STOCKS

News


సాగర్‌ సిమెంట్ షేరును కొనొచ్చు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌

Saturday 11th August 2018
Markets_main1533983908.png-19183

ముంబై:- దేశంలోని సిమెంట్‌ కంపెనీ షేర్లకు మంచి రోజులొచ్చాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన అందరికీ గృహవసతి కల్పన కార్యక్రమంతో పాటు పలు నిర్మాణ కార్యక్రమాలతో రానున్న రోజుల్లో నిర్మాణ రంగం మరింత వేగంగా వృద్ధి చెందుతుందనే అంచనా వేస్తుంది. ఉత్పత్తి భారీగా పెరుగుతుండంతో డిమాండ్‌ ఊపందుకోవడం, కంపెనీల అధిక వ్యయాల తగ్గింపునకు తగిన విధంగా వ్యూహరచనలు సిమెంట్‌ కంపెనీలను లాభాల బాట పట్టిస్తున్నాయని తెలిపింది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో పలు కంపెనీలు ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధించాయి. దీంతో పలు రేటింగ్‌ సంస్థలు, బ్రేకరేజ్‌ సంస్థలు సాగర్‌ సిమెంట్‌ షేరును  కొనొచ్చని అంటున్నాయి. వాటిలో ప్రముఖ రేటింగ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఈ సిమెంట్‌ షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ ఇచ్చింది. ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సంస్థ ఈ షేరుపై విశ్లేషణ చూద్దాం..!
రేటింగ్‌:- కొనొచ్చు.
ప్రస్తుత దర:- రూ.785.10
టార్గెట్‌ ధర:- రూ.1,025.

విశ్లేషణ:- వ్యయాల్లో అధిక భాగమైన విద్యుత్‌ ఖర్చును తగ్గించుకోవడానికి సొంతంగా పవర్‌ ప్లాంట్‌ కలిగి ఉంది. పెరిగిన అమ్మకాల పరిణామం స్థిరమైన ఆదాయన్ని సమకూర్చనుండగా,  అనుకున్న సమయానికి ఉత్పత్తి తయారీ చేయడంతో వ్యయాలు తగ్గుతాయి. ఈ త్రైమాసికంలో మహారాష్ట్రతో పాటు దేశంలో పశ్చిమ ప్రాంత రాష్ట్రా మార్కెట్లో అమ్మకాలు పెరగడానికి  ఇప్పటికే కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే 2018-20 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల వృద్ధిలో  20శాతం పెరుగుదల, లాభంలో 26శాతం పెరగుదలను సాధిస్తుందని అంచనా వేస్తున్నాం. అయితే  సిమెంట్‌ ధరల తగ్గడంతో ఈ త్రైమాసికంలో ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధించలేకపోయింది. 

View Pdf One (1533984002SGC_CU_200718.pdf)

You may be interested

తక్కువ ధరల్లో ఎన్నో షేర్లు

Sunday 12th August 2018

విలువైన స్టాక్స్‌ ఏవి? మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లో చాలా వరకు షేర్లు నష్టపోయి తక్కువ ధరలకే లభిస్తున్న ఈ తరుణంలో పెట్టుబడులకు మంచి స్టాక్స్‌ ఏవన్న మీమాంసతో ఇన్వెస్టర్లు కొందరు ఉన్నారు. ఈ విధంగా చూసినప్పుడు 40 శాతం వరకు పతనమైన తక్కువ ధరలకు లభిస్తున్న కొన్ని వాల్యూ స్టాక్స్‌ ఉన్నాయంటున్నారు నిపుణులు.    ప్రధాన సూచీలు కొత్త జీవిత శిఖరాలకు చేరినప్పటికీ మిడ్‌, స్మాల్‌క్యాప్‌ విభాగాలు మాత్రం ఇంకా

ఆటోమొబైల్స్‌ కంపెనీలపై పాజిటివ్‌ వ్యూ

Saturday 11th August 2018

భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషించే రంగాల్లో ఆటోమొబైల్‌ కూడా ఒకటి. ఇది జీడీపీలో దాదాపు 4 శాతం వాటాను ఆక్రమించి ఉంది. వాహన రంగంలో వృద్ధి జోరందుకుంటోంది. వినియోగం ఊపందుకోవడం ఇందుకు కారణం. టూవీలర్లు, ఫోర్‌వీలర్లు, ట్రాక్టర్ల విక్రయాలు వినియోగ డిమాండ్‌ను ప్రతిబింబిస్తున్నాయి. ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ అడ్వైజర్స్‌ చైర్మన్‌, ఎండీ డీకే అగర్వాల్‌ ఒక ఆంగ్ల చానల్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.

Most from this category