బ్యాంకులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 500 గ్రాముల వరకు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉంది. కనీస పెట్టుబడి ఒక గ్రాము. సౌర్వ భౌమ బంగారం బాండ్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా 2015 నవంబర్‌లో ప్రారంభించింది.



You may be interested

బిగ్‌ సీలో సంక్రాంతి ఆఫర్లు

Saturday 12th January 2019

హైదరాబాద్‌: మొబైల్‌ రిటైల్‌ విక్రయ సంస్థ బిగ్‌ సీ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. శామ్‌సంగ్‌ గెలాక్సీ జే6, జే6 ప్లస్, ఏ7 మొబైల్స్‌పై అన్ని బ్యాంక్‌ల కార్డ్‌ల ద్వారా 10 శాతం క్యాష్‌ బ్యాక్, అన్ని వివో మోడల్స్‌పై సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లను అందిస్తోంది. దీంతో పాటు  ఒప్పో ఎఫ్‌9 ప్రొ కొంటే రైస్‌ కుక్కర్‌ ఉచితం, రూ.1,590 కార్బన్‌న్‌కే3 బూమ్‌ మ్యాక్స్‌ సెల్‌ఫోన్‌పై రూ.2,500 విలువ

లోకల్‌ బాండ్లకు పిక్‌ ఎన్‌ హుక్‌

Saturday 12th January 2019

- వేగంగా ఉత్పత్తుల డెలివరీ - స్థానిక బ్రాండ్లకే ఎక్కువ ప్రాధాన్యం - కంపెనీ సీఈవో మోనిష్‌ పత్తిపాటి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అన్ని వస్తువులనూ విక్రయించే ఈ–కామర్స్‌ కంపెనీగా ఆరంభమైన హైదరాబాద్‌ కంపెనీ ‘పిక్‌ ఎన్‌ హుక్‌’... ఇపుడు మిగతా చోట్ల దొరకని విభిన్న ఉత్పత్తుల విక్రయంపై దృష్టిపెట్టింది. తెలంగాణ చేనేత.. నిర్మల్‌ బొమ్మలు.. గద్వాల, ధర్మవరం, వెంకటగిరి చీరలు, కొండపల్లి బొమ్మల వంటి ప్రత్యేక వస్తువులను దేశవ్యాప్తంగా విక్రయించే  ప్రయత్నాలు చేస్తోంది.

Most from this category