STOCKS

News


గూగుల్ ఇండియా లాభాలు 33% అప్‌

Friday 12th October 2018
news_main1539318926.png-21077

న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్ భారత విభాగం ఆదాయాలు 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.9,338 కోట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.7,239 కోట్లతో పోలిస్తే ఇది 29 శాతం అధికం. మరోవైపు, నికర లాభం 33 శాతం పెరిగి రూ. 307 కోట్ల నుంచి రూ. 407 కోట్లకు పెరిగింది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ టోఫ్లర్‌ ఈ వివరాలు వెల్లడించింది. వీటి ప్రకారం గూగుల్ ఇండియా మొత్తం వ్యయాలు 29 శాతం పెరిగి రూ. 6,760 కోట్ల నుంచి రూ. 8,710 కోట్లకు చేరాయి. భారత్‌లో క్లౌడ్‌, పేమెంట్స్ వంటి సర్వీసులను విస్తరించడంపై గూగుల్ గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తుండటం ఇందుకు కారణం. 2017-18లో కార్పొరేట్ సామాజిక కార్యక్రమాల కింద గూగుల్ రూ. 20.3 కోట్లు వెచ్చించింది. 



You may be interested

మరికొన్ని దిగుమతులపై సుంకాల పెంపు

Friday 12th October 2018

న్యూఢిల్లీ: కరెంటు ఖాతా లోటు కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండో విడత కింద మరికొన్ని ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను పెంచింది. వీటిలో కమ్యూనికేషన్‌ ఉత్పత్తులు, బేస్‌ స్టేషన్‌, డిజిటల్‌ లైన్‌ సిస్టమ్స్‌ ఉన్నాయి. వీటిపై సుంకాలను 10 శాతం నుంచి 20 శాతానికి పెంచింది. కస్టమ్స్‌ టారిఫ్‌ చట్టం 1975లోని చాప్టర్‌ 85 కింద వచ్చే పలు వస్తువులపై దిగుమతి సుంకాలు విధించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం

ఆధార్‌ బయటపెడితే నష్టమేం లేదు: ఆర్‌ఎస్‌ శర్మ

Friday 12th October 2018

న్యూఢిల్లీ: ట్రాయ్‌ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ మరోసారి ఆధార్‌ గోప్యతపై తన అభిప్రాయాలను గట్టిగా వినిపించారు. ఆధార్‌ నంబర్‌ను బయటపెట్టడం వల్ల డిజిటల్‌ పరంగా వచ్చే ముప్పేదీ లేదన్నారు. తన ఆధార్‌ నంబర్‌ ప్రకటించి, దీన్ని ఎలా దుర్వినియోగం చేస్తారో చూపించండంటూ శర్మ గతంలో సవాల్‌ విసిరి వార్తల్లో నిలిచిన విషయం గమనార్హం. ఆధార్‌ గోప్యత అనే అంశం చుట్టూ ఇంత కాలం జరిగిన చర్చలకు, ఎన్నో ప్రశ్నలకు ఇటీవలి

Most from this category