STOCKS

News


ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఐఎస్‌బీ ప్రొఫెసర్‌

Saturday 8th December 2018
news_main1544239870.png-22741

న్యూఢిల్లీ: ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, హైదరాబాద్‌ క్యాంపస్‌ ప్రొఫెసర్‌ కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. మూడు సంవత్సరాలపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. అరవింద్‌ సుబ్రమణియన్‌ ప్రధాన ఆర్థిక సలహాదారు పదవిని (సీఈఏ) ఈ ఏడాది జూలైలో వీడగా, అప్పటి నుంచి ఈ పోస్ట్‌ ఖాళీగా ఉంది. ఈ పోస్ట్‌కు ఐఎస్‌బీ హైదరాబాద్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ను నియమించాలన్న ప్రతిపాదనను కేబినెట్‌ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆమోదించినట్టు ప్రభుత్వం శుక్రవారం తెలియజేసింది. పారిశ్రామికాభివృద్ధి, విదేశీ వాణిజ్యం, పారిశ్రామిక ఉత్పత్తి, ప్రధాన ఆర్థిక విషయాల ప్రకటనల్లో కేంద్ర ప్రభుత్వానికి విధానపరమైన సూచనలు, సలహాలను సీఈఏ ఇవ్వాల్సి ఉంటుంది.
అపార అనుభవం
ఐఐటీ, ఐఐఎం పూర్వ విద్యార్థి అయిన సుబ్రమణియన్‌ ఫైనాన్షియల్‌ ఎకనమిక్స్‌లో అమెరికాలోని షికాగో యూనివర్సిటీ, బూత్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ నుంచి పీహెచ్‌డీ పట్టా కూడా పొందారు. బ్యాంకింగ్‌, కార్పొరేట్‌ గవర్నెన్స్‌, ఎకనమిక్‌ పాలసీల్లో సుబ్రమణ్యం దిట్ట. సెబీ కార్పొరేట్‌ గవర్నెన్స్‌ కమిటీ, ఆర్‌బీఐ బ్యాంకింగ్‌ గవర్నెన్స్‌ కమిటీల్లోనూ పనిచేశారు. ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, ప్రైమరీ మార్కెట్స్‌, సెకండరీ మార్కెట్స్‌, రీసెర్చ్‌ విషయాల్లో సెబీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగానూ వ్యవహరించారు. బంధన్‌ బ్యాంకు, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకు మేనేజ్‌మెంట్‌, ఆర్‌బీఐ అకాడమీ బోర్డులకు ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2015 ఆర్థిక సర్వే విషయమై అప్పటి ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ను సహకారం అందించారు. ప్రస్తుత ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ విరాళ్‌ ఆచార్యతో కలసి 2009లో దివాలా కోడ్‌పై పనిచేశారు. తన కెరీర్‌ ప్రారంభానికి ముందే జేపీ మోర్గాన్‌ చేజ్‌కు కన్సల్టెంట్‌గా, ఐసీఐసీఐ బ్యాంకులోనూ పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.



You may be interested

జైట్లీపై ‘పిల్‌’ను కొట్టేసిన సుప్రీం

Saturday 8th December 2018

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మూలధన నిల్వలకు సంబంధించి ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీపై దాఖలయిన ఒక​ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. ఈ పిల్‌ను దాఖలు చేసిన ఎం.ఎల్‌.శర్మ అనే న్యాయవాదికి రూ.50,000 కాస్ట్‌ను కూడా సుప్రీం విధించడం గమనార్హం. ఈ మొత్తం డిపాజిట్‌ చేసే వరకూ శర్మ ఎటువంటి పిల్‌ దాఖలు చేయలేరని, అందుకు అనుమతించవద్దని అత్యున్నత న్యాయస్థానం రిజిస్ట్రీని బెంచ్‌ ఆదేశించింది.

ఎస్‌బీఐ నిధుల సమీకరణకు వాటాదారుల ఆమోదం

Saturday 8th December 2018

న్యూఢిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.20,000 కోట్ల నిధుల సమీకరణకు ఆ బ్యాంక్‌ వాటాదారుల ఆమోదం లభించింది. షేర్ల విక్రయం ద్వారా రూ.20,000 కోట్లు సమీకరించనున్నామని, ఈ నిధుల సమీకరణకు తమ వాటాదారులు ఆమోదం తెలిపారని ఎస్‌బీఐ వెల్లడించింది. ముంబైలో జరిగిన వాటాదారుల సాధారణ సమావేశంలో ప్రత్యేక తీర్మానం ద్వారా ఈ నిధుల సమీకరణకు ఆమోదం లభించిందని పేర్కొంది. ఫాలో ఆన్‌ ఆఫర్‌ లేదా క్యూఐపీ/జీడీఆర్‌/ఏడీఆర్‌ లేదా మరే

Most from this category